newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పెట్రోల్ బంకుల్లో అతిపెద్ద స్కామ్.. ఏపీ, తెలంగాణల్లో 35 బంకులు సీజ్.. సీపీ సజ్జనార్

06-09-202006-09-2020 06:24:22 IST
Updated On 06-09-2020 08:50:23 ISTUpdated On 06-09-20202020-09-06T00:54:22.701Z06-09-2020 2020-09-06T00:54:13.909Z - 2020-09-06T03:20:23.191Z - 06-09-2020

పెట్రోల్ బంకుల్లో అతిపెద్ద స్కామ్.. ఏపీ, తెలంగాణల్లో 35 బంకులు సీజ్.. సీపీ సజ్జనార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అత్యాధునిక చిప్‌లతో పెట్రోల్‌ బంకుల్లో మోసాలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్

8 మంది పెట్రోల్ పంప్ ఓనర్లతో సహా 13 మంది అరెస్ట్

వాహనదారులకు బంకుల్లోనే శఠగోపం

కనిపించేది లీటర్ పెట్రోల్.. వచ్చేది మాత్రం 970 ఎంఎల్

పోలీసులు చెక్ చేసినా దొరకనివిధంగా మదర్ బోర్డ్ అమరిక

ఏలూరు నివాసి షేక్ శుభాని భాషా అతని గ్యాంగ్ ఈ స్కామ్ సూత్రధారులు

తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక తమిళనాడులోనూ ఈ  చిప్‌ల ఏర్పాటు

బంక్ ఓనర్లతో కుమ్మక్కయ్యే ఇంతపని చేశారు.

ఏపీలో 22, హైదరాబాద్‌లో 13 బంకులు సీజ్‌..

తెలంగాణ, ఆంధ్రపోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో అతిపెద్ద పెట్రోల్ తస్కరణ కుంభకోణం వెల్లడయింది. రెండు రాష్ట్రాల్లోని లీగల్ మెటరోలజీ కంట్రోలర్‌తో సమన్వయంతో సాగించిన ఈ ఆపరేషన్‌లో ఏపీలోని 22 తెలంగాణలో 11 పెట్రోల్ బంకులపై దాడి చేసిన పోలీసులు ఈ సరికొత్త కుంభకోణాన్ని చేదించి వాటిని సీజ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు సమన్వయం ఫలితంగా ఇంతవరకు 19 మంది పెట్రోల్ బంకుల యజమానులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు.

పెట్రోల్ కుంభకోణాల్లో ఇంత ఆధునికమైన, సాంకేతిక నైపుణ్యంతో కూడిన మోసాన్ని దేశం ఇంతవరకు కనీవినీ ఎరగదు. హైదరాబాద్‌లో బయటపడిన ఈ సరికొత్త స్కామ్ మూలాలు అటు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటకల్లో కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నారు. పెట్రోల్ బంకులో డిస్‌ప్లే బోర్టులో లీటర్ పెట్రోలు సరఫరా చేసినట్లు వినియోగదారుడికి కనిపిస్తున్నా, లోపల చిప్ మాయ ద్వారా 970 ఎమ్ఎల్ పెట్రోలు మాత్రమే బండిలోకి వచ్చేలా ఏర్పాటు చేశారు. 

వినియోగదారుడికి ప్రత్యక్షంగానే శఠగోపం పెట్టిన ఈ అత్యాధునిక స్కామ్‌కు రూపకల్పన చేసిన ముఠాను శనివారం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడంతో దేశం దేశమే నివ్వెరపోతోంది. డిస్‌ప్లే వెనుక ఒక చిప్ అమర్చడం ద్వారా కంటికి కనిపించకుండా, తనిఖీలకు కూడా దొరకకూండా కోట్ల రూపాయల విలువైన పెట్రోలును వనియోగదారులనుంచి కొల్గగొడుతున్న ముఠా నాయకుడు ఏపీలోని ఏలూరుకు చెందిన శుభాని అని పోలీసులు వెల్లడించారు.

పెట్రోలు బంకుల్లో ఇంటిజిట్లర్టేడ్ చిప్‌లు అమర్చి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు, ఎస్ఓట్ టీమ్స్ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పట్టుకున్నారు. వాహనదారులను దోచుకుంటూ పెట్రోల్‌ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ శనివారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఇంటిజిట్లర్టేడ్ చిప్‌ల ద్వారా 1000 ఎమ్ఎల్ పెట్రోల్‌లో 970 ఎమ్ఎల్ మాత్రమే వస్తుందని, వాహనాల్లో పెట్రోల్ పోసేటప్పుడు డిస్‌ప్లే వెనుక ఒక చిప్ అమర్చుతారని వెల్లడించారు. 

లీగల్ మెట్రాలజీ, పోలీసులు చెక్ చేసినా దొరకకుండా ఒక మదర్ బోర్డు కూడా తయారుచేశారని తెలిపారు. ఈ విధంగా హైదరాబాద్‌లోని 11 బంకుల్లో 13 చిప్పులు అమర్చారని సజ్జనార్‌ పేర్కొన్నారు. దీనిపై ఏపీ పోలీసులకు కూడా ఈ సమాచారం ఇచ్చామని, మొత్తం తెలంగాణలో 11, ఏపీలో 22 బంకుల్ని సీజ్ చేసినట్లు చెప్పారు. ఏలూరుకు చెందిన శుభాని అతని గ్యాంగ్ ఈ స్కామ్కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైకి చెందిన జోసఫ్, థామస్ అనే వ్యక్తుల ద్వారా చిప్పుల్ని తయారు చేయించారని నిందితులు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. 

ఏపీలోని పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో చిప్లు అమర్చినట్లు విచారణలో తేలిందన్నారు. షేక్ శుభాని భాష, బాజి బాబా, మాదాసు గిరి శంకర్, ఇప్పిలి మల్లేశ్వర్ రావులు ముఠాగా ఏర్పడ్డారు. ఒక సాఫ్ట్‌వేర్‌, ఒక ప్రోగ్రాం డిజైన్ చేయడానికి చాలా తెలివిగా ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక తమిళనాడులోనూ వీళ్ళు చిప్ లు పెట్టి ఉండవచ్చు, 

బంకు ఓనర్లకు ఇదంతా తెలిసే జరుగుతుంది, తెలంగాణలో 4 బీపీసీఎల్, 2 హెచ్ పీసీఎల్, 5 ఐఓసీఎల్ బంకుల్లో చిప్పులు అమర్చారు. ప్రస్తుతం వాటిని సీజ్‌ చేశాం. ఆయిల్ కార్పొరేషన్ సర్ప్రయిజ్ విజిట్ చేయటం ద్వారా ఈ మోసాన్ని కనిపెట్టలేరు. ఇక నుంచి ఆయిల్ కార్పొరేషన్ కూడా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని  సజ్జనార్‌ వివరాలను వెల్లడించారు.

ఏపీలో 22, హైదరాబాద్‌లో 13 బంకులను సీజ్‌ చేశాం: సీపీ సజ్జనార్‌

ఈ కుంభకోణంలో భాగం పంచుకున్న పెట్రోలు బంకులు అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలోనూ ఉన్నట్లు విచారణలో తేలందని.. ఇంతవరకు ఏపీలో 22, హైదరాబాద్‌లో 13 బంకులను సీజ్‌ చేశామని సీపీ సజ్జనార్‌ తెలిపారు. రంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, ఆర్‌సీపురంలలో 11 బంకుల్లో చిప్‌లను గుర్తించామన్నారు. అత్యాధునిక చిప్‌లతో పెట్రోల్‌ బంకుల్లో మోసాలు చేస్తున్నారని చెప్పారు. పెట్రోల్‌ తక్కువ వచ్చి.. మీటర్‌ కరెక్ట్‌గా చూపించేలా చిప్‌లు ఏర్పాటు చేశారని వెల్లడించారు. 

మహారాష్ట్ర నుంచి బంకుల నిర్వాహకులు ప్రత్యేక చిప్‌లు తెప్పించుకున్నారని, కోట్ల రూపాయల్లో కస్టమర్లను మోసం చేస్తున్నారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. క్యాన్‌, బాటిల్‌లో మాత్రం కరెక్ట్‌‌గా ఉన్న పంప్‌ దగ్గరకు పంపిస్తారని తెలిపారు. లీటర్‌ పెట్రోల్‌కు 30 మి.లీ నుంచి 40 మి.లీ దాకా తక్కువ కొలతలు వస్తున్నాయని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై పీడీయాక్ట్‌ నమోదు చేశామని సజ్జనార్‌ చెప్పారు.

ప్రోగ్రామ్ చేయబడిన ఈ చిప్‌ను అమర్చినందుకు గాను శుభాని భాషా ముఠా ఒక్కో పెట్రోల్ బంక్ యజమాని నుంచి 80 వేల నుంచి లక్షా 20 వేల రూపాయల వరకు వసూలు చేసేవారని సజ్జనార్ తెలిపారు. ప్లాస్టిక్ బ్యాటిల్స్‌లో క్యాన్‌లలో పెట్రోలు పోయించుకునే వారికి మాత్రం రెగ్యులర్ పంపుల ద్వారానే ఫిల్ చేసేవారు. దీంతో తూకం సరిగా కనిపించి వినియోగదారులు అనుమానించేవారు కాదు. అదే వాహనాల్లో నేరుగా పెట్రోల్  పోయించుకునేటప్పుడు ప్రోగ్రామ్ చేయబడిన చిప్‌లు అమర్చిన పంపులను వాడేవారు. దీంతో జరుగుతున్న మోసం ఎవరికీ తెలిసేది కాదని సీపీ సజ్జనార్ చెప్పారు. 

2018వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ స్టేషన్లలో కొత్త సాఫ్ట్ వేస్ ఇన్‌స్టాల్ చేశారు. ఆ తర్వాత 2019 నుంచి షేక్ శుభానీ భాషా గ్యాంగ్ తమ ఆపరేషన్ మొదలెట్టింది. ప్రతి వినియోగదారు వ్యక్తిగతంగా ఇలాంటి మోసాన్ని గుర్తించలేరు. కానీ పెట్రోల్ బంకులను సందర్శిస్తున్న తనిఖీ బృందాలు ఇలాంటి చిప్‌లు వాడుతున్నారేమోనని నిత్యం చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సజ్జనార్ అభిప్రాయపడ్డారు. తనిఖీ బృందాలు బంకుల్లో తనిఖీకి వచ్చినప్పుడు ఇంధనాన్ని మాన్యువల్‌గా కొలిస్తే అప్పుడు ఈ మోసాల భండారం తప్పక బయటపడుతుందని ఆయన అన్నారు.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   an hour ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   8 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle