newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పైవేట్ స్కూళ్ల దోపిడీకి ‘ఆన్ లైన్..!‘

05-09-202005-09-2020 10:01:10 IST
2020-09-05T04:31:10.026Z05-09-2020 2020-09-05T04:30:45.094Z - - 17-04-2021

పైవేట్ స్కూళ్ల దోపిడీకి ‘ఆన్ లైన్..!‘
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆన్‌లైన్‌ పాఠాలతో ప్రభుత్వ స్కూళ్లలో  సాంకేతిక సమస్యలు ఎదురవుతుండగా..పైవేట్‌ రంగంలో  దోపిడీ యథేచ్చగా సాగిపోతున్నది. ఈ నెల 1 నుంచి తెలంగాణ ఆన్‌లైన్‌ విద్యకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే ఆన్ లైన్ బోధన విషయంలో అధికారులు పలు సమస్యలను గుర్తించారు. అయితే వీటి పరిష్కారం విషయంలో మాత్రం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఈ విధంగా పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారనడంలో సందేహం లేదు. 

ఫీజులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో కూడా సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. ఒక ప్రకటన చేసి పారేశాం...అన్నీ పరిష్కారమైపోయాయి అన్న చందంగా ప్రభుత్వం తీరు కనిపిస్తున్నది. ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో పైవేట్‌ విద్యాసంస్థలు దోపిడీ పర్వానికి తెరలేపాయి. టీచర్లకు జీతాలు ఇవ్వడంలో ముందుకు రాని సంస్థలు ఫీజుల వసూళ్లలో మాత్రం యమ స్పీడుగా ఉంటున్నాయి.

గత జూన్‌ నుంచే చేపట్టిన ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో పైవేటు స్కూలు యాజమాన్యాల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రోజుకు చెప్పే రెండు మూడు క్లాసులకే పూర్తి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఒక పక్క కరోనాతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిరుద్యోగులు, మధ్య తరగతి జీవులకు ఫీజులు మోయలేని బరువుగా మారాయనడంలో సందేహం లేదు. 

ఇప్పటికే ఫస్ట్‌ టర్మ్‌ ఫీజులు..పుస్తకాలు, నోటు పుస్తకాలు ఫోన్లు, కంప్యూటర్ల కొనుగోలుతో తలకు మించిన భారం మోసిన తల్లిదండ్రులకు..సెకండ్‌ టర్మ్‌ ఫీజుల ఒత్తిడి తట్టుకోలేనిదిగా తయారైంది. ప్రభుత్వం నిర్దేశిరచిన ట్యూషన్‌ ఫీజుల కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తుండటంతో పలువురు తల్లిదండ్రులు ఆయా పాఠశాలలపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.  ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 27 పాఠశాలపై ఇటువంటి ఫిర్యాదులు అందాయి. అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని తల్లిదండ్రులు చేస్తున్న విమర్శలు, ఆందోళనలు పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. ఫీజులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.   

కరోనా కారణంగా అన్ని రంగాల్లాగే  విద్యారంగం కూడా కుప్పకూలింది.  కరోనా భయంతో పాఠశాలలు తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే  ఆన్‌లైన్‌ క్లాస్‌లకు మొగ్గు చూపాల్సిన పరిస్థితి. ఇదే అవకాశంగా పైవేట్‌ స్కూళ్లు దోపిడీ పర్వానికి తెరతీశాయి. 

ప్రభుత్వం అనుమతి లేకుండానే పలు కార్పొరేట్‌, పైవేటు స్కూళ్లు జూన్ మధ్య నుంచే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తూ ఫీజుల కోసం వేధింపులు ప్రారంభించాయి. ఈ దోపిడీని అడ్డుకోవలసిన విద్యా శాఖ ఉద్దేశపూర్వక ఉదాశీనత ప్రదర్శిస్తున్నది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కరోనా రోగుల పట్ల కర్కశంగా వ్యవహరించిన కార్పొరేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా ఝుళిపించిన చందంగానే దోపిడీ పర్వానికి తెరలేపిన ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   9 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   14 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   11 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   15 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   13 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   19 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle