newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

పోలీసులకు షాక్ ...డ్యూటీలో అయ్యప్పదీక్ష కుదరదట

06-11-201906-11-2019 14:51:38 IST
2019-11-06T09:21:38.706Z06-11-2019 2019-11-06T09:21:32.768Z - - 22-02-2020

పోలీసులకు షాక్ ...డ్యూటీలో అయ్యప్పదీక్ష కుదరదట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అయ్యప్ప దీక్ష చాలా కఠినంగా ఉంటుంది. మనసును, శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఏటా సంక్రాంతి వరకూ అన్ని వృత్తుల వారు అయ్యప్పదీక్షలు వేసుకుంటారు. కానీ ఈసారి పోలీసు డిపార్ట్ మెంట్లో పనిచేసేవారు డ్యూటీలో ఉండి అయ్యప్పదీక్ష వేసుకోవడం ఆంక్షలు అమలవుతున్నాయి. డ్యూటీలో అయ్యప్ప దీక్ష అంటే కుదరదంటూ రాచకొండ సీపీ ఆదేశాలు జారీచేయడం సంచలనం కలిగిస్తోంది. 

అయ్యప్ప మాలలు వేసుకోవాలనుకునే పోలీసు సిబ్బందికి రాచకొండ పోలీస్ కమిషనరేట్ మార్గదర్శకాలు జారీచేసింది. మాల ధరించి అయ్యప్ప దీక్ష చేపట్టాలని పోలీసులు ఎవరైనా అనుకుంటే... వాళ్లు సెలవుపై వెళ్లాలని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సూచించారు. పోలీసు శాఖలో విధుల్లో ఉన్న వారు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని కమిషనర్ ఆదేశాలు జారీచేయడంతో పోలీసులు షాక్ తింటున్నారు.

సాధారణంగా అయ్యప్ప దీక్ష సమయంలో పోలీసు సిబ్బంది ఆచరించే నియమాల నేపథ్యంలో పోలీస్‌ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవడం జరుగుతుంది. పోలీసు యూనిఫాంకి బదులుగా నలుపు రంగు దుస్తులు ధరిస్తారు. తాజాగా కొంతమంది సిబ్బంది అయ్యప్ప దీక్షలు, పూజలు, యూనిఫాం మినహాయింపు గురించి అధికారుల అనుమతి కోరారు. 

వీటిని పరిశీలించిన రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్‌ భగవత్‌ ప్రధాన కార్యాలయం ప్రత్యేక మెమో జారీ చేసింది. యూనిఫాం, షూ లేకుండా పోలీస్‌ సిబ్బంది విధులు నిర్వహించడం కుదరదని పేర్కొంది. అయ్యప్ప దీక్ష చేపట్టే సిబ్బంది సెలవు తీసుకోవాలని ... అయ్యప్ప దీక్ష దుస్తుల్లో హాజరుకాకూడదన్నారు. పోలీస్‌ సిబ్బంది గడ్డాలు, మీసాలు పెంచి విధులు నిర్వహించడం కుదరదని ఖరాఖండీగా చెప్పారు. అయ్యప్ప దీక్షకు దిగేవారు రెండునెలలు సెలవు పెట్టుకోవచ్చని మెమోలో సూచించారు.  ఇలాంటి వినతుల్ని, మినహాయింపుల గురించి కమిషనరేట్ కు దరఖాస్తులు చేసుకోవద్దని సూచించారు. 

అందరికీ ఈ నియమం వర్తింపచేస్తారా? ఎమ్మెల్సీ రామచంద్రరావు 

రాచకొండ కమిషనర్ తాజా ఉత్తర్వులపై బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఘాటుగా స్పందించారు. చట్టం ముందు అందరూ సమానులే అన్నప్పుడు అన్ని మతాలకు ఒకటే నియమ, నిబంధనలు సర్వీస్ రూల్స్ ఒకేలా ఉండాలన్నారు. అయ్యప్ప దీక్షలు చేయాలనుకునేవారికి ఇది ఆటంకంగా ఉంటుందన్నారు.

Image result for mlc ramachandra rao"

ఈ నియమాలు క్రైస్తవులు, సిక్కులు, ముస్లింలకు కూడా  వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నిమతాల వారు వారి మత నియమాలకు అనుగుణంగా వ్యవహరిస్తారన్నారు. అలా అయితే ఆయా మతాల వారు మీసాలు, గడ్డాలు, తలపాగాలు లేకుండా డ్యూటీలకు రావాల్సి ఉంటుందని ‘న్యూస్ స్టింగ్’ తో అన్నారు. మత సామరస్యం ఉన్న మనదేశంలో మత విశ్వాసాలను అందరూ గౌరవించాలన్నారు. ఈ మెమో విషయంలో రాచకొండ కమిషనర్ పునరాలోచన చేయాలన్నారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు.  

 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   6 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   7 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   9 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   10 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   10 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   11 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   14 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   14 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   15 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle