newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

పోస్టల్ పార్శిళ్ళ కలకలం.. అందులో ఏముందంటే?

21-08-201921-08-2019 12:06:26 IST
Updated On 21-08-2019 12:21:27 ISTUpdated On 21-08-20192019-08-21T06:36:26.608Z21-08-2019 2019-08-21T06:36:21.744Z - 2019-08-21T06:51:27.356Z - 21-08-2019

పోస్టల్ పార్శిళ్ళ కలకలం.. అందులో ఏముందంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొన్న నేపథ్యంలో ప్రతి చిన్న భద్రతా అంశాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ పోస్టాఫీసులో పార్శిళ్ళు కలకలం రేపుతున్నాయి.

సీఎం కేసీఆర్ సహా మంత్రులు, వీఐపీలకు పార్శిళ్ళు వచ్చాయి. పార్శిల్ రావడంపై పోస్టల్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఈ బాటిల్స్‌లో ఏముందనే విషయమై తేల్చేందుకు ల్యాబ్ కు పంపారు. ఇంత పెద్ద ఎత్తున ఒకే సారి వీఐపీలకు పార్శిల్ రావడంపై పోలీసులు కూడ విచారణ చేస్తున్నారు.ఈ బాటిల్స్ ఎక్కడ నుండి వచ్చాయనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. 

అయితే ఈ బాటిల్స్ లో మురుగు నీరు ఉందని ప్రాథమికంగా తేల్చారు. ఈ విషయమై ఇంకా పూర్తిస్థాయి నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఈ నెల 17వ తేదీన సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, వీఐపీలకు 62 కాటన్ బాక్స్ లను ఓ అజ్ఞాత వ్యక్తి  బుక్ చేశాడు.ఈ  కాటన్ లలో ఉన్న బాటిల్స్ లో లిక్విడ్ ఉన్నట్టుగా  గుర్తించారు.

అంతేకాదు ఈ బాటిల్స్ నుండి దుర్వాసన వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన సికింద్రాబాద్ పోస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం మేరకు పోలీసులు మంగళవారం సాయంత్రం ఈ బాటిల్స్ నుండి నమూనాలను సేకరించి ల్యాబ్ కు తరలించారు. ఈ బాటిల్స్ ఉన్న లిక్విడ్ ఏమిటనే విషయమై తేల్చేందుకు సిద్దమయ్యారు.

అయితేఈ బాటిల్స్ లో ఉన్న లిక్విడ్ మురుగు నీరు అంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాథమికంగా తేల్చింది. ఇంకా పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉంది. ఈ పార్శిల్స్ ఓయూ ప్రాంతం నుంచి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. కలుషిత తాగునీరుకి సంబంధించి తాము అనుభవిస్తున్న ఇబ్బందుల్ని కొందరు ప్రభుత్వంయ దృష్టికి తేవడానికి ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చని అంటున్నారు.

ఇలాంటి మురుగునీరే తాము తాగుతున్నామని వారు ఈ బాటిల్స్ నిండా నింపి పంపారని చెబుతున్నారు. ఈ బాటిల్స్ తో పాటు ఓ లేఖను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ లేఖలో ఈ అంశాలే ఉన్నాయి. ఈ లేఖ రాసిందెవరు? ఈ బాటిల్స్ ఎవరు పంపారనే  విషయమై పోలీసులు కూడ విచారణ చేస్తున్నారు. బాటిల్స్ లో ఎలాంటి రసాయనాలు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle