పోతిరెడ్డిపాడుతో తెలంగాణ ఏర్పాటు ఉద్దేశానికే విఘాతం.. ఉత్తమ్ కుమార్
13-05-202013-05-2020 11:59:05 IST
Updated On 13-05-2020 14:19:36 ISTUpdated On 13-05-20202020-05-13T06:29:05.734Z13-05-2020 2020-05-13T06:29:03.696Z - 2020-05-13T08:49:36.180Z - 13-05-2020

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా అదనపు నీటిని తీసుకెళ్లడానికి ఏపీ ప్రభుత్వం గత ఆరునెలలుగా ప్రయత్నాలు చేస్తున్నా తెలంగాణ ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు మౌనం పాటించడంలో అర్థమేమిటంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండు టీఎంసీల నీటిని ఎత్తి పోసేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తోంది. విద్యుత్తు, నిర్వహణ, మానవ శక్తి కోసం మరో రూ.10 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని ఏపీ ప్రభుత్వం తన్నుకుపోతుంటే సోమవారం దాకా సీఎం కేసీఆర్ నోరు మెదపలేదు’’ అని ఉత్తమ్ మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా అదనంగా 4 టీఎంసీల నీటిని తీసుకుపోవడానికి ఏపీ ప్రభుత్వం ఆరు నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నా సీఎం కేసీఆర్ మౌనంగా ఉండటం దురదృష్టకరమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో కేసీఆర్ వైఫల్యాన్ని, జగన్‌తో ఆయనకున్న సంబంధాన్ని బహిర్గతం చేస్తామని ప్రకటించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, కొవిడ్-19 తదితర అంశాలపై ఉత్తమ్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం వీడియా కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో ఆర్సీ ఖుంటియా, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, కుసుమ్‌కుమార్, పొన్నం ప్రభాకర్, మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు వల్ల మొత్తం కృష్ణాబేసిన్ నీటి పారుదల వ్యవస్థ నాశనం అవుతుందని, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం తదితర జిల్లాలు నీటి వాటాను కోల్పోతాయన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్దేశాన్ని నాశనం చేస్తుందని చెప్పారు. ఈ విషయంలో అన్ని న్యాయపరమైన వేదికలను కాంగ్రెస్ పార్టీ ఆశ్రయిస్తుందని పేర్కొన్నారు. కాగా, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించే ప్రయత్నానికి వ్యతిరేకంగా, దీన్ని అడ్డుకోవడంలో సీఎం కేసీఆర్ వైఫల్యానికి నిరసనగా బుధవారం టీపీసీసీ ధర్నా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ధర్నాలు నిర్వహించనున్నట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. గత సంవత్సరం కాలంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య అనేక అంశాలపై వ్యక్తమవుతూ వచ్చిన సయోధ్య పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నేపథ్యంలో చెదిరిపోనుందా.. ఈ సమస్యకు ఇరువురు సీఎంలు ఎలా పరిష్కారం చూపుతారన్నదాని బట్టే భవిష్యత్ సంబంధాలు ఆధారపడి ఉంటాయని నిపుణుల అంచనా.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
8 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
13 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
17 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
18 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
20 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
21 hours ago
ఇంకా