newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

పెద్దల సభకు కవిత... వినోద్‌కు మొండిచెయ్యేనా?

14-12-201914-12-2019 10:00:00 IST
2019-12-14T04:30:00.686Z14-12-2019 2019-12-14T04:29:53.466Z - - 25-05-2020

పెద్దల సభకు కవిత... వినోద్‌కు మొండిచెయ్యేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కవితకు రాజ్యసభ సీటు

లోక్ సభ నుంచి రాజ్యసభకు కేసీఆర్ తనయ

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కవిత

రాజ్యసభ రేసులో వినోద్... కవితకే మొగ్గు

లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో ఓటమి

గతంలో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని ప్రచారం

కేసీఆర్ కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత త్వరలో ఓ పదవి వరించబోతోంది.  కవితను రాజ్యసభకు పంపాలని కేసీయార్ యోచిస్తున్నారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో కవితకు సీటివ్వాలని భావిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలను పార్లమెంటులో బలంగా వినిపించే స్థాయి ఉన్న నేతల కోసం అన్వేషిస్తున్న కేసీయార్ కవితను రాజ్యసభకు పంపడం ద్వారా ఆ లోటు భర్తీ అవుతుందంటున్నారు. 

నిజామాబాద్ లోక్ సభ స్ధానం నుంచి పోటీచేసి ఓటమి పాలయింది. కవిత ప్రస్తావిస్తున్న అంశాలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కవిత ప్రధాన భూమిక నిర్వహించిన సంగతి తెలిసిందే. జాగృతి సంస్థ ద్వారా తెలంగాణతో పాటు వివిధ దేశాలలో వున్న తెలంగాణ ప్రజలను ఉద్యమంలోకి తీసుకొచ్చారు. విదేశాలలోనూ తెలంగాణ సంస్కృతిని చాటిచెబుతూనే వున్నారు.

తెలంగాణ  ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో పోటీచేసిన కవిత విజయం సాధించి లోక్ సభలోకి అడుగుపెట్టారు కేసీఆర్. అయిదేళ్ళ పాటు లోక్‌సభలో సందర్భం, అవకాశం వచ్చిన ప్రతిసారి తెలంగాణ ప్రయోజనాలపై మాట్లాడారు. మహిళా ఎంపీల్లో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. 2019 మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి రెండోసారి పోటీ చేసిన కవిత విజయం సాధించలేకపోయారు. డిఎస్ తనయుడు, బిజెపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు.

కవిత ఓడిపోయినా నిజామాబాద్ నియోజకవర్గంలో తిరుగుతూ, వివిధ ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. లోక్ సభ ఎన్నికల నాటికి సీన్ మారిపోయింది. ఓటమితో నిరాశకు గురికాకుండా ఆమె అందరితో మమేకం అవుతున్నారు. 

దేశంలో ఆర్థిక మాంద్యం, పౌరసత్వ సవరణ బిల్లు వంటి అంశాల్లో ఆమె చురుకుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయకపోవడం, జీఎస్టీ బకాయిలను విడుదల చేయాలని ఆమె మోడీ ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. కవితను రాజ్యసభకు పంపితే మరిన్ని అంశాలను కేంద్రంతో చర్చించి పరిష్కరించే అవకాశం ఉంటుందని కేసీయార్, కేటీయార్ ఆలోచిస్తున్నారు.

కవితతో పాటు కరీంనగర్ మాజీ ఎంపీ, ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పేరును కూడా కేసీఆర్ పరిశీలించారు.  వినోద్‌కు కేబినెట్ హోదా కలిగిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇవ్వడంతో కవితకు లైన్ క్లియర్ అయ్యిందంటున్నారు. 2020లో కవిత రాజ్యసభ మెట్లెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. 

 

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   18 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   20 hours ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   20 hours ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   21 hours ago


డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

   21 hours ago


ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

   21 hours ago


శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

   21 hours ago


చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

   23-05-2020


వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

   23-05-2020


ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

   23-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle