పెద్ద ఎత్తున పరీక్షలు చేయకుంటే ప్రమాదమే.. తెలంగాణపై కేంద్రం గుస్సా
22-05-202022-05-2020 08:07:22 IST
Updated On 22-05-2020 08:59:07 ISTUpdated On 22-05-20202020-05-22T02:37:22.235Z22-05-2020 2020-05-22T02:37:20.693Z - 2020-05-22T03:29:07.676Z - 22-05-2020

దేశంలో అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తుంటే.. తెలంగాణలో కేవలం 21వేల టెస్టులు మాత్రమే జరిగాయని, కరోనాపై ఇంతే నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్లో తీవ్ర నష్టం ఎదుర్కొక తప్పదని కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా నిర్ధారణ పరీక్షలపై తెలగాణ వైఖరి ఏమాత్రం సంతృప్తికరంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ఇదే విషయమైన గురువారం లేఖ రాశారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే ఐసీఎంఆర్ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో చాలా తక్కవ పరీక్షలు నిర్వహిస్తున్నారని మండిపడింది. అయితే కేంద్ర ఆరోగ్యశాఖ రాసిన లేఖపై రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్ వెంటనే స్పందించారు. రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే కరోనా పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఐసీఎంఆర్ నిబంధల ప్రకారమే కరోనా పరీక్షలు జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. పరీక్షలపై ప్రజలెవరూ ఆందోళన చెందటం లేదని వివరించారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రకటించిన ఫ్యాకేజీ అంతా అబద్ధమంటూ కేసీఆర్ విమర్శలు చేశారు. దీనిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలోనే కరోనా టెస్టులపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. గత కొద్ది రోజులుగా కేంద్రం నుంచి వస్తున్న మందలింపుల నేపధ్యంలో తెలంగాణలో కరోనా పరీక్షలను కాస్త పెంచగానే మళ్లీ రోజూ పాతిక పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం కేసీఆర్ ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరంగానే మారింది. గత నాలుగైదు రోజులుగా 25 పైబడి 50 లోపు కరోనా పాజిటివ్ కేసులు బయటపడడంతో ఏపీతో సమానంగా తెలంగాణలై వైరస్ విస్తరిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రం మొత్తం మీద మూడు జిల్లాల్లో మాత్రమే కరోనా ఛాయలు కనపడుతున్నా మళ్లీ కొత్త ప్రాంతాల్లో కొత్త కేసులు బయటపడటంతో ప్రభుత్వానికి సాకులు చెప్పడానికి కూడా వీలులేకపోయింది.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
an hour ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
3 hours ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
2 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
4 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
4 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
5 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
21 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
22-04-2021
ఇంకా