newssting
BITING NEWS :
*నేడు మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

పోరుబాట‌లో పార్టీలు..! కేంద్రంపై నెట్టేసిన కేసీఆర్‌..!

16-09-201916-09-2019 12:25:24 IST
2019-09-16T06:55:24.567Z16-09-2019 2019-09-16T06:32:26.013Z - - 15-11-2019

పోరుబాట‌లో పార్టీలు..! కేంద్రంపై నెట్టేసిన కేసీఆర్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న‌ల్లమ‌లలో యురేనియం త‌వ్వకాల‌పై తెలంగాణ‌లో రాజ‌కీయ ర‌గ‌డ కొన‌సాగుతోంది. ప‌చ్చటి అడ‌వుల‌ను నాశ‌నం చేస్తూ గాలి, నీటిని క‌లుషితం చేసే యురేనియం త‌వ్వకాలు వ‌ద్దంటే వ‌ద్దు అంటూ ఇప్పటికే న‌ల్లమ‌ల‌లో పోరాటాలు జ‌రుగుతున్నాయి.

త‌మ ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టయినా యురేనియం త‌వ్వకాల‌ను అడ్డుకుంటామ‌ని ఆదివాసిలు చెబుతున్నారు. మ‌రోవైపు యురేనియం నిక్షేపాల స‌ర్వేకు కూడా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌నే వార్త‌లు ప‌ర్యావ‌ర‌ణ‌వేత్తల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి.

న‌ల్లమ‌ల‌లోని ఆమ్రాబాద్ ప్రాంతంలో, నాగార్జున సాగ‌ర్ ప్రాంతంలో మొత్తం 83 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లలో 20 వేల ట‌న్నుల యురేనియం నిక్షేపాల‌ను వెలికితీయాల‌నేది కేంద్ర అణుశ‌క్తి సంస్థ ఆలోచ‌న‌గా చెబుతున్నారు.

ఇందుకు సంబంధించి అన్ని అనుమ‌తులు సైతం వ‌చ్చాయ‌నే వార్త‌లు వ‌స్తున్నా.. కేవ‌లం స‌ర్వే మాత్ర‌మే చేస్తున్నామని, త‌వ్వ‌కాలు చేప‌ట్ట‌డం లేద‌ని కేంద్రం నుంచి స‌మాదానం వ‌స్తోంది. ఈ ప్రాంతంలో 120 చెంచు గూడాల్లో సుమారు 11 వేల మంది ఆదివాసిలు జీవిస్తున్నారు. యురేనియం త‌వ్వ‌కాలు జ‌రిపితే వారు తీవ్ర ఇబ్బందుల‌కు గురికానున్నారు.

దీంతో అడ‌వుల‌ను, ఆదివాసుల‌ను కాపాడుకునేందుకు సెల‌బ్రిటీలు సైతం రంగంలోకి దిగారు. యురేనియం త‌వ్వ‌కాల‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పుతున్నారు. సోష‌ల్ మీడియాలోనూ సేవ్ న‌ల్ల‌మ‌ల అంటూ వేలాది మంది సంత‌కాలు పెడుతున్నారు. రాష్ట్రంలో అన్ని రాజ‌కీయ పార్టీలూ ఈ అంశంపై పోరాడేందుకు సిద్ధం అవుతున్నాయి.

ఇందుకోసం వి.హ‌నుమంత‌రావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధ‌మ‌వుతోంది. దీంతో ఆయ‌న ఇవాళ అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఈ ఇష్యూను సీరియ‌స్‌గా తీసుకున్నారు.

ఈ వ్య‌వ‌హారంపై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే ఇందుకు సంబంధించిన అనుమ‌తులు ఇచ్చింద‌నేది కాంగ్రెస్ ఆరోప‌ణ‌. ఈ విషయంలో త‌మ‌ను ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని గుర్తించిన టీఆర్ఎస్ కూడా అప్ర‌మ‌త్త‌మైంది.

ఎట్టి ప‌రిస్థితుల్లో యురేనియం త‌వ్వ‌కాల‌కు అనుమ‌తించేది లేద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. అవ‌స‌ర‌మైతే పోరాటానికి సిద్ధ‌మ‌ని పేర్కొన్నారు. అస‌లు 2009లో అనుమ‌తులు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ప్ర‌క‌టించారు.

దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ఇరుకున ప‌డిన‌ట్ల‌యింది. ప్ర‌స్తుతానికి ఈ వ్య‌వ‌హారం నుంచి టీఆర్ఎస్ సేఫ్ అయింది. అయితే, రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీకి మాత్రం న‌ల్ల‌మ‌ల అంశం తీవ్ర ఇబ్బందిక‌రంగా మారింది.

బీజేపీ నేత‌లు దీనిపై స‌మాధానం చెప్పుకోలేక‌పోతున్నారు. ఈ అంశం ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం, అంతా యురేనియం త‌వ్వ‌కాల‌ను ముక్త‌కంఠంతో వ్య‌తిరేకిస్తుండ‌టంతో రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు ఏం చేయాలో అంతు చిక్క‌డం లేదు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle