పోలీసుల పహారా మాటున బిక్కుబిక్కుమంటున్న న్యూస్ ఛానెల్!
18-03-202018-03-2020 13:24:55 IST
2020-03-18T07:54:55.947Z18-03-2020 2020-03-18T07:54:53.744Z - - 16-04-2021

ఓ ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఇప్పుడు పోలీసుల పహారా మధ్యన బిక్కుబిక్కు మంటూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ప్రపంచం మొత్తం కరోనా భయంతో ఆందోళనలో ఉంటే హైదరాబాద్ నగరంలో ఉంటూ.. టాప్ చానెల్స్ లో ఒకటిగా.. మెరుగైన సమాజం కోసమే పాటుపడతామని చెప్పుకుంటూ కొనసాగే ఆ చానెల్ మాత్రం ఎవరో వచ్చి ఏదో చేస్తారని భయపడుతూ పోలీసులను కాపలా ఉంచుకొని మరీ రోజు వారీ విధులను నిర్వర్తిస్తుంది. ఇప్పుడు ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ అటు మీడియా వర్గాలతో పాటు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మన రాజ్యాంగం ప్రకారం మీడియాకు మన దేశంలో కీలకమైన స్థానం కలిగి ఉంది. మన సమాజాన్ని నడిపించే కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల తర్వాత నాలుగో స్థానాన్ని.. హక్కుని మన రాజ్యాంగం మీడియాకు ప్రసాదించింది. మరి మన మీడియా ఆ విధులను సక్రమంగానే నిర్వర్తిస్తుందా? నిజానికి మన దేశంలో మీడియా.. అందులో చాలా సంస్థలు దాదాపుగా వ్యాపార మూసలో పడికొట్టుకుపోతున్నాయి. ఇది జాతీయ స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు సర్వసాధారణ అంశంగా మారిపోయింది. ఒకరిని చూసి మరొకరు అమ్ముడు పోవడం.. ఏకంగా వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు మీడియా సంస్థలను ఏర్పాటు చేసి జర్నలిస్టులను కొనేయడంతో ఇప్పుడు ప్రజలకు నిజమేదో.. కల్పితమేదో కూడా అర్ధం చేసుకోలేని పరిస్థితి. ఇక మన తెలుగు మీడియా విషయానికి వస్తే.. ఒకటి అర తప్ప మెయిన్ స్ట్రీమ్ చానెళ్లన్నీ హైదరాబాద్ నుండే కార్యకలాపాలను సాగిస్తున్నాయి. అందులో ఒకటి రెండు చానెళ్లు ప్రత్యక్షంగా కొన్ని పార్టీలకు చెందినవే కాగా మరికొన్ని మీడియా సంస్థలలో దాదాపుగా పూర్తిస్థాయి నుండి అర్ధభాగం వరకు కొందరు వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలు వాటాలు కొనేసుకున్నారు. అందులో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల చేతుల్లోనే ఈ వాటాలు ఉన్నాయన్నది నమ్మలేని నిజం. కాంట్రాకర్లు కమ్ పారిశ్రామిక వేత్తలైన ఆ ఇద్దరూ ఇప్పుడు తెలంగాణ మీడియాను ఎంతగానో ప్రభావితం చేస్తున్నారన్నది కూడా మీడియా రంగంలో బాగానే వినిపిస్తున్న మాట. ఇక పోలీసుల పహారా మాటున విధులను సాగిస్తున్న ఆ చానెల్ విషయానికి వస్తే ఆ మధ్యనే సంస్థ చేతులు మారే సమయంలో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు కూడా అన్నీ ఇన్నీ కావు. కాగా ఇప్పుడు ఈ చానెల్ ఓ ఎంపీపై ఆరోపణల పోరాటమే చేస్తుంది. ఈ చానెల్ ఓ పార్టీకి చెందిన ఎంపీ భూ ఆక్రమణల పేరుతో రోజుకి గంటల తరబడి ఆరోపణలు గుప్పిస్తుంది. అదిగో అక్కడ.. ఇదిగో ఇక్కడ.. ఎంపీ.. ఎంపీ కుటంబమంతా కబ్జాదారులే అంటూ ఎంత వీలుంటే అంత ఆరోపణల దుమారం రేపుతోంది. ఒక్కోసమయంలో న్యూస్ ప్రెసెంట్ చేసే యాంకర్ల నోటి నుండి ఎంపీని ఏకవచనంతో సంబోధిస్తూ చేసే వ్యాఖలను చూసి ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు. అంతగా ఆ చానెల్ ఎంపీపై విరుచుకుపడుతుంది. మరి సదరు ఎంపీ వర్గం మాత్రం ఊరికే ఉంటుందా? పద్ధతి మార్చుకోకేపోతే మూల్యం తప్పదంటూ ఆ చానెల్ కి ఎంపీ వర్గం కార్యకర్తలు, శ్రేణులు హెచ్చరికలు చేయడంతో చానెల్ మరింత డోస్ పెంచింది. అయితే ఎక్కడ తనపై దాడి చేస్తారోనని పోలీసుల భద్రత కోరింది. దీంతో రెండు రోజులుగా పోలీసులు కార్యాలయాన్ని చుట్టుముట్టి కాపలా కాస్తున్నారు. అయితే మెరుగైన సమాజం కోసం పనిచేసే చానెల్ కి పోలీసుల కాపలా అవసరం వచ్చిందా అంటూ అటువైపు వెళ్లే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు!

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
26 minutes ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
an hour ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
15 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
11 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
13 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
16 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
18 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
21 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
a day ago
ఇంకా