పోలీసు ఉంటేనే సామాజిక దూరం..లేకుంటే గుంపులు గుంపులే
29-03-202029-03-2020 16:15:02 IST
2020-03-29T10:45:02.036Z29-03-2020 2020-03-29T10:44:59.939Z - - 10-04-2021

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉంది. సగటున దేశంలో రోజూ 100కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వచ్చే పక్షం రోజులు మనకు కీలక తరుణం. జాగ్రత్తగా ఉండాలంటూ స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జాగ్రత్తపడాల్సిన అతివిలువైన సమయాన్ని దుర్వినియోగం చేసినందున తీవ్ర భయంకర పరిస్థితిని చవిచూస్తున్నామని, మీరైనా జాగ్రత్త పడండంటూ ఇటలీ, స్పెయిన్ దేశాలకు చెందిన పౌరులు మన దేశానికి సూచిస్తున్న వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. కానీ హైదరాబాద్ నగరంలో జనం గుంపులుగా తిరగటం, రోడ్లమీదకు రావడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇటు ఉదయం ఆరుకు ముందు, సాయంత్రం ఆరు తర్వాత రోడ్లు ఖాళీగా మారి జనం ఇళ్లకే పరిమితమవుతున్నా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు జన సమూహాలు కనిపిస్తున్నందున లాక్డౌన్ ఉద్దేశం నీరుగారుతోందని నిపుణులు అంటున్నా రు. ప్రస్తుతం రెండో దశలో ఉన్న కరోనా వ్యాప్తి, మూడో దశకు చేరుకుంటే చేతులెత్తేయటం తప్ప చేసేదేమీ ఉండదని గట్టిగానే హెచ్చరిస్తున్నా చాలా మందిలో ఆ భయం ఎక్కడా కనిపించటం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఏ టీవీ న్యూస్ చానల్ పెట్టినా కరోనాకు సంబంధించిన వార్తలే ప్రసారమ వుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ చానళ్లలో కూడా ప్రముఖుల సందేశాలు ప్రసారమవుతున్నాయి. వైరస్ వ్యాప్తి అత్యంత ఉధృతంగా ఉండి రోజుకు సగటున 600 మందికి పైగా చనిపోతున్న ఇటలీ, స్పెయిన్ దేశాలకు సంబంధించిన దృశ్యాలు ప్రసారమవుతున్నాయి. వీటన్నింటికి మించి వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో భయం పుట్టించే తరహాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రజల్లో చైతన్యం రాకపోవటం గమ నార్హం. సాధారణంగా ఆంక్షలు విధించినప్పుడు భయంతో అమలు చేయటం కద్దు.. కానీ, కరోనాలాంటి భయంకర వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నా.. జాగ్రత్తలు పాటించకపోవటం విచిత్రం. సామాజిక దూరం పాటించడం ఒక్కటే ప్రస్తుతానికి కరోనాను నియంత్రించే పద్ధతిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా జనం చెవికెక్కటం లేదు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు జోడించి అర్థించినా ప్రజల తీరు మారటం లేదు. లాక్డౌన్కు సంబంధించి కఠిన ఆంక్షలు విధించినా నిత్యావసర వస్తువుల కోసం ఉదయం నుంచి సాయంత్రం వర కు ప్రజలు రోడ్లపైకి వచ్చే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ వెసులుబాటును దుర్వినియోగం చేస్తూ ప్రజలు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. మార్కెట్లు, మెడికల్స్ ఎదుట గుంపులుగా పోగవుతూ సాధారణ రోజులను తలపిస్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా పరిణమించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లోని ప్రధాన కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఎక్కడా ఆంక్షలు అమలు కావటం లేదు. ఒక్కో దుకాణం వద్ద పదులసంఖ్యలో గుమికూడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా కూరగాయలకు కొరత లేదు. అయినా జనం మార్కెట్లకు ఎగబడుతున్నారు. కూరగాయల మార్కెట్ల వద్ద వలంటీర్లనో, పోలీసులనో ఉండేలా చేస్తే తప్ప తీరు మారే సూచనలు కనిపించటం లేదు. ఎక్కడైనా జనం గుమికూడితే చర్యలు తీసుకుంటామనో, యజమానులపై కఠినంగా వ్యవహరిస్తామనో... హెచ్చరిక చేయాల్సి ఉంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
3 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
5 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా