newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పారాసిట‌మాల్ పేరుతో సీఎంల‌ను అడేసుకుంటున్నారు..!

17-03-202017-03-2020 08:12:03 IST
2020-03-17T02:42:03.211Z17-03-2020 2020-03-17T02:41:56.440Z - - 19-04-2021

పారాసిట‌మాల్ పేరుతో సీఎంల‌ను అడేసుకుంటున్నారు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ప్ర‌తీ ఒక్క‌రిలోనూ క‌రోనా వైర‌స్ ప‌ట్ల ఆందోళ‌న నెల‌కొంది. అయితే, మ‌న తెలుగు రాష్ట్రాల్లో మాత్రం క‌రోనా వైర‌స్‌ను ఒక కామెడీ చేసేశారు నెటిజ‌న్లు. క‌రోనా వైర‌స్ కంటే ఇప్పుడు పారాసిట‌మ‌ల్‌ను ఫేమ‌స్ చేసేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు కార‌ణం. క‌రోనా వైర‌స్‌కు పారాసిట‌మ‌ల్ వాడితే చాల‌ని ముఖ్య‌మంత్రులు చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెందిన శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి.

ఇటీవ‌ల అసెంబ్లీలో క‌రోనా వైర‌స్‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... క‌రోనా వైర‌స్‌కు పారాసిట‌మ‌ల్ చాలని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్‌కు పారాసిట‌మ‌ల్ చాల‌ని ముఖ్య‌మంత్రులు మాట్లాడ‌టం ఏంట‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల శ్రేణులు సోష‌ల్ మీడియా వేదిక‌గా దుమ్మెత్తి పోస్తున్నారు.

ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో నేత‌ల కంటే పార్టీ కార్య‌క‌ర్త‌లే ఎక్కువ‌గా పోరాడుతుంటారు. సోష‌ల్ మీడియాలో నిత్యం మాట‌ల యుద్ధాలు, ట్రోలింగులు న‌డుస్తుంటాయి. తాజాగా జ‌గ‌న్ చేసిన పారాసిట‌మ‌ల్ వ్యాఖ్య‌ల‌తో టీడీపీ, జ‌న‌సేన శ్రేణులు జ‌గ‌న్‌ను విప‌రీతంగా ట్రోల్ చేసి కామెడీ చేస్తున్నారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌంట‌ర్ ఇచ్చేందుకు తిప్ప‌లు ప‌డుతున్నారు. దీంతో పారాసిట‌మ‌ల్‌పై సోష‌ల్ మీడియాలో యుద్ధం న‌డుస్తోంది.

అయితే, ఈ వ్య‌వ‌హారంలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు చెప్పిన దాంట్లో త‌ప్పేమీ లేదు. కాక‌పోతే కేవ‌లం పారాసిట‌మ‌ల్ మాత్ర‌మే స‌రిపోతుంద‌న‌డ‌మే త‌ప్పు. క‌రోనా వైర‌స్‌కు ఇప్ప‌టివ‌ర‌కు మందు లేదు. ఇప్పుడిప్పుడే చైనా, అమెరికా క‌రోనాకు మెడిసిన్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అమెరికాలో రేపోమాపో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌ర‌గ‌నున్నాయి. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగినా, ప‌రిశోధ‌న‌లు విజ‌య‌వంతం అయినా వెంట‌నే మెడిసిన్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం లేదంటున్నారు.

ఇదే స‌మ‌యంలో క‌రోనా వైర‌స్‌కు మెడిసిన్ లేక‌పోయినా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ వైర‌స్ బారిన ప‌డిన వారు క్ర‌మంగా కోలుకుంటున్నారు. మ‌న దేశంలోనూ క‌రోనా వైర‌స్ సోకిన వారు కోలుకుంటున్నారు. వైద్య చికిత్స ద్వారానే వీరంతా కోలుకుంటున్నారు. కరోనా వైర‌స్‌ను రోగ‌నిరోధ‌క శ‌క్తి బాగా ఉన్న వారు ఎదుర్కోగ‌ల‌రు. కాబ‌ట్టి, చికిత్స చేసే స‌మ‌యంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతున్నారు. ఇదే స‌మ‌యంలో క‌రోనా వ‌ల్ల వ‌చ్చే జ్వ‌రం, జ‌లుబు, ద‌గ్గును నివారించేందుకు పారాసిట‌మ‌ల్‌తో పాటు మ‌రికొన్ని మందులు వాడుతున్నారు.

మ‌న దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లోనూ వైద్యులు ఇదే ప‌ద్ధ‌తి అవ‌లంభిస్తున్నారు. మ‌న దేశానికే చెందిన గ‌గ‌న్‌దీప్ కాంగ్ అనే ఓ శాస్త్ర‌వేత్త కూడా ఇదే విష‌యాన్ని ప్ర‌క‌టించారు. క‌రోనా వైర‌స్ సోకిన ఐదుగురిలో న‌లుగురు పారాసిట‌మ‌ల్ ద్వారానే కోలుకుంటార‌నేది ఆమె వాద‌న‌. ఈ వార్త చాలా ప‌త్రిక‌ల్లో వ‌చ్చింది. బ‌హుశా ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, జ‌గ‌న్ ఇందుకే పారాసిట‌మ‌ల్ ద్వారా క‌రోనా వైర‌స్‌కు చికిత్స చేయ‌వ‌చ్చ‌ని చెప్పి ఉంటారు.

దీంతో తెలంగాణ‌లో టీఆర్ఎస్ శ్రేణులు, ఏపీలో వైసీపీ శ్రేణులు ప్ర‌స్తుతానికి పారాసిట‌మ‌ల్ మాత్ర‌మే క‌రోనా వైర‌స్‌కు మందు అని నిరూపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ, ముఖ్య‌మంత్రుల వ్యాఖ్య‌ల‌పై ట్రోలింగ్ కొన‌సాగుతోంది.

పారాసిట‌మ‌ల్ క‌రోనా వైర‌స్‌కు ప‌ని చేసే అవ‌కాశాలు ఉంటే ఉండ‌వ‌చ్చు కానీ క‌రోనా వైర‌స్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న‌లు నెల‌కొన్న స‌మ‌యంలో కేవ‌లం పారాసిట‌మ‌ల్ చాలు అని ముఖ్య‌మంత్రులు వ్యాఖ్యానించ‌డంతో వారు క‌రోనా వైర‌స్‌ను తేలిగ్గా తీసుకుంటున్నార‌నే సంకేతాలు వెళ్లే అవ‌కాశం ఉంది. పైగా ఇలా సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్‌కు గుర‌వుతున్నారు. మొత్తంగా మూడు నాలుగు రోజులుగా క‌రోనా కంటే పారాసిట‌మ‌ల్ పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle