newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

పోలీసులు సకాలంలో స్పందిస్తే జరిగేది ఇదే...!

06-12-201906-12-2019 11:56:01 IST
2019-12-06T06:26:01.478Z06-12-2019 2019-12-06T06:25:59.096Z - - 25-02-2020

పోలీసులు సకాలంలో స్పందిస్తే జరిగేది ఇదే...!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శంషాబాద్ సమీపంలో డాక్టర్ దిశ హత్యాచార ఘటనపై పోలీసులుపై వెల్లువెత్తిన విమర్శలు ఆ నలుగురు ముష్కరులను ఎన్‌కౌంటర్ చేయడంతో పూలదండలుగా మారిపోయాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆలస్యంగా అయినా పోలీసులు ప్రజాభిప్రాయాన్ని గౌరవించిన తీరు పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఒక విషయం కాగా.. పోలీసు యంత్రాంగం సమస్యల్లో చిక్కుకున్న వారిపట్ల సకాలంలో వేగంగా స్పందిస్తే సమస్యలు ఎంత సులభంగా పరిష్కారం అవుతాయో హైదరాబాద్‌లో గురువారం జరిగిన ఘటన తెలుపుతోంది.

డయల్ 100‌కు వచ్చిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఏడు నిమిషాల్లో సంఘటనా స్థలికి చేరుకుని ఉరి వేసుకున్న వ్యక్తిని తలుపులు బద్దలు కొట్టి మరీ కాపాడిన వైనం తీవ్ర ఉత్కంఠను కలిగించింది. డయల్‌ 100కు సమాచారం అందిన ఏడు నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుకున్న పోలీసులు ఉరికి వేలాడుతున్న వ్యక్తిని సురక్షితంగా కాపాడిన సంఘటన చిలకలగూడ పరిధిలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే  నగరంలోని చిలకలగూడలో అక్బర్‌ఖాన్‌ (45) వహిదాబేగం దంపతులు నివాసం ఉంటున్నారు. అక్బర్‌ఖాన్‌  కార్పెంటర్‌గా పని చేసే వాడు. ఆర్థిక సమస్యల నేపథ్యంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.  గురువారం మధ్యాహ్నం కూడా వారి మధ్య మరోమారు ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఉన్న అక్బర్‌ ఖాన్‌ వహీదా బేగంపై దాడి చేయడంతో ఆమె డయల్‌ 100కు సమాచారం అందించింది. దీంతో అయితే అప్పటికే  సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు క్షణాల్లో స్పందించారు. 

పెట్రోకార్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ కిరణ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. తలుపులు కొట్టినా స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూడగా అక్బర్‌ఖాన్‌ ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో అప్రమత్తమైన కిరణ్‌కుమార్‌ గట్టిగా తన్నడంతో తలుపులు తెరుచుకున్నాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అక్బర్‌ఖాన్‌ను కిందికి దించి ప్రాథమిక చికిత్స అందించాడు.

అనంతరం అతడిని 108లో గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించడంతో కోలుకున్నాడు. ఓ వ్యక్తిప్రాణా లు కాపాడిన కానిస్టేబుల్‌ కిరణ్‌కుమార్‌తోపాటు తక్షణ మే స్పందించిన చిలకలగూడ డీఐ సంజయ్‌కుమార్‌ను పోలీస్‌ ఉన్నతాధికారులు అభినందించారు. 

అక్బర్‌ఖాన్‌ తనపై దాడి చేస్తున్నాడని అతడి భార్య వహీదాబేగం గురువారం ఉదయం 12 గంటల 38 నిమిషాల 37 సెకెన్లకు డయల్‌ 100కు ఫిర్యాదు చేసింది. 1.14 నిమిషాల్లో కాల్‌ను యాక్సెప్ట్‌ చేసిన సిబ్బంది చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు. 12 గంటల 45 నిమిషాల 26 సెకెన్లకు అంటే ఫిర్యాదు చేసిన ఏడు నిమిషాల్లోనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అత్మహత్యాయత్నానికి పాల్పడిన అక్బర్‌ఖాన్‌ను కాపాడారు. కోలుకున్న అనంతరం అక్బర్‌ఖాన్‌తోపాటు అతని కుటుంబసభ్యులు, బంధువులకు చిలకలగూడ అడ్మిట్‌ఎస్‌ఐ రవికుమార్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle