newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

22-02-202022-02-2020 10:56:50 IST
2020-02-22T05:26:50.611Z22-02-2020 2020-02-22T05:23:05.318Z - - 15-04-2021

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ పీసీసీ రేసులో సీనియర్లు

పదవి కోసం ఆశ పడుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్

సోనియా ఎవరిని కరుణిస్తారో?

రేసులో శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ 

పార్టీని నడపడం పరీక్షే

రాబోయే రోజుల్లో మరింత కష్టకాలం

నిస్తేజంలో వున్న పార్టీని ముందుండి నడిపించేదెవరు? 

తెలంగాణ పీసీసీ పీఠం ఎవరికి దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరుణ కోసం నేతలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు, తాజాగా పీసీసీ అధ్యక్ష పదవి రేసులో తాను కూడా వున్నానని అంటున్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్లగొండ జిల్లా పానగల్‌ ఛాయా సోమేశ్వరాలయంలో శివరాత్రి సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పీసీసీ అధ్యక్షుడి  రేస్‌లో తను ఉన్నానని.. పార్టీలో సీనియర్‌గా తనకు అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడమే తన ఏకైక లక్ష్యం అని పేర్కొన్నారు. కేసీఆర్‌కు రాష్ట్రాభివృద్ధి కంటే కమీషన్లపైనే మక్కువ ఎక్కువని విమర్శించారు. ఐదేళ్లుగా నిధులివ్వకుండా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో సీఎం కేసీఆర్ హడావుడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

చిన్న చిన్న పనులకు కూడా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. ఎంపీగా పార్లమెంటులో జిల్లా సమస్యలను ప్రస్తావించానని తెలిపారు. త్వరలో ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నానని, ముఖ్యమంత్రి మెడలు వంచి నిధులు తీసుకువస్తానన్నారు. ఆరేళ్లలో ఒక్క ఇల్లు కట్టకపోవడం ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం అని కోమటిరెడ్డి విమర్శించారు.

గతంలో ఒకసారి పీసీసీ అధ్యక్ష పదవి అడిగితే తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. త్వరలో సోనియా గాంధీ నుంచి తనకు శుభవార్త వినిపించబోతుందన్నారు. పీసీసీ పీఠం దక్కుతుంది అన్న నమ్మకం ఉందన్నారు. తనకు పదవి ఇస్తే రాష్ట్రమంతా తిరిగి పార్టీకి పునర్వైభవం తెస్తానన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle