newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

పోలీసులపై పూల వర్షం. దేశమంతా హర్షధ్వానాలు..

06-12-201906-12-2019 11:41:34 IST
Updated On 06-12-2019 17:45:36 ISTUpdated On 06-12-20192019-12-06T06:11:34.803Z06-12-2019 2019-12-06T06:11:32.349Z - 2019-12-06T12:15:36.337Z - 06-12-2019

పోలీసులపై పూల వర్షం. దేశమంతా హర్షధ్వానాలు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శంషాబాద్‌లో డాక్టర్ దిశ హత్యకేసు నిందితులను శుక్రవారం వేకువ జామున ఎన్‌కౌంటర్‌ చేయడంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద శుక్రవారం తెల్లవారుజామున నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులను ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ పోలీసులు జిందాబాద్‌ అంటూ పూల వర్షం కురిపిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ ద్వారా సరైన సమాధానం చెప్పారంటూ స్థానికులు వ్యాఖ్యానించారు. ఆడపిల్లలు ఉన్న తండ్రులుగా...నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడమే సరైన చర్య అని అభిప్రాయపడ్డారు.

దిశ నిందితులు.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన వార్త తెలియడంతో సంఘటనా స్థలానికి స్థానికులు తండోపతండాలుగా చేరుకున్నారు. తెలంగాణ పోలీసులకు జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు పెద్ద సంఖ్యలో జనాలు తరలి రావడంతో  44వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్‌ అయింది. స్థానికుల్ని నియంత్రించడం ఓ దశలో పోలీసులకు సమస్యగా మారింది. ఇక హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్‌కౌంటర్‌ను పెద్ద ఎత్తున సమర్థిస్తున్నారు. పలుచోట్ల సంబరాలు జరుపుకుని, స్వీట్లు పంచుకుంటు తమ హర్షం వ్యక‍్తం చేస్తున్నారు. సెలబ్రిటీలు, మాజీ ముఖ్యమంత్రులు, ఎంపీలు అందరూ తేడా లేకుండా ఈ ఎన్ కౌంటర్ ఘటనను సమర్థిస్తున్నారు.

దిశ అత్యాచారం, హత్యకేసును దేశం మొత్తం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహారించిన ఆ నలుగురు మృగాళ్లకు భూమ్మీద బతికే హక్కు లేదని జనం నినదించారు. మృగాళ్ల హేయమైన చర్యకు బలైపోయిన దిశకు న్యాయం జరగాలంటే ఆ నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ షాద్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా ఎంపీలే ఈ నినాదాలు చేయడం.. ఘటన తీవ్రతకు అద్దం పట్టింది. దీంతో అన్ని వైపులా నుండి పోలీసులపై ఒత్తిడి పెరిగింది. 

ఈ క్రమంలోనే నిందితులను సీన్‌ రీకనస్ట్రక్షన్‌కు తరలించడం..అక్కడ వారు తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. పోలీసులపై మొదట ప్రధాన నిందితుడు ఆరిఫ్ దాడికి యత్నించాడు. అనంతరం అతడికి మిగిలిన నిందితులు జత కలిశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు...కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ తెల్లవారు జామున మూడున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనా ప్రాంతాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. 

కానీ జాతి చైతన్యాన్ని ప్రశ్నించిన, కదలించిన దిశ హత్యాచారం కేసులో నిందితులను ఆమెను హత్య చేసిన ప్రాంతంలోనే పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం చట్టపరంగా అనేక సమస్యలకు దారి తీయనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దారుణ మారుణ కాండకు పాల్పడిన దిశ హంతకులకు ఈ గతి పట్టడం తప్పదని, అనివార్యమని ఎన్ని సమర్థనలు చేసుకున్నా ఇంతవరకు ఎన్ కౌంటర్ల పేరిట జరిగిన ఘటనలన్నీ పక్కకు పోయి ఇకపై లైసెన్సెడ్ కిల్లింగ్  వ్యవస్థీకృతం అవుతుందోమోనని ఆందోళన కలుగుతోంది.

ఏదేమైన మనిషి జన్మకు అపచారం చేస్తూ దిశ హంతకులు చేసిన దారుణ కృత్యానికి వారికి తగిన శాస్తి జరిగిందని దేశమంతా కొనియాడడం విశేషం. దారుణాలు జరిగిన తర్వాత తీరిగ్గా పోలీసు యంత్రాంగం ఇలా స్పందించేదానికన్నా నేరాలను ముందుగానే అరికట్టగలిగే సమర్థ శోధనను పోలీసులు చేపట్టడం మంచిది.

 

 

 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   7 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   7 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   10 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   10 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   11 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   12 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   14 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   15 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   15 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle