newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

పెద్దమనసుతో ఆర్టీసీ సిబ్బందిని చేరదీయండి.. గవర్నర్ హితవు

26-11-201926-11-2019 09:40:11 IST
Updated On 26-11-2019 15:35:50 ISTUpdated On 26-11-20192019-11-26T04:10:11.723Z26-11-2019 2019-11-26T04:10:08.746Z - 2019-11-26T10:05:50.382Z - 26-11-2019

పెద్దమనసుతో ఆర్టీసీ సిబ్బందిని చేరదీయండి.. గవర్నర్ హితవు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత 52 రోజులుగా డిమాండ్ల సాధనకోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పట్ల కాస్త ఔదార్యంతో వ్యవహరించాల్సి ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు సూచించినట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తే వారిని విధుల్లోకి తీసుకోవాలని, పగసాధింపు ధోరణితో కాకుండా వారిపట్ల పెద్దమనసుతో వ్యవహరించి చేరదీయాలని గవర్నర్ హితవు చెప్పినట్లు తెలుస్తోంది. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర గవర్నర్‌గా గత సెప్టెంబర్‌ 8న తమిళిసై బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమెను కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి కలుసుకోవడం ఇదే తొలిసారి. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో ప్రధానంగా ఆర్టీసీ సమ్మెపై చర్చ జరిగింది. ఆర్టీసీపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని, రాష్ట్ర రవాణా శాఖ అధికారులను ఇందుకోసం ఢిల్లీకి పిలుస్తామని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్‌ గవర్నర్‌ను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సమ్మెకు దిగిన కార్మికుల పట్ల ప్రభుత్వ కఠిన వైఖరికి కారణాలు, ఆర్టీసీ సంస్థ ఆర్థిక స్థితిగతులు, 5,100 రూట్లను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వస్తే పెద్ద మనస్సుతో వారిని చేర్చుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్‌ సీఎంకు సూచించినట్లు సమాచారం. 

ఇటీవలే ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి వచ్చిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘ సమ్మెపై కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఆర్టీసీ సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్దయగా, కఠినంగా వ్యవహరిస్తున్న తీరు గురించి ఢిల్లీ పెద్దలు గవర్నర్తో వాకబు చేసినట్లు కూడా సమాచారం. ఆర్టీసీ సిబ్బంది సమ్మెను తేలిగ్గా తీసుకోమని అవసరమైతే జోక్యం చేసుకోవడానికి కూడా వెనుకాడబోమని కేంద్రం ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

ఆర్టీసీ సమ్మె వెనుక మావోయిస్టు శక్తుల ప్రాబల్యం ఉందని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదన పట్ల కేంద్రం సుముఖత చూపటంలేదని సమాచారం. 49 వేల మంది జీవితాలకు సంబంధించిన వ్యవహారాన్ని శాంతిభద్రతల సమస్యగా, ధిక్కార చర్యగా ముద్రించి కఠినంగా వ్యవహరించడం సరైంది కాదనే అవగాహనతో ఉన్న కేంద్రం ఈ విషయంలో గవర్నర్‌కు తన వంతు సలహా, ఆదేశాలు ఇచ్చి పంపినట్లు కూడా తెలుస్తోంది.

 

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

   9 hours ago


వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

   13 hours ago


అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

   16 hours ago


టీడీపీ కొత్త టీమ్

టీడీపీ కొత్త టీమ్

   16 hours ago


తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

   17 hours ago


కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

   18 hours ago


మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

   19 hours ago


బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

   19 hours ago


పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

   19 hours ago


ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle