newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

11-08-202011-08-2020 08:52:54 IST
Updated On 11-08-2020 09:07:09 ISTUpdated On 11-08-20202020-08-11T03:22:54.792Z11-08-2020 2020-08-11T03:22:33.975Z - 2020-08-11T03:37:09.999Z - 11-08-2020

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోందా? జల జగడాలు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలకు కారణంగా అవుతాయా? అంటే అవుననే అనిపిస్తోంది. ఏపీలో అధికార మార్పిడి జరిగాక 2019లో సీయం జగన్, కేసీయార్ పలు పర్యాయాలు కూర్చుని అనేక విషయాలు చర్చించారు. 

''నా అంతట నేనే ఆంధప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాను. బేసిన్లు, భేషజాలు వద్దని, సహజ సరిహద్దు రాష్ట్రాలుగా స్నేహ పూర్వకంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాను. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థం లేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తున్నది'' అంటూ ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు రచ్చరేపుతున్నాయి.

తెలంగాణ నిర్మిస్తోన్న వివిధ ప్రాజెక్టుల విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తోందని, ఆంధ్రప్రదేశ్ తో పాటు కేంద్ర ప్రభుత్వానికి తగిన విధంగా గట్టిగా బుద్ధి చెబుతామని సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం కేసీయార్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ త్వరలో నిర్వహించబోయే అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఏపీ, కేంద్రానికి దిమ్మతిరిగేలా.. పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం ముందు పెట్టి సమర్థ వంతంగా వాదనలను వినిపించాలని సీఎం నిర్ణయించారు.

గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కులను వివరించాలని. అనవసరంగా తెలంగాణపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.  తమకు లభించే నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు రీడిజైన్ చేసి నిర్మిస్తున్నామని, దీన్ని ఏపీ వాళ్లు పట్టడంలో అర్థమే లేదని కేసీఆర్ అన్నారు. గతంలో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం.. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసిందని, ప్రతిగా ఆంధ్రలో చేపట్టిన ముచ్చుమర్రిని తెలంగాణ ప్రస్తావించిందన్నారు.

దీంతో రెండింటిని కొనసాగించాలనే నిర్ణయం జరిగిందని గుర్తుచేసిన ముఖ్యమంత్రి.. ఏపీ సర్కారు మళ్లీ ఆ అంశాన్ని లేవనెత్తడం భావ్యం కాదన్నారు. త్వరలో జరగబోయే అపెక్స్ కమిటీ సమావేశంలో ఏపీ ప్రభుత్వం నోరు మూయించాలన్నారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సమ్మక్క సాగర్, రాజీవ్ సాగర్ -ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సీతమ్మ సాగర్ ను నిర్మిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. పెన్ గంగ ప్రాజెక్టులకు 1975లోనే ఒప్పందం కుదిరి, ట్రిబ్యునల్ అవార్డు కూడా పూర్తయిందన్నారు. 

అంతేకాదు పనిలో పనిగా మోడీపైన విమర్శలు చేశారు కేసీయార్. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పుగా ఉందని కేసీఆర్ ఫైరయ్యారు. రాష్ట్రానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ.. రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలోనూ కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏంటన్నారు.

నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నా, ఇంకా తెలంగాణకు నీటి అవసరం ఉందని, గోదావరి మిగులు జలాల్లో మరో వెయ్యి టీఎంసీలు, దక్కాల్సి ఉందని, సముద్రంలో కలిసే రెండు వేల టీఎంసీల్లో తెలంగాణకు కనీసం వెయ్యి టీఎంసీలు కేటాయించాల్సి ఉందని పేర్కొన్నారు.

ఆంధ్ర-తెలంగాణ జల వివాదాలను పరిష్కరించే ఉద్దేశంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తలపెట్టిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఈనెల 20న జరిగే అవకాశాలున్నాయి. నిజానికి ఈనెల 5నే భేటీకి కేంద్రం పిలుపునివ్వగా, దానికి హాజరుకాబోమని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. అదే మీటింగ్ ను 20వ తేదీన నిర్వహిస్తే ఒకే అని సమాచారం ఇవ్వడంతో, ఆ మేరకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలసింది. ఈ సమావేశంలో వాడివేడిగా సాగే అవకాశం ఉంది. 

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   6 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle