newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

23-01-202023-01-2020 13:41:25 IST
2020-01-23T08:11:25.252Z23-01-2020 2020-01-23T08:11:21.806Z - - 17-04-2021

పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఊరంతా ఒకటైతే.. తాను ఒక్కడిది ఒక దారి అన్న సామెత అచ్చంగా కాంగ్రెస్ పార్టీకే సరిపోద్దేమో! ఈ సామెతని రజనీకాంత్ స్టైల్లో తన దారి రహదారి అని కాంగ్రెస్ నేతలు అనుకుంటూ ముందుకు వెళ్తారేమో అందుకే లోకం ఏమనుకుంటున్నా తనకి అనవసరం అని వాళ్ళ కుమ్ములాటలో వాళ్ళుంటారు. నిన్నటి వరకు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా సర్వశక్తులు ఒడ్డి ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా పోరాడింది. బీజేపీ కూడా తమకి ఉన్న పరిధిలో గట్టి పోటీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నలుగురు నేతలు మాత్రేమే వాళ్ళ పరిధిలో తమ నేతల గెలుపుకి పనిచేశారు. అయితే రాష్ట్రమంతా ఎన్నికల హడావుడిలో ఉంటే ఆ పార్టీ సీనియర్లు మాత్రం అధిష్టానానికి లేఖలు రాసే పనిలో ఉండిపోయారు.

తాజాగా ఆ పార్టీ సీనియ‌ర్లు గాంధీ భ‌వ‌న్లో స‌మావేశ‌మై కొత్త పీసీసీ అధ్య‌క్షుడిపై చర్చించారట. నిజానికి పీసీసీ చీఫ్ నియామ‌కంలో ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలనే దానికోసం కాంగ్రెస్ పార్టీలో విధేయుల ఫోర‌మ్ అనేది ఒక‌టుంది. ఈ ఫోర‌మ్ లో మొద‌ట్నుంచీ కాంగ్రెస్ లో ఉంటున్న నేత‌లు స‌భ్యులు కాగా.. ఇత‌ర పార్టీల నుంచి వ‌ల‌స వ‌చ్చినవారికి ఇందులో అవకాశం లేదు.

గతంలో అలానే అధిష్టానానికి రికమెండ్ చేసేవాళ్ళు. అలానే ఇప్పుడు కూడా సమావేశమయ్యారు. ఇందులో సీనియ‌ర్ నేత వీ హెచ్, శ‌శిధ‌ర్ రెడ్డి, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్య‌క్షుడు కోదండ‌రెడ్డి త‌దిత‌ర సీనియర్లంతా ఉండగా తాజాగా హైకమాండ్ కి లేఖ రాశారు. ఈ లేఖలో పీసీసీ అధ్య‌క్షుడి ఎంపిక‌లో ఆ నాయ‌కుడి అనుభ‌వాన్ని, పార్టీ ప‌ట్ల ఉన్న విధేయ‌త‌ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌న్నారు.

అంతవరకు అయితే తప్పు లేదు, కానీ న్యాయ‌స్థానాల్లో కేసులు ఎదుర్కొంటున్న నాయ‌కుల్ని ఎంపిక చేయ‌రాద‌ని, పార్టీ కోస‌మే పూర్తి స‌మ‌యం కేటాయించ‌గ‌లిగేవారు, పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యానికి స‌మీపంలో ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉండ‌గ‌లిగేవారు, వ్యాపార వాణిజ్యాల‌తో ఏమాత్రం సంబంధం లేనివారు, అన్నిటికీమించి పార్టీలో అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన వారిని ఎంపిక చేయాలని లేఖలో పేర్కొన్నారు.

దీంతో ఆ లేఖలో రాసిన అంశాలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే పంపినట్లుగా కనిపిస్తున్నాయని గాంధీ భవన్ వర్గాలే చెప్తున్నాయి. కొత్త అధ్యక్షుడిగా రేవంత్ పేరు దాదాపుగా ఖరారైందని పార్టీ వర్గాలలో బలంగా వినిపిస్తుంది. ఈక్రమంలోనే సీనియర్ నేతలు జీర్ణించులోలేక ఈ లేఖాస్త్రం ప్రయోగించారని ప్రచారం జరుగుతుంది. మరి అధిష్టానం లేఖను పరిగణలోకి తీసుకుంటుందా? లేక ఇప్పటికే ఎంపిక జరిగిపోయిందా? అన్నది వేచిచూడాల్సి ఉంది.

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   14 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   11 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   15 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   13 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle