newssting
BITING NEWS :
*రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు-కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ *ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ. 5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ మీటింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ *కొత్తకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ఢీ కొట్టి తుఫాన్ వాహనం బోల్తా. ఇద్దరు మృతి. 14 మందికి తీవ్రగాయాలు, హాస్పిటల్ కు తరలింపు * ఇవాళ కెసిఆర్ బర్త్ డే. కెసిఆర్ పుట్టినరోజును మొక్కల పండుగగా జరపాలని తెరాస పిలుపు. రేపు ఉదయం నుంచి మొక్కలు నాటడం... రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు *జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం. పనిచేసే కార్యకర్తలకే జనసేన పార్టీలో ప్రాధాన్యత. కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నా-పవన్ *రాజధాని మార్పు, పీఏఏల రద్దు తొందరపాటు నిర్ణయాలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి, శాసనమండలి రద్దు నిర్ణయం సరైంది కాదు-దగ్గుబాటి పురంధేశ్వరి*ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మూడోసారి సీఎంగా ప్రమాణం

పూర్తి జాగ్రత్తలు తీసుకోకుండా స్త్రీలు బయటకు రావద్దు: హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తి

03-12-201903-12-2019 12:42:03 IST
2019-12-03T07:12:03.607Z03-12-2019 2019-12-03T07:10:35.604Z - - 17-02-2020

పూర్తి జాగ్రత్తలు తీసుకోకుండా స్త్రీలు బయటకు రావద్దు: హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో మహిళలు ప్రయాణించేటప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. తామెక్కడికి వెళుతున్నదీ స్నేహితులకు లేక కుటుంబ సభ్యులకు తెలపాలని, సాధ్యపడితే తామెక్కడ ఉన్నది లొకేషన్ కూడా షేర్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భాగవత్ చెప్పారు. 26 ఏళ్ల పశువైద్యురాలు 'దిశ'పై అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా ఆగ్రహం కలిగించిన నేపత్యంలో నగర పోలీసులు ముందస్తు సలహాను విడుదల చేశారు. 

మహిళలు టాక్సీ లేక ఆటోలో ప్రయాణిస్తున్నట్లయితే డ్రైవర్, నంబర్ ప్లేట్‌ వివరాలను తప్పకుండా తెలిసిన వారికి షేర్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సూచించారు. తెలియని ప్రాంతానికి వెళుతున్నప్పుడు ముందుగానే రూట్ గురించి తెలుసుకోవాలి. జనం ఉన్న చోటే వేచి ఉండాలి. ఎవరూ లేని ప్రాంతంలో అస్సలు ఉండకూడదు. సహాయం అవసరమైన సమయంలో పోలీసు పెట్రోల్ కార్ లేదా పెట్రోల్ బైక్‌కు తప్పక కాల్ చేయాలి. అలాగే ప్రమాదం శంకించిన వెంటనే 100కి కాల్ చేయాలి. హైదరాబాద్ పోలీసులు రూపొందించిన హాక్ ఐ యాప్‌ని కూడా మొబైల్‌లో డౌన్ లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి అని మహషే భగవత్ సూచించారు.

నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు సందేహం వచ్చిన వెంటనే గట్టిగా అరవాలని, అక్కడినుంచి జనం ఉన్నచోటికి పరుగెత్తాలని సూచించారు. మా వంతుగా నేరాలను నిరోధించడానికి కృషి చేస్తాం. అదే సమయంలో మహిళలు తమ వంతు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అలాగే స్థానికంగా చెడు తిరుగుళ్లు తిరుగుతున్న వారి వివరాలు ఎవరికి తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

అవాంచిత వ్యక్తులకు సంబంధించిన ఫోటోలను పోలీసు శాఖ వాట్సాప్ 9490617111 నంబర్ కి పంపించాలని రాచకొండ పోలీసు కమిషనర్ చెప్పారు. 

అయితే పోలీసులు జారీ చేసిన ఈ భద్రతా సూచనలన్నింటినీ స్వాగతిస్తూనే వారు చేసిన సూచనలు అమ్మాయిలకు, మహిళలకు తెలియనివేం కావు. కానీ అంతకు మించి దిగువ స్థాయి పోలీసు సిబ్బందిలో నిర్లక్ష్యాన్ని యుద్ధప్రాతిపదిక మీద పోగొట్టాల్సి ఉంటుంది. మిస్సింగ్ గురించి తమ వద్దకు వచ్చే ఫిర్యాదులను వారు ఏమాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. డాక్టర్ దిశ కేసులోకూడా పోలీసు సిబ్బంది ఫిర్యాదు నమోదు చేసుకోవడానికి, ఎవరి పరిధికిందికి వస్తుందో చెప్పడానికి గంటల సమయం తీసుకున్నారు. పైగా ఆమె ఎవరితోనో లేచి పోయి ఉంటుందని కూడా వ్యాఖ్యానించి ఆమె కుటుంబానికి తీరని వ్యధ కలిగించారు. 

‘దిశ’ కేసులోనూ పోలీసులకు యువతి అదృశ్యం పై ఫిర్యాదు చేయగానే.. తొలుత ప్రేమ వ్యవహారమంటూ తేలిగ్గా తీసుకున్నారు. మరునాడు ఆమె విగతజీవిగా మారింది. పోలీసులు అదేక్షణంలో స్పందించి ఉంటే తమ బిడ్డ బతికి ఉండేదని బాధిత కుటుంబీకులు ఆరోపించడంతో ముగ్గురు పోలీసులపై వేటుపడిన సంగతి తెలిసిందే. పోలీసు శాఖలో ఈ విధమైన నిర్లక్ష్యం రూపుమాపనిదే మహిళలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వారి భద్రత గాల్లో దీపంలాగే ఉంటుంది.

కాగా, ‘దిశ’కేసు నేపథ్యంలో యువతులు, బాలికల మిస్సింగ్‌ కేసుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని డీజీపీ కార్యాలయం అన్ని జిల్లాల ఎస్పీ, కమిషనరేట్లకు ఆదేశాలు జారీ చేసింది. నిర్లక్ష్యం వహిస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించింది. డయల్‌ 100కు వచ్చే కాల్స్‌లోనూ వీలైనంత త్వరగా ఘటనాస్థలానికి చేరుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

 

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

   an hour ago


మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

   an hour ago


మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

   3 hours ago


కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

   3 hours ago


అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

   5 hours ago


రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

   5 hours ago


కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

   7 hours ago


కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

   7 hours ago


అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

   8 hours ago


‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle