newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పేదలకు గుడ్ న్యూస్... కరోనాకు ఫ్రీ ట్రీట్‌మెంట్

15-07-202015-07-2020 12:03:00 IST
Updated On 15-07-2020 12:25:18 ISTUpdated On 15-07-20202020-07-15T06:33:00.770Z15-07-2020 2020-07-15T06:32:46.763Z - 2020-07-15T06:55:18.027Z - 15-07-2020

పేదలకు గుడ్ న్యూస్... కరోనాకు ఫ్రీ ట్రీట్‌మెంట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రోజురోజుకీ కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. భార‌త్‌లో గడచిన 24 గంట‌ల్లో అత్యధికంగా 29,429 కరోనా పాజిటివ్ కేసులు, 582  మంది మృతి..  దేశ‌వ్యాప్తంగా 9,36,181కు చేరిన క‌రోనా కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 24,309 మంది మృతిచెందారు. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనా వైద్యం ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. అందుకోసం మొదట మూడు ప్రైవేట్‌ మెడిక‌ల్ కాలేజీల‌ను ఎంపిక చేసింది. అందులో భాగంగానే మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో  కరోనా టెస్టులు, చికిత్స ఉచితంగా అందించేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. 

కరోనా వైరస్‌ సోకిన వారి రికవరీ రేటు 99 శాతంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. కేవలం ఒక శాతం మాత్రమే డెత్‌రేట్‌ ఉందని, జాతీయ స్థాయిలో కోవిడ్‌–19 డెత్‌ రేట్‌ 2.7 శాతంగా ఉందని  ఆయన వివరించారు. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో తీవ్రత తక్కువగానే ఉందని తెలిపారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నట్లు వెల్లడించారు. పాజిటివ్‌ కేసుల్లో 80 శాతం మందికి లక్షణాలు లేవని, కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం జీహెచ్‌ఎంసీలో 300 ల్యాబ్‌లలో పరీక్షలు చేస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో 97,786 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కూడా కోవిడ్‌ చికిత్స ఉచితంగా అందిస్తున్నట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో 98 ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సకు అనుమతి ఉందని, ప్రస్తుతం 54 ఆస్పత్రుల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైందని వివరించారు.

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటోంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం గాంధీలోనే చికిత్స అందిస్తామన్నారు. పలు సందర్భాల్లో ప్రైవేటు ఆస్పత్రులు చివరి నిమిషాల్లో రోగులను గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నారన్నారు. లక్షణాలు లేని వారు గాంధీలో అడ్మిట్‌ కావడం వల్ల ఇతరుల ద్వారా ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశముందని తెలిపారు. ప్లాస్మా థెరఫీ అందరికీ సరికాదని.. ప్లాస్మా బ్యాంక్‌ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.

గాంధీ ఆస్పత్రి వద్ద ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ధర్నా రెండో రోజు కొనసాగుతోంది. సెక్యూరిటీ, శానిటైజేషన్, ఫోర్త్ క్లాస్ పేషేంట్ కేర్ సిబ్బంది విధులు బహిష్కరించారు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే వారం రోజులుగా నిరవధిక సమ్మెలో 600 మంది నర్సులు పాల్గొన్నారు. దీంతో కరోనా పేషెంట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle