పోలీసులు వస్తే ఇళ్లలోకి పరుగులు.. వారెళ్లిపోతే బయటకు ఉరుకులు
14-04-202014-04-2020 14:37:32 IST
Updated On 14-04-2020 14:55:49 ISTUpdated On 14-04-20202020-04-14T09:07:32.367Z14-04-2020 2020-04-14T09:03:39.394Z - 2020-04-14T09:25:49.969Z - 14-04-2020

కరోనా కట్టడి విషయంలో మిగతా ప్రపంచ దేశాలకంటే భారత్ ఎంతో ముందంజలో ఉందని అందుకే దేశంలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైన తర్వాత నెలరోజుల్లో పది వేల కేసులుమాత్రమే దేశంలో నమోదయ్యాయని మనం ఎంతో ఘనంగా చెప్పుకోవచ్చు కానీ లాక్ డౌన్ భావననే అపహాస్యం చేస్తూ ప్రజలు ఇళ్లలోంచి గుంపులు గుంపులుగా బయటకు రావడం, కూరగాయల కోసం రోడ్లపైకి మాస్కులు లేకుండా యధేచ్చగా తిరగటం, దుకాణాల వద్ద, తోపుడు బంఢ్లవద్ద గుంపులుగా మహిళల చేరడం, రేషన్ షాపుల వద్ద కూడా భౌతిక దూరం పాటించకపోవడం వంటివి ఇప్పటికీ జరిగిపోతుండటం చూస్తుంటే కరోనా వైరస్ గురించి సామాన్య జనం ఇంకా పెద్దగా పట్టించుకోవడం లేదనిపిస్తుంది. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో పోలీసులు వస్తే ఇళ్లలోకి పరుగులు తీయడం.. వారు అలా వెళ్లిపోతే మళ్లీ ఇళ్లలోంచి బయటకు రావడం అనే అలవాటును మానుకోకపోతే ఎన్ని ఆంక్షలు విధించినా కరోనా కట్టడి కష్టమే అనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైనప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా విభజించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి కాలు బయటపెట్టకూడదు. నిత్యావసర వస్తువులను ఇళ్ల వద్దకే సరఫరా చేస్తారు. అత్యవసరం అయితే అధికారులకు సమాచారం అందించాలి. నిబంధనలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. కానీ జనం వాటిని పెడచెవిన పెట్టారు. మరోవైపు ఇళ్లవద్దకే అన్నీ సమకూరుస్తామన్న అధికారుల మాటలు ఆచరణలో కనిపించలేదు. దాదాపు అన్ని కంటైన్మెంట్ క్లస్టర్ల వద్ద ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కూరగాయల సాకుతో రోడ్లపై రాకపోకలు. సామాజిక దూరం పాటించకపోగా నిత్యావసరాల కోసం కాలనీల్లో మాస్కులు లేకుండానే యథేచ్ఛగా తిరుగుతూకనిపించారు. కంటైన్మెంట్లోని అన్ని వీధుల్లో రెండుసార్లు సోడియం హైపోక్లోరైడ్ను పిచికారీ చేయాల్సి ఉన్నా.. కేవలం కరోనా కేసులు నమోదైన వీధుల్లో మాత్రమే పిచికారీ చేయడంతో పలు కాలనీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటైన్మెంట్ క్లస్టర్ల పరిస్థితిపై మీడియా క్షేత్రస్థాయి విజిట్ నిర్వహించగా, ఏ కాలనీకి వెళ్లినా ప్రజలు రోడ్లపైనే కనిపించారు. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించినా ప్రజల్లో ఏమాత్రం మార్పు కనిపించకపోగా.. అధికారులు సైతం అందుకు తగినట్లు పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోవడం కనిపించింది. కరోనా.. కోవిడ్19.. పేరేదైనా ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్.. అందుకే లాక్డౌన్ .. కొన్నిచోట్ల వైరస్ విస్తరిస్తుందేమోనన్న అనుమానంతో ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్ చేశారు.. అంటే అక్కడున్నవారు బయటకు రాకూడదు.. బయటి వారు ఆ ప్రాంతానికి వెళ్లరాదు.. ఇదీ నిబంధన. ఇందుకు పోలీసులు, రెవెన్యూ,జీహెచ్ఎంసీ సిబ్బంది నిరంతరం చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసరాలు కూడా అందజేస్తున్నారు. అయితే ఈ కంటైన్మెంట్ ప్రాంతాల్లో అక్కడక్కడా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు బయట తిరుగుతున్నారు. కొనుగోళ్లు చేస్తున్నారు. ఇలా అయితే ఎలా అని అడిగితే మరి నిత్యావసరాలు అధికారులు ఇవ్వడం లేదు.. మేమే వెళ్లి తెచ్చుకుంటున్నాం అని చెబుతున్నారు ప్రజలు. అధికారులు కూడా ఈ విషయంపై దృష్టి సారించలేదు. లాక్ డౌన్ నిబంధనలను పట్టించుకోవడంలో పేద గొప్ప తారతమ్యాలు, సంపన్నులు నివసించే ప్రాంతాలు అనే తేడా లేకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మీడియా ఒక్కరోజు చేసిన పరిశీలనలోనే తేలిపోయంది. అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసినా పక్కనే ఉన్న పార్కు నుంచి బయటకు వచ్చి సరుకులు కొనుక్కుంటున్నారు. కాలనీలో మహిళలు మాస్కులు లేకుండా మాటామంతి సాగిస్తున్నారు. కిరాణా షాపు వద్ద భౌతిక దూరం లేకుండా ప్రజలు సరుకులు కోనుగోలు చేస్తున్నారు. మంసం దుకాణాల వద్ద స్వీయ నియంత్రణ పాటించకుండా జనం గుమిగూడారు. నిత్యావసర సరుకులు, కూరగాయల కోసం బయటకు వస్తున్నారు. వ్యక్తి గత దూరం పాటించకుండా, మాస్క్లు ధరించ కుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. కంటైన్మెంట్ బస్తీలు, కాలనీలలోకి యథేచ్ఛగా రాకపోకలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులను ఇళ్లవద్దకే వచ్చి అందిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఆచరణలో అమలైతే తప్ప ప్రజలు తమ అవసరాల కోసం బయటకు రావడం తప్పదు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
3 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
5 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా