పొక్రాన్ అణు పరీక్షలుు కూడా ఇంత రహస్యంగా జరపలేదు.. రేవంత్ రెడ్డి ధ్వజం
15-07-202015-07-2020 07:40:19 IST
Updated On 15-07-2020 09:31:29 ISTUpdated On 15-07-20202020-07-15T02:10:19.790Z15-07-2020 2020-07-15T02:10:17.043Z - 2020-07-15T04:01:29.952Z - 15-07-2020

సచివాలయం చుట్టూ 3 కిలోమీటర్లు రాకపోకలు బంద్ చేసి కూల్చివేతలు చేశారని కాంగ్రెస్ నేత రేవంత్ ఆరోపించారు. దీనిపై తమకు అనుమానం రావడంతో ఎంక్వైరీ చేయగా.. నిధి అన్వేషణ జరుగుతుందనే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయన్నారు. జీ బ్లాక్ కింద నిజాం ఖజానా ఉందనే వార్తలను గతంలో పత్రికలు ప్రచురించాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నిజాం నిధులు నేల మాలిగల్లో దాచుకున్నాడని నివేదికలు కూడా ఉన్నాయిని ఉటంకించారు. మింట్ కాంపౌండ్, విద్యారణ్య స్కూల్ ఆవరణ, హోమ్ సైన్స్ కాలేజ్లో గతంలో సొరంగాలు బయట పడ్డాయని రేవంత్ చెప్పుకొచ్చారు. ఆ సచివాలయం సొరంగాల కేంద్రం జి బ్లాక్ కిందకు ఉన్నాయని అప్పట్లో పురావస్తు శాఖ గుర్తించిందన్నారు. అక్కడ అన్వేషణ కోసం అవకాశం ఇవ్వాలని పురావస్తు శాఖ జీహెచ్ఎంసీకి లేఖ రాసిందని ఆయన గుర్తు చేశారు. అయితే అనుమతి ఇవ్వకుండా లేఖ రాసిన అధికారిని పదవి నుంచి తొలగించారని అన్నారు. ఇప్పుడు అక్కడే తవ్వకాలు జరపడంపై అనేక అనుమానాలు ఉన్నాయని రేవంత్ తెలిపారు. మంచి కార్యక్రమాలు ఎప్పుడైనా పగలే చేస్తారని, గుప్త నిధుల తవ్వకాలు మాత్రమే అర్థరాత్రి చేస్తారని అన్నారు. పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఎందుకు తవ్వకాలు జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. పొక్రాన్ అణు పరీక్షలుు కూడా ఇంత రహస్యంగా జరపలేదన్నారు. కూల్చివేతకు ముందు జి బ్లాక్ కింద ఎన్ఎండీసీ, పురావస్తు శాఖ చేత పరిశోధన జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. జీ బ్లాక్ కింద గుప్త నిధులు ఉన్నట్లు కేసీఆర్ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో కూడా వార్తలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీన్ని సుమోటోగా స్వీకరించి ఒక కమిటీ వేయాలని రేవంత్ విజ్ఞప్తి చేశారారు. కేసీఆర్ అంతర్థానంపై కూడా తమకు అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జూన్ 29న సచివాలయాన్ని కూల్చొద్దని తాము కోర్టుకు వెళ్లామని, అయితే సచివాలయం కూల్చడానికి అభ్యంతరం లేదంటూ హైకోర్టు తీర్పునిచ్చిందని పేర్కొన్నారు. అయితే తాము కోర్టును ఆశ్రయించినప్పటి నుంచి కేసీఆర్ కనిపించకుండా పోయారని, జులై 10న కూల్చివేతపై కోర్టు స్టే ఇవ్వగా.. ఆ మరుసటి రోజే మళ్లీ కేసీఆర్ బయటకు వచ్చారని రేవంత్ చెప్పుకొచ్చారు. ఈ 11 రోజులు కేసీఆర్ ఎక్కడికి పోయారో చెప్పాలని, దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయని రేవంత్ అన్నారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
4 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
5 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
5 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
9 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
10 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
8 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
11 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
11 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
6 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
13 hours ago
ఇంకా