పాపం పసివాడు.. ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి
28-05-202028-05-2020 08:31:33 IST
Updated On 28-05-2020 09:28:29 ISTUpdated On 28-05-20202020-05-28T03:01:33.934Z28-05-2020 2020-05-28T03:01:16.093Z - 2020-05-28T03:58:29.845Z - 28-05-2020

బోరుబావి మృత్యుదారిగా మారింది. మూడేళ్ళ బాలుడిని బలితీసుకుంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడిచన్పల్లి గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి సంజయ్ సాయివర్ధన్ మృతి చెందాడు. బాలుడిని రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించినా అవి ఫలించలేదు. బోరుబావిలో 25 అడుగుల లోతులో బాలుడి మృతదేహం లభ్యమైంది. ఆక్సిజన్ అందక సాయివర్థన్ అనంతలోకాలకు వెళ్లిపోయాడు. అనంతరం బాలుడి మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం తాతతో కలసి పొలం వద్ద నుంచి ఇంటికి వెళ్తున్న మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు అప్పుడే వేసిన బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. బాలుడిని రక్షించేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేశారు. అధికారులు అన్ని ప్రయత్నాలు చేశారు. కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందన దీప్తి, రెవిన్యూ అధికారులు అంతా శ్రమించారు. దాదాపు 12 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినప్పటికీ చిన్నారిని కాపాడలేకపోయారు. 25 అడుగుల లోతులో బాలుడు ఉండొచ్చని భావించి, బోరు బావికి సమాంతరంగా గొయ్యి తవ్వి బాలుడిని బయటకు తీశారు. కానీ చిన్నారి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటనతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.సహాయక చర్యలు పూర్తయ్యేవరకూ ఆర్డీవో సాయిరాం సహా ఉన్నతాధికారులు అక్కడే వున్నారు. బోర్లు విఫలం అయితే వెంటనే పూడ్చివేయాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సూచించారు. అనుమతి లేకుండా బోర్లు వేసిన రిగ్గు యజమానిపై కేసు నమోదుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్లో ఘటన

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
3 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
4 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
4 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
8 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
9 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
7 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
10 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
10 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
5 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
12 hours ago
ఇంకా