newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

పోరాడి గెలిచిన యువ‌కులు.. ఆద‌ర్శం ఓరుగ‌ల్లు కుర్రాళ్లు

21-11-201921-11-2019 12:38:46 IST
2019-11-21T07:08:46.662Z21-11-2019 2019-11-21T07:08:45.362Z - - 25-02-2020

పోరాడి గెలిచిన యువ‌కులు.. ఆద‌ర్శం ఓరుగ‌ల్లు కుర్రాళ్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స‌మాజంలో కంటికి క‌నిపించే స‌మ‌స్య‌ల‌ను చూసీ చూడ‌న‌ట్లు వ‌దిలేసే యువ‌త‌ను ఎక్కువ‌గా చూస్తుంటాం. ఒక స‌మ‌స్య క‌నిపిస్తే ఫేస్‌బుక్‌లోనో, ట్విట్ట‌ర్‌లోనో దానిపై పాల‌కుల‌ను ప్ర‌శ్నించే వారు త‌క్కువ‌గా చూస్తుంటాం.

కానీ, హ‌న్మ‌కొండ‌కు చెందిన తోట ప‌వ‌న్‌, యెన్నంశెట్టి అఖిల్ అనే యువ‌కులు మాత్రం మ‌న స‌మాజంలో అరుదుగా క‌నిపిస్తారు. స‌మ‌స్య ఉందంటే వారు త‌మ‌కెందుకులే అనుకోరు. స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యే వ‌ర‌కు పోరాడ‌తారు. ఇలా పోరాడి గెలిచిన ఓ క‌థ ఇది.

హ‌న్మ‌కొండ అడ్వ‌కేట్స్ కాల‌నీకి చెందిన తోట ప‌వ‌న్‌, కాకాజి కాల‌నీకి చెందిన యెన్నంశెట్టి అఖిల్ ఇద్ద‌రూ స్నేహితులు. ప‌వ‌న్ న్యాయ విద్యార్థి. అఖిల్ లండ‌న్‌లో న్యాయ విద్య‌ను అభ్య‌సిస్తున్నాడు.

వీరిద్ద‌రూ వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నిత్యం చొర‌వ చూపిస్తుంటారు. స‌మ‌స్య‌ల‌ను పాల‌కులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్కారానికి కృషి చేస్తుంటారు. ఈ నేప‌థ్యంలో ఓ వార్తా ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త వారిని ఆలోచింప‌జేసింది.

హ‌న్మ‌కొండ‌లోని బాల‌స‌ముద్రం నిత్యం ర‌ద్దీగా ఉండే ప్రాంతం. ఈ రోడ్డులో ఓ వ్యాపారికి పెట్రోల్ పంపు ఉంది. త‌న పెట్రోల్ పంపున‌కు అనుకూలంగా ఉండేలా, వాహ‌నాలు సులువుగా వ‌చ్చేలా స‌ద‌రు యాజ‌మాని త‌న తెలివితేట‌లు ప్ర‌ద‌ర్శించి, ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి డివైడ‌ర్‌ను తొల‌గించుకున్నారు.

అంతేకాదు, పెట్రోల్ పంపు వ‌ద్ద స్పీడ్ బ్రేక‌ర్ల‌ను ఏర్పాటు చేసుకున్నారు. ర‌ద్దీగా ఉండే రోడ్డుపై పెట్రోల్ పంపు యాజ‌మాని త‌న వ్యాపారం కోసం చేసిన ఈ ప‌నుల‌తో ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్ప‌డుతోంది.

ఈ విష‌యంపై ఈ ఏడాది మేలో ప్ర‌ముఖ వార్త ప‌త్రిక‌లో ఒక క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. ఎంతోమంది ఈ క‌థ‌నాన్ని చదివి వ‌దిలేశారు. మున్సిప‌ల్ అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు కూడా ప‌ట్టించుకోలేదు.

కానీ, తోట ప‌వ‌న్‌, అఖిల్ మాత్రం ఈ వార్త‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు. స‌మ‌స్య ప‌రిష్కారానికి తామే ముందడుగు వేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మున్సిప‌ల్ అధికారులకు ఈ విష‌యంపై ఫిర్యాదు చేశారు. కానీ, వారి నుంచి స్పంద‌న రాలేదు.

దీంతో వారు ఈ విష‌యంపై జిల్లా శాశ్వ‌త లోక్ అదాల‌త్‌ను ఆశ్ర‌యించారు. ఇద్ద‌రూ న్యాయ విద్యార్థులే కావ‌డంతో వారికి ఉన్న అవ‌గాహ‌న‌తో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీక‌రించిన లోక్అదాల‌త్ దీంతో మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్‌పై కేసు న‌మోదైంది. క‌మిష‌న‌ర్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ విష‌యంపై విచార‌ణ జ‌రిపిన లోక్ అదాల‌త్ బుధ‌వారం తీర్పు ఇచ్చింది.

పెట్రోల్ పంపు యాజ‌మాని వ్యాపార ప్ర‌యోజ‌నాల కోసం తొల‌గించిన డివైడ‌ర్‌ను మూసి వేయాల‌ని, స్పీడ్ బ్రేక‌ర్ల‌ను తొల‌గించాల‌ని లోక్ అదాల‌త్ ఛైర్‌ప‌ర్స‌న్ ఈద తిరుమ‌లాదేవీ తుది తీర్పు చెప్పారు.

అంతేకాదు, ఈ విష‌యంపై ఫిర్యాదు చేసిన పోరాడిన ప‌వ‌న్‌, అఖిల్‌కు చెరో రూపాయి ప‌రిహారం చెల్లించాల‌ని చెప్పారు. దీంతో యువ‌కుల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. వీరిద్ద‌రూ ఈ విష‌యంపైనే కాదు.. వివిద సామాజిక స‌మ‌స్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు గ‌ళం విప్పుతుంటారు. నిజంగా యువ‌త‌లో ఈ త‌ర‌హా పోరాట ప‌టిమ అవ‌స‌రం.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle