newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పెనం మీద నుండి పొయ్యిలో పడ్డ తెలంగాణ రైతు

10-04-202010-04-2020 16:13:14 IST
Updated On 10-04-2020 16:13:48 ISTUpdated On 10-04-20202020-04-10T10:43:14.954Z10-04-2020 2020-04-10T10:43:11.276Z - 2020-04-10T10:43:48.753Z - 10-04-2020

పెనం మీద నుండి పొయ్యిలో పడ్డ తెలంగాణ రైతు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో రైతు పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో ఇప్పుడు వ్యవసాయ కోతల సమయం. లాక్ డౌన్ నేపథ్యంలో రైతుకు ఒకవైపు కూలీల సమస్య మరోవైపు పంటను అమ్మేందుకు మార్కెటింగ్ సమస్య కలిసి వేధిస్తున్నాయి.

లాక్ డౌన్ సడలింపులో వ్యవసాయ రంగానికి వర్తించేలా చేసిన ప్రభుత్వం ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రాష్ట్రంలో ఆహార కొరత రాకుండా ఉండాలంటే రాష్ట్రంలో పండే పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. విడతల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు ప్రభుత్వం జమ చేస్తుందని ప్రకటించింది.

సాక్షాత్తు సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో రాష్ట్రంలో పండే ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. అదే సమావేశంలో సీఎస్ సోమేష్ కుమార్ ను సీఎం ఆదేశించారు. అసలే లాక్ డౌన్ నేపథ్యంలో పంట ఉత్పత్తులు బయటకి ఎగుమతి అయ్యే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వ ప్రకటనకు రైతులు ఉబ్బితబ్బిబయ్యారు. 

కానీ ఆచరణలో మాత్రం రైతుకు పుట్టెడు కష్టాలే మిగిలాయని రాష్ట్ర రైతాంగం దిగాలుగా చెప్తుంది. ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగం ప్రస్తుతం కరోనా కట్టడి మీదనే దృష్టి పెట్టింది. రాష్ట్రంలో వరికోతలు, పండ్ల తోటల ఉత్పత్తులు ముమ్మరంగా కోతకి వచ్చాయి. కొన్ని జిల్లాలలో ఇప్పటికే రైతు పంట ఇళ్లకు చేరుతుంది. ప్రభుత్వం చెప్పిన కొనుగోలు మాత్రం ఇంకా మొదలు కాలేదు. 

దీనికి తోడు కొన్ని జిల్లాలలో గత రెండు రోజులుగా గాలి వాన బీబత్సం సృష్టిస్తుంది. కొంతమేర పంట కూడా భారీగానే దెబ్బతింది. నానా తిప్పలు పడి పంట నూర్పిడి చేసి ఇంటికి తెచ్చిన అమ్ముకొనే మార్గం తెలియక రైతులు బిక్కమొహమేస్తున్నారు. సీఎం కేసీఆర్ కొనుగోలు మాటిచ్చి వారం గడుస్తున్నా ఈమేరకు ప్రణాళిక మాత్రం ఇంకా మొదలుకాలేదు.

సాధారణ పరిస్థితిలో అయితే రాష్ట్రంలో పండే వరి పొరుగు రాష్ట్రాలలో పాటు ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ఇక ఇక్కడ పండే పండ్లు అయితే సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రతో పాటు దేశంలో అన్ని ప్రధాన నగరాలకు ఎగుమతి అవుతోంది. కానీ లాక్ డౌన్ నేపథ్యంలో రవాణా పూర్తిగా స్తంభించింది.

ఒకవైపు అకాల వర్షాలు.. మరోవైపు పంటను అమ్ముకొనే అవకాశం లేక రైతులు నానాయాతన పడుతున్నారు. దీంతో కొన్ని జిల్లాలలో రైతులు నేతలు, అధికారులపై తీవ్ర ఒత్తిడి తేవడంతో వారు వాహనాలకు అనుమతులు ఇప్పిస్తాం కావాలంటే రాష్ట్రంలోనే అమ్ముకోవాలని సలహాలు ఇస్తున్నారు. అయితే రాష్ట్రంలో లాక్ డౌన్ పరిస్తితులలో ఎక్కడని అమ్ముకోవాలని రైతులు దిగాలుపడుతున్నారు. మొత్తంగా అటు ఎగుమతులకు అనుమతులు లేక సీఎం చెప్పినట్లుగా ఇటు రాష్ట్రంలో కొనుగోలు జరగక.. ఒకవైపు అకాల వర్షాలకు పంటను కాపాడుకొలేక రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   2 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   an hour ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   6 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   7 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   3 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   9 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   10 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   2 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   4 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   10 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle