newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

పారాసెటిమాల్ కొంటే బుక్ అయిపోతారు. మేల్కొన్న తెలంగాణ ప్రభుత్వం

19-04-202019-04-2020 11:39:12 IST
Updated On 19-04-2020 12:35:25 ISTUpdated On 19-04-20202020-04-19T06:09:12.605Z19-04-2020 2020-04-19T06:09:10.777Z - 2020-04-19T07:05:25.458Z - 19-04-2020

పారాసెటిమాల్ కొంటే బుక్ అయిపోతారు. మేల్కొన్న తెలంగాణ ప్రభుత్వం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ పరీక్షలకు దొరక్కుండా, విదేశాలనుంచి భారత్‌కు తిరిగి వస్తున్న వారు విమానం ఎక్కేముందు పారాసెటిమాల్ మాత్ర వేసుకుని లోపలి జ్వరాన్ని తగ్గించుకుని థర్మల్ టెస్టుకు దొరక్కుండా తప్పించుకుని విమానాశ్రయాలనుంచి బయటపడ్డారని నెలరోజుల క్రితం వార్తలు వచ్చాయి. దాన్ని తెలంగాణలో సామాన్య ప్రజలు కూడా పాటించి పారాసెటిమాల్ మాత్రతో తమ లోపలి జ్వరాన్ని తగ్గించుకుని కరోనా కేసులు చేయించుకోకుండా తప్పించుకుంటున్నారని వార్తలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమం అయింది. 

కరోనా లక్షణాలైన జ్వరం, గొంతు నొప్పి నివారణకు ఇటీవల కాలంలో మెడికల్‌ షాపుల నుంచి మందులు కొనుగోలు చేసిన వారి వివరాలను తెలుసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు  ఆదేశించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో సొంత వైద్యం మరింత ప్రమాదమని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. 

కరోనా లక్షణాలైన జ్వరం, గొంతు నొప్పి నివారణకు ఇటీవల కాలంలో మెడికల్‌ షాపుల నుంచి మందులు కొనుగోలు చేసిన వారి వివరాలను తెలుసుకోవాలని ఆదేశించారు. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల సహకారంతో ఆయా మున్సిపాలిటీల్లోని ఫార్మసీ అసోసియేషన్‌ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై సమాచారాన్ని సేకరించాలన్నారు. 

జ్వరం, గొంతు నొప్పి మందులను కొనుగోలు చేసిన వారి వివరాలను తప్పనిసరిగా అందజేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్‌తో కలసి మంత్రి కేటీఆర్‌ శుక్రవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో  వీడియో కాన్ఫరెన్స్‌  నిర్వహించారు. కంటైన్మెంట్‌ జోన్లలోని ప్రజలను ఇళ్లకే పరిమితం చేయాలని మున్సిపల్‌ కమిషనర్లు, జోనల్‌ కమిషనర్లను కేటీఆర్‌ ఆదేశించారు.

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కంటైన్మెంట్‌ జోన్లలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని కేటీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో 260 కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేస్తే, జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 146 జోన్లు ఉన్నాయన్నారు. ఇతర జిల్లాల్లోని 43 మున్సిపాలిటీల్లో మిగిలిన 114 కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నట్లు తెలిపారు. పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, మెడిసిన్స్‌ను  ఇళ్ల వద్దకే సరఫరా చేయాలని సూచించారు. ప్రభుత్వం నియమించిన వలంటీర్లు, సిబ్బందితో మాత్రమే నిత్యావసరాలను డోర్‌ డెలివరీ చేయించాలన్నారు. వీలైతే వలంటీర్లు, సిబ్బందికి ప్రత్యేక దుస్తులు అందజేయాలన్నారు.

కంటైన్మెంట్‌ జోన్లలోకి దాతలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోరాదన్నారు. కంటైన్మెంట్‌ జోన్లలోని కుటుంబాల మొబైల్‌ నంబర్లతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి, అవసరాలను తెలుసుకోవాలన్నారు. కంటైన్మెంట్‌ నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.  

ప్రజల సహకారం పైనే కంటైన్మెంట్‌ జోన్ల తొలగింపు ఆధారపడి ఉంటుందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 కంటైన్మెంట్‌ జోన్లను తొలగించినట్లు మంత్రి ఉదహరించారు. 

వలస కార్మికులు తమ రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లేందుకు తొందరపడుతున్నప్పటికీ, రోడ్లపైకి ఎవరిని అనుమతించరాదని తెలిపారు. వలస కార్మికులకు ప్రస్తుతం వారున్న ప్రాంతంలోనే భోజన సదుపాయాలు కల్పించాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. 

కూసాలు కదులుతున్నాయ్.. ఓటుకు నోటుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు!

కూసాలు కదులుతున్నాయ్.. ఓటుకు నోటుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు!

   an hour ago


డైరెక్ట్ గా భాగ్యలక్ష్మి ఆలయానికే..!

డైరెక్ట్ గా భాగ్యలక్ష్మి ఆలయానికే..!

   an hour ago


పేర్ని నానిపై హత్యాయత్నం.. ఎందుకు దాడి చేశాడో తెలియదు

పేర్ని నానిపై హత్యాయత్నం.. ఎందుకు దాడి చేశాడో తెలియదు

   2 hours ago


తేనెతుట్టెని కెలికి నెత్తిన పెట్టుకున్న విజయసాయి!

తేనెతుట్టెని కెలికి నెత్తిన పెట్టుకున్న విజయసాయి!

   4 hours ago


మేమూ నచ్చకపోతే నోటాకు వెయ్యండి. ఓటు మాత్రం వేయండి.. కేటీఆర్

మేమూ నచ్చకపోతే నోటాకు వెయ్యండి. ఓటు మాత్రం వేయండి.. కేటీఆర్

   5 hours ago


బీహార్ను గుర్తుకు తెచ్చేలా ఎమ్మెల్యే వ్యవహారం.. అధికారిపై దుర్బాష ఫోన్ కాల్ !

బీహార్ను గుర్తుకు తెచ్చేలా ఎమ్మెల్యే వ్యవహారం.. అధికారిపై దుర్బాష ఫోన్ కాల్ !

   6 hours ago


ఆర్థిక పర్యాటక రంగాల్లో ఏపీ ప్రగతి అద్బుతం.. ఇండియా టుడే సర్వే

ఆర్థిక పర్యాటక రంగాల్లో ఏపీ ప్రగతి అద్బుతం.. ఇండియా టుడే సర్వే

   6 hours ago


రాజుగారిపై వేటుకి ముహుర్తం పెట్టేసిన జగన్?!

రాజుగారిపై వేటుకి ముహుర్తం పెట్టేసిన జగన్?!

   6 hours ago


ఇజ్జ‌త్ మొత్తం నివ‌ర్ తుఫాన్ లో కొట్టుకుపోయే

ఇజ్జ‌త్ మొత్తం నివ‌ర్ తుఫాన్ లో కొట్టుకుపోయే

   7 hours ago


గెలిపించండి చాలు.. హైదరాబాద్ పేరే మార్చేస్తాం.. యోగి

గెలిపించండి చాలు.. హైదరాబాద్ పేరే మార్చేస్తాం.. యోగి

   7 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle