newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

పెప్ప‌ర్ స్ప్రేలు.. అగ్నిమాప‌క ప‌రిక‌రాలు.. సీసీ కెమెరాలు

14-11-201914-11-2019 08:25:28 IST
Updated On 14-11-2019 18:03:02 ISTUpdated On 14-11-20192019-11-14T02:55:28.919Z14-11-2019 2019-11-14T02:44:39.358Z - 2019-11-14T12:33:02.619Z - 14-11-2019

పెప్ప‌ర్ స్ప్రేలు.. అగ్నిమాప‌క ప‌రిక‌రాలు.. సీసీ కెమెరాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
 

త‌హ‌శీల్దార్ విజ‌యారెడ్డిని కార్యాల‌యంలోనే దారుణంగా హ‌త్య చేసిన త‌ర్వాత రెవెన్యూ ఉద్యోగుల‌కు ఆఫీసుకు వెళ్లాలంటేనే భ‌యంగా ఉంది. భూస‌మ‌స్య‌లు తీవ్రంగా ఉండ‌టం, రెవెన్యూ ఉద్యోగులే త‌మ భూస‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేద‌నే కోపం ప్ర‌జ‌ల్లో విప‌రీతంగా ఉంది.

దీంతో విధుల్లోకి వెళ్లాలంటేనే వీఆర్ఏ నుంచి ఆర్డీఓ వ‌ర‌కు రెవెన్యూ ఉద్యోగులు జంకే ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో మ‌ళ్లీ అబ్దుల్లాపూర్‌మెట్‌లో జ‌రిగిన ఘ‌ట‌న జ‌ర‌గ‌కుండా అటు ప్ర‌భుత్వం, ఇటు రెవెన్యూ ఉద్యోగులు అప్ర‌మ‌త్త‌మయ్యారు.

విజ‌యారెడ్డి హ‌త్య త‌ర్వాత సుమారు వారం రోజులకు పైగా రెవెన్యూ ఉద్యోగులు విధులు బ‌హిష్క‌రించారు. త‌మ భ‌ద్ర‌త‌కు ప్ర‌భుత్వం భ‌రోసా ఇవ్వాల‌నే డిమాండ్‌తో వారు విధుల్లో చేర‌లేదు.

దీంతో ట్రెసా నేతృత్వంలోనే రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ మంత్రి కేటీఆర్‌, రెవెన్యూ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. ఉద్యోగుల భ‌ద్ర‌త‌కు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం నుంచి హామీ ఇవ్వ‌డంతో బుధ‌వారం నుంచి ఉద్యోగులు విధుల్లో చేరాల‌ని జేఏసీ పిలుపునిచ్చింది.

మ‌రోవైపు డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం అధ్య‌క్షులు ల‌చ్చిరెడ్డి నేతృత్వంలోని మ‌రో రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ మాత్రం ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు వ‌చ్చే వర‌కు నిర‌స‌న‌లు తెలియ‌జేయాల‌ని ఉద్యోగుల‌కు పిలుపునిచ్చింది. దీంతో చాలా మంది ఉద్యోగులు విధుల్లో చేరినా కొంద‌రు మాత్రం చేర‌లేదు. విధుల్లో చేరిన ఉద్యోగుల్లోనూ ఆందోళ‌న మాత్రం కొన‌సాగుతోంది.

విజ‌యారెడ్డి హ‌త్య త‌ర్వాత సోష‌ల్ మీడియాలో రెవెన్యూ ఉద్యోగుల‌కు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దీనికి తోడు ప్ర‌తీ రోజూ ఎక్క‌డో ఒక చోట ఉద్యోగుల‌ను బెదిరించ‌డ‌మో, తామే ఆత్మ‌హ‌త్య చేసుకుంటామ‌ని బెదిరించ‌డ‌మో జ‌రుగుతోంది. దీంతో ఉద్యోగులు వారి జాగ్ర‌త్త‌ల్లో వారు ఉంటున్నారు. ముఖ్యంగా మ‌హిళా త‌హ‌శీల్దార్లు పెప్ప‌ర్ స్ప్రేల‌ను వెంట పెట్టుకుంటున్నారు. స్వీయ ర‌క్షణ కోసం ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు.

ఇక‌, అబ్దుల్లాపూర్‌మెట్ త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో ఫైర్ సేఫ్టీ ప‌రిక‌రాలు లేనందున న‌ష్టం ఎక్కువగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇది గుర్తించిన కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు ఉప్ప‌ల్ త‌హ‌శీల్దార్‌కు ఫైర్ సేఫ్టీ ప‌రిక‌రాల‌ను ఉచితంగా అంద‌జేయ‌డం గ‌మ‌నార్హం. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ వైపు నుంచి కూడా రెవెన్యూ ఉద్యోగుల భ‌ద్ర‌త‌కు చ‌ర్య‌లు మొద‌ల‌య్యాయి.

రెవెన్యూ కార్యాల‌యాల వ‌ద్ద భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు వ‌చ్చాయి. ఇక‌, ఉద్యోగుల‌కు నైపుణ్యాల‌పై శిక్ష‌ణ ఇవ్వ‌డంతో ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం మ‌హిళా ఉద్యోగుల‌కు మార్ష‌ల్ ఆర్ట్స్‌లోనూ శిక్ష‌ణ ఇచ్చే అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్నారు. మొత్తానికి విజ‌యారెడ్డి హ‌త్య‌తో అటు ప్ర‌భుత్వం, ఇటు రెవెన్యూ ఉద్యోగులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

అయితే, ఇటువంటి ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌తో పాటు ప్ర‌జ‌ల‌కు, రెవెన్యూ ఉద్యోగుల‌కు మ‌ధ్య అంత‌రం ఎందుకు పెరిగిందో, ఎందుకు రెవెన్యూ ఉద్యోగుల‌పై ప్ర‌జ‌ల్లో కోపం పెరుగుతుందో గుర్తిస్తే బాగుంటుంది. భూస‌మ‌స్య‌ల‌ను దూరంగా చేసి, రెవెన్యూ వ్య‌వ‌స్థ‌లో పేరుకుపోయిన అవినీతిని నిర్మూలిస్తే ప్ర‌జ‌ల్లోకి స్వేచ్ఛ‌గా వెళ్లి రెవెన్యూ ఉద్యోగులు ప‌ని చేయ‌గ‌లుగుతారు.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   5 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   6 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   9 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   11 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   11 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   11 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   12 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle