newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

పొత్తులు వ‌ద్దు బాబోయ్‌..!

14-03-201914-03-2019 08:28:47 IST
Updated On 10-07-2019 12:07:47 ISTUpdated On 10-07-20192019-03-14T02:58:47.669Z14-03-2019 2019-03-14T02:57:43.615Z - 2019-07-10T06:37:47.000Z - 10-07-2019

పొత్తులు వ‌ద్దు బాబోయ్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జాకూట‌మి ప్ర‌యోగం విఫ‌లం కావ‌డంతో పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కూట‌మికి పార్టీల‌న్నీ గుడ్ బై చెబుతున్నాయి. అన్ని పార్టీలూ ఒంట‌రి పోరాటానికే సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల‌కూ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే ప‌నిలో ప‌డింది. సీపీఐ, తెలంగాణ జ‌న‌సమితి కూడా బ‌ల‌మైన చోట్ల ఒంట‌రిగా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌‌ను ఎలాగైనా గ‌ద్దె దింపాల‌నే ఏకైక ఎజెండాతో కాంగ్రెస్‌, తెలుగుదేశం, టీజేఎస్‌, సీపీఐ క‌లిసి ప్ర‌జాకూటమిగా ఏర్ప‌డ్డాయి. అయితే, సీట్ల స‌ర్దుబాటు వ్య‌వ‌హారం తొంద‌ర‌గా తేల‌క‌పోవ‌డం, ప‌లు చోట్ల కూట‌మిలోనే రెండు పార్టీల అభ్య‌ర్థులూ పోటీలో ఉండ‌టం వంటి కార‌ణాల‌తో ఎన్నిక‌ల ముందే కూట‌మిలో కొట్లాట‌లు మొద‌ల‌య్యాయి. ఎలాగోలా ఎన్నిక‌ల‌కు వెళ్లిన కూట‌మికి ఎదురుదెబ్బ త‌గిలింది.

పొత్తులు కూడా త‌మ‌ను ముంచాయ‌ని, పొత్తులు లేకుంటే ఇంకా కొన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకునే వాళ్ల‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు. దీంతో పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ఎలాంటి పొత్తులూ వ‌ద్ద‌ని వారు ముందు నుంచే అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో మొత్తం 17 స్థానాల‌కూ ఆ పార్టీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తోంది. అయితే, ఖ‌మ్మం విష‌యంలో మాత్రం తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా అనే అనుమానాలు నేత‌ల‌కు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఖ‌మ్మం సీటును టీడీపీ సీనియ‌ర్ నేత నామా నాగేశ్వ‌ర‌రావుకు వ‌దిలేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. నామా తెలుగుదేశం పార్టీ నుంచి బ‌రిలో ఉంటారా లేదా కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. తెలంగాణలో పొత్తు వ్య‌వ‌హారం రాష్ట్ర శాఖ‌కే అప్ప‌గించిన‌ట్లు అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. టీటీడీపీ నేత‌లలు మాత్రం మూడు స్థానాల‌పై క‌న్నేశారు. కుదిరితే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల‌నే వారు ఆలోచిస్తున్నారు. పొత్తులో భాగంగా ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌‌తో పాటు వారికి సిట్టింగ్ సీటుగా ఉన్న మ‌ల్కాజిగిరి అడ‌గాల‌ని భావిస్తున్నారు.

టీడీపీతో పొత్తే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ముంచింద‌ని భావిస్తున్నచాలామంది కాంగ్రెస్ నేత‌లు అస‌లే ఆ పార్టీతో పొత్తే వ‌ద్దు అంటున్నార‌ట‌. ఒక‌వేళ కాంగ్రెస్ అధిష్ఠానం సూచ‌న‌ల‌తో పొత్తు పెట్టుకున్నా ఖ‌మ్మం స్థానం మాత్రమే ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇక‌, తెలంగాణ జ‌న స‌మితి పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఒంట‌రి పోరుకు దిగుతున్న‌ట్లు ప్ర‌క‌టించేసింది.

నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, మ‌ల్కాజిగిరితో పాటు మ‌రో పార్ల‌మెంటు స్థానంలో పోటీ చేస్తామ‌ని టీజేఎప్ అధ్య‌క్షులు ప్రొ.కొదండ‌రాం ప్ర‌క‌టించారు. ఆయ‌న పోటీపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇక‌, సీపీఐ కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఎల్ఎఫ్ ప్ర‌యోగం చేసి సీపీఎం, ప్ర‌జాకూట‌మి ద్వారా సీపీఐ విఫ‌ల‌మ‌య్యాయి. అసెంబ్లీలో ఒక్క స్థానం కూడా ద‌క్కించుకోలేక ప్రాతినిధ్యం కోల్పోయాయి. దీంతో రెండు పార్టీలూ వామ‌ప‌క్షాల ఐక్య‌త ద్వారానే ప్ర‌భావం చూప‌వ‌చ్చ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చాయి. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీలు క‌లిసి పోటీ చేయ‌నున్నాయి. ప్ర‌జాకూట‌మి కూలిపోవ‌డం టీఆర్ఎస్‌కు ప్ల‌స్ అవుతుందో, కాంగ్రెస్‌కు క‌లిసి వ‌స్తుందో చూడాలి.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle