పెద్దల సభకు కవిత.. కేసీయార్ ప్లాన్ అదేనా?
18-03-202018-03-2020 08:30:59 IST
Updated On 18-03-2020 12:40:46 ISTUpdated On 18-03-20202020-03-18T03:00:59.043Z18-03-2020 2020-03-18T03:00:34.100Z - 2020-03-18T07:10:46.865Z - 18-03-2020

కేసీయార్ ఆలోచనలు ఎవరికీ అంతుపట్టవు. నిన్నామొన్నటివరకూ కూతురు కవితను రాజ్యసభకు పంపుతారని భావించారు, కానీ రాజ్యసభకు వెళ్లడానికి కవితకు ఇష్టంలేదనే వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా కవితు నిజామాబాద్ ఎమ్మెల్సీగా పంపనున్నారు. దీనికి సంబంధించి నామినేషన్ వేయడానికి కల్వకుంట్ల కవిత రెడీ అవుతున్నారు. నిజామాబాద్ లో మళ్ళీ తన పట్టు సాధించుకునేందుకే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారనే ప్రచారం టీఆర్ఎస్ శ్రేణుల్లో వినిపిస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. 2014లో నిజామాబాద్ పార్లమెంట్ కు పోటీ చేసి విజయం సాధించిన కవిత 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ తరువాత కవిత రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో రాజ్యసభకు నామినేట్ చేస్తారని అనుకున్నా ఆమెను పక్కన పెట్టడంతో, కవిత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారేమో అనుకున్నారు. రాజ్యసభకు పార్టీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీలు కవిత, ప్రొఫెసర్ సీతారాం నాయక్, మందా జగన్నాథం రాజ్యసభ ఆభ్యర్థిత్వాన్ని ఆశించిన వారి జాబితాలో ఉన్నారు. వారికంటే ముందే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు పరిశీలించారు. కెకె, శ్రీనివాసరెడ్డి ఫైనల్ అని అంతా భావించారు. మీడియా కూడా అదే అంశాన్ని కథనాల రూపంలో అందించింది. కానీ కేసీయార్ రూట్ మార్చేశారు. రాజ్యసభ హడావిడి ప్రారంభం అయినప్పుడే ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో కేసీఆర్ డైలమాలో పడిన సంగతి తెలిసిందే. తొలుత కే.కేశవరావు కు లైన్ క్లియర్ చేశారు. రెండవ అభ్యర్ధి కోసం ఒకానొక సందర్భంలో కవిత పేరు కూడా పరిశీలించారు. అయితే కవితను రాజ్యసభకు పంపడం కంటే శాసనమండలికి పంపాలని భావించారు. దీనికి తగ్గట్టుగానే కవితను ఎమ్మెల్సీని చేయబోతున్నారు. అయితే అనూహ్యంగా కవితను నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా నియమించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. నామినేషన్ల ప్రక్రియకు గడువు దగ్గరపడడంతో టీఆర్ఎస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీగా ఎంపికయ్యాక ఆమెకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. కేటీయార్ సీఎం అయితే కవిత కూడా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారు. గత కొంతకాలంగా కవితకు పదవి ఇవ్వాలని కేసీయార్ ఆలోచిస్తూనే వున్నారు. రాజ్యసభ అవకాశం వున్నా.. ఢిల్లీలో చేసేదేం లేదని భావించిన కేసీయార్ ఆమెను రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చాలని ప్లాన్ వేశారు. కొడుకు కేటీయార్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటు కూతురు కవిత కూడా రాబోయే రోజుల్లో పవర్ సెంటర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
8 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
13 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
17 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
18 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
20 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
21 hours ago
ఇంకా