newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

04-06-202004-06-2020 07:04:08 IST
Updated On 04-06-2020 09:51:47 ISTUpdated On 04-06-20202020-06-04T01:34:08.772Z04-06-2020 2020-06-04T01:34:03.194Z - 2020-06-04T04:21:47.998Z - 04-06-2020

పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ కాంగ్రెస్‌లో మూడేళ్లుగా స‌మాధానం దొర‌క‌ని ప్ర‌శ్న‌గా మిగిలిపోతోంది త‌ర్వాతి పీసీసీ అధ్య‌క్షుడు ఎవ‌రు అనేది. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తర్వాత పార్టీ ప‌గ్గాలు అందుకోబోయేది ఎవ‌ర‌నేది ఎంత‌కూ నిర్ణ‌యం కావ‌డం లేదు. కాంగ్రెస్ హైక‌మాండ్ ఈ విష‌యంంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. కొత్త అధ్య‌క్షుడిని ఎంపిక చేస్తే పార్టీలో లుక‌లుక‌లు మొద‌ల‌వుతాయేమో అనే ఆలోచ‌న‌లో కాంగ్రెస్ హైక‌మాండ్ ఉంది. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త పీసీసీ చీఫ్ నియామ‌కాన్ని వాయిదా వేస్తూ వ‌స్తోంది. నిజానికి మార్చ్‌లోనే కొత్త పీసీసీ అధ్య‌క్షుడిగా ఎంపిక‌పై ఒక నిర్ణ‌యం రాబోతోంద‌ని రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. అప్పుడు క‌ర్ణాట‌క‌కు డీకే శివ‌కుమార్‌ను కొత్త పీసీసీ చీఫ్‌గా నియ‌మించిన సోనియా గాంధీ తెలంగాణ పీసీసీని మాత్రం పెండింగ్‌లో పెట్టారు.

ప్ర‌స్తుత పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ ప‌ద‌వీకాలం ముగిసింది. ఇప్ప‌టికే ఆయ‌న రెండు ప‌ర్యాయాలు ఈ ప‌ద‌విలో కొన‌సాగారు. అంత‌కుముందు పీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా ప‌ని చేశారు. ఆయ‌న నాయ‌క‌త్వంలో పార్టీ వ‌రుస ప‌రాజ‌యాల‌ను ఎదుర్కుంది. రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులు టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉండ‌టంతో ఆయ‌న పార్టీని అధికారంలోకి తీసుకురాలేక‌పోయారు. ఇక‌, తాను ఈ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటాన‌ని ఆయ‌న బ‌హిరంగానే ప్ర‌క‌టించారు. అధిష్టానానికి కూడా ఇదే విష‌యాన్ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దీంతో కొత్త పీసీసీ చీఫ్ నియామ‌కంపై అధిష్టానం క‌స‌ర‌త్తు ప్రారంభించింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్య నేత‌ల అభిప్రాయాల‌ను తెలుసుకుంది.

ఐదారుగురు నేత‌లు ఈ ప‌ద‌వి కోసం పోటీ ప‌డుతున్నారు. వీరిలో చివ‌ర‌గా భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రేసులో నిలిచారు. వీరిద్ద‌రి పేర్ల‌నే అధిష్టానం సీరియ‌స్‌గా ప‌రిశీలిస్తోంది. ఇద్ద‌రు నేత‌లూ ఢిల్లీ స్థాయిలో త‌మ‌కున్న ప‌రిచ‌యాల‌ను ఉప‌యోగించుకొని ఈ ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. రాష్ట్రంలోనూ చాలా మంది కాంగ్రెస్ నేత‌లు ఈ ఇద్ద‌రి వైపే మొగ్గు చూపార‌ట‌. దీంతో ఇద్ద‌రు నేత‌ల‌ను కూడా హైక‌మాండ్ ఢిల్లీ పిలిపించి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తే ఎలా ప‌ని చేయాల‌నుకుంటున్నారు, మీ ప్ర‌ణాళిక‌లు ఏంటి అనే విష‌యాల‌ను కూడా ఆరా తీసింద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇద్ద‌రు నేత‌లూ ఎవ‌రికి ఇచ్చినా తాము క‌లిసి ప‌ని చేస్తామ‌ని హైక‌మాండ్‌కు చెప్పిన వ‌చ్చార‌ని స‌మాచారం.

అయితే, ఇద్ద‌రూ ఈ ప‌ద‌వి కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. దూకుడు క‌లిగిన నేత కావ‌డం, రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉండ‌టం, టీఆర్ఎస్‌ను ఎదుర్కోవ‌డంలో ముందుండే నేత కావ‌డం రేవంత్ రెడ్డికి క‌లిసి వ‌చ్చే అంశాలు. అయితే, జ‌గ్గారెడ్డి, వి.హ‌నుమంత‌రావు వంటి కొంద‌రు కీల‌క నేత‌లు రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇవ్వొద్ద‌ని గ‌ట్టిగా చెబుతున్నారు. జూనియ‌ర్ అయినా రేవంత్‌కు పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గిస్తే ఆయ‌న కింద ప‌ని చేయ‌లేమ‌ని కూడా కొంద‌రు నేత‌లు కాంగ్రెస్ హైక‌మాండ్‌కు చెప్పార‌ని అంటున్నారు. మ‌రోవైపు కేసులు కూడా రేవంత్‌కు మైన‌స్ అవుతాయ‌ని అంతా అనుకున్నారు. కానీ, క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్‌గా నియ‌మితులైన డీకే శివ‌కుమార్‌పై కూడా మ‌నీ లాండ‌రింగ్ వంటి కేసులు ఉన్నాయి. కాబ‌ట్టి, కేసులు పెద్ద‌గా అడ్డంకి కాక‌పోవ‌చ్చు.

ఇక‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డికి కూడా చాలా క‌లిసి వ‌చ్చే అంశాలు ఉన్నాయి. ఆయ‌న విద్యార్థి ద‌శ నుంచి ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌లో ప‌ని చేస్తూ వ‌చ్చారు. ముందు నుంచీ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆయ‌న కూడా రాష్ట్ర‌వ్యాప్తంగా ఇమేజ్ ఉంది. న‌ల్గొండ జిల్లాలో బ‌ల‌మైన నేత‌గా ఉన్నారు. పార్టీలోనూ సీనియ‌ర్‌. పైగా తెలంగాణ కోసం మంత్రి ప‌ద‌విని వ‌దులుకున్నార‌ని, నిరాహార దీక్ష చేశార‌నే సానుకూల అంశాలూ ఉన్నాయి. రేవంత్ రెడ్డిని వ్య‌తిరేకిస్తున్న నేత‌ల్లో కొంద‌రు వెంక‌ట్‌రెడ్డి అయితే ఓకే అనే భావ‌న‌లో ఉన్నారు. గ‌తంలో న‌ల్గొండ నేత‌లు జానారెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో కోమ‌టిరెడ్డికి స్వ‌ల్ప విభేదాలు ఉండేవి. ఇప్పుడు వెంక‌ట్‌రెడ్డి వారి ఉత్త‌మ్ మ‌ద్ద‌తును కూడా కూడ‌గ‌ట్టార‌ట‌.

పీసీసీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నాక ఉత్త‌మ్‌కు క‌చ్చితంగా ఏఐసీసీలో స్థానం ల‌భించ‌బోతోంది అనే ప్ర‌చారం ఉంది. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక‌లోనూ ఆయ‌న అభిప్రాయం కీల‌కం కాబోతోంది. అయితే, క‌రోనా వైర‌స్ ప్ర‌భావం లేక‌పోతే ఈ పాటికే కొత్త పీసీసీ నియామ‌కం జ‌రిగి ఉండేద‌ట‌. ఇంకో రెండు నెల‌లు కూడా ఇదే ప‌రిస్థితి ఉండ‌నుంది. దీంతో ఆగ‌స్టులో తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్య‌క్షుడు రావ‌డం ఖాయంగా తెలుస్తోంది. కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, రేవంత్ రెడ్డిల‌లో ఎవ‌రో ఒక‌రు కాబోయే పీసీసీ చీఫ్ అనేది కూడా ఒక అంచ‌నా వ‌చ్చేసింది. మ‌రి, ఏం జ‌రుగుతుందో చూడాలి.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle