newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్.. విప్ జారీ

09-12-201909-12-2019 15:23:21 IST
Updated On 11-12-2019 10:09:57 ISTUpdated On 11-12-20192019-12-09T09:53:21.959Z09-12-2019 2019-12-09T09:53:13.593Z - 2019-12-11T04:39:57.585Z - 11-12-2019

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్.. విప్ జారీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం తిరుగుబాటు జండా ఎగురవేసినట్లేనా.. బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పౌరసత్వ బిల్లును వ్యతిరేకించడం అంటే ఇప్పుడున్న పరిస్థుతుల్లో మాటలు కాదూ. కానీ గత కొంత కాలంగా కేంద్రప్రభుత్వ విధానాల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న కేసీఆర్ కేంద్రంపై తిరుగుబాటు ప్రకటించేశారు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మత వివక్ష కారణంగా వలసవచ్చిన ముస్లిమేతరు లకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ బిల్లుపై కేంద్రం అభిమతానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలకు విప్ జారీ చేశారు. దీంతో కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవడానికే కేసీఆర్ సిద్ధమైనట్లు అర్థమవుతోంది. 

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పౌరసత్వ (సవరణ) బిల్లును నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మత వివక్ష కారణంగా వలసవచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ బిల్లును హోం మంత్రి అమిత్‌ షా దిగువ సభలో ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ, అనంతరం ఓటింగ్‌ జరగనుందని లోక్‌సభ వర్గాలు తెలిపాయి. 

అయితే ఈ కీలక బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీఆర్‌ఎస్‌ (తెలంగాణ రాష్ట్ర సమితి) ఎంపీలకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు పార్లమెంట్‌ సభ్యులకు విప్‌ జారీచేసింది. బిల్లుపై చర్చ సందర్భంగా ఈ రోజు, రేపు (సోమ, మంగళవారం) పార్లమెంట్‌కు తప్పకుండా హాజరుకావాలని పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంపీలకు సూచించారు. 

కాగా వివాదస్పద పౌరసత్వ బిల్లును కాంగ్రెస్‌, వామపక్షాలు, టీఆర్‌ఎస్‌తో పాటు ఎన్డీయేతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే లోక్‌సభలో అధికార బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఓటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండకపోచ్చని తెలుస్తోంది. ఎగువ సభలో మిత్రపక్షాల మద్దతును బీజేపీ కూడగొట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులకు విప్‌ జారీ చేసింది. సోమవారం నుంచి మూడు రోజులపాటు సభకు తప్పని సరిగా హాజరు కావాలని ఆదేశించింది. 

మొత్తం 23 మంది పార్లమెంటు సభ్యులున్న వైకాపా ఈ కీలకబిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. వైసీపీ కూడా బిల్లుకు వ్యతిరేకంగా విప్ జారీ చేస్తే కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు తెలుగు రాష్ట్రాలు తిరుగుబాటు బావుటా ఎగురవేసినట్లే నని కొద్దిరోజులుగా మీడియాలో వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లే. కానీ రాష్ట్ర ఆర్థిక అవసరాలకు కేంద్రంపై ఆధారపడి ఉన్న ఏపీ ప్రభుత్వం అంత సాహసానికి ఒడిగట్టడానికి అవకాశాలు తక్కువే అని పరిశీలకుల వ్యాఖ్య.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle