newssting
BITING NEWS :
*దిశ ఘటన మరువక ముందే మరో విషాదం... ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి*హైదరాబాద్‌ టీ-20లో టీమిండియా ఘన విజయం.. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టిన భారత జట్టు *హైదరాబాద్‌: ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. నిందితుల మృతహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలన్న హైకోర్టు... 9న ఉదయం 10.30 గంటలకు విచారణ *కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.*నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారింది: వైకాపా నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి*చింతపల్లిలో దారుణం.. కుక్కలకు బలయిన శిశువు *కర్నూలు: ఉల్లి కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన*ఇవాళ జార్ఖండ్ లో రెండవ విడత పోలింగ్ *దిశ నిందితులు కరుడుగట్టిన నేరస్తులు : సీపీ సజ్జనార్

పోలీసు కస్టడీకి దిశా కేసు నిందితులు

02-12-201902-12-2019 15:31:23 IST
Updated On 03-12-2019 08:55:39 ISTUpdated On 03-12-20192019-12-02T10:01:23.980Z02-12-2019 2019-12-02T09:35:06.123Z - 2019-12-03T03:25:39.545Z - 03-12-2019

 పోలీసు కస్టడీకి దిశా కేసు నిందితులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా జస్టిస్ ఫర్ దిశా అంటూ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంటులోనూ చర్చ జరుగుతోంది. బాధితురాలిని ఇకనుంచి ‘జస్టిస్ ఫర్ దిషా’గా పిలవాలని సీపీ సజ్జనార్ సూచించారు. నిందితులను చర్లపల్లి జైలులోని హై సెక్యూరిటీ బ్యారక్‌లో వేర్వేరు సెల్‌లలో ఉంచారు అధికారులు.

దిశా ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్‌.. ఈ కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

మరోవైపు దిశా ఘటనలో రిమాండులో ఉన్న నలుగురు నిందితులు ఆరీఫ్, చెన్నకేశవులు, నవీన్, శివలు ఆదివారం ఉదయం అల్పాహారంగా పులిహోర అందచేసిన అధికారులు.. రాత్రి మటన్ తో భోజనం ఇచ్చారు. జైలు నిబంధనలు ఖచ్చితంగా అమలుచేస్తున్నారు అధికారులు. జైల్లో కూడా వారిపై దాడి జరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఆయా బ్యారక్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భోజనం కూడా బ్యారక్‌ల వద్దకే పంపారు.

నిందితులు ఇంకా షాక్‌ నుంచి కోలుకోలేదని, తప్పు చేశామనే పశ్చాత్తాపం వారిలో కన్పిస్తోందని జైలు అధికారులు అంటున్నారు. ఇలాంటి ఘటనల్లో నిందితులకు అందించిన భోజనంపై జనం మండిపడుతున్నారు. చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను పోలీస్ కస్టడీకి ఇవ్వనున్నారు. దిశ హత్య కేసు నిందితులను వారంరోజుల కస్టడీ కోరారు పోలీసులు. కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు షాద్‌నగర్ పోలీసులు.నిందితుల తరపున వాదించకూడదని బార్ అసోసియేషన్ తీర్మానించడంతో వారి తరఫున వాదించేవారు లేకుండాపోయారు.నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేసింది కోర్టు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle