పాతబస్తీలో కొత్త రాజకీయమా..? ఎంఐఎం పట్టు జారుతోందా..?
05-01-202005-01-2020 10:14:51 IST
2020-01-05T04:44:51.269Z05-01-2020 2020-01-05T04:44:24.799Z - - 22-04-2021

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ దద్దరిల్లింది. వేలాది మంది ముస్లింలు, ప్రజాస్వామ్యవాదులు స్వచ్చందంగా తరలివచ్చి మిలియన్ మార్చ్ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దంటూ నినదించారు. దేశ ప్రజల్లో విభజన తేవొద్దని కోరారు. ఈ నిరసనలో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా దేశమంతా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. కానీ, హైదరాబాద్‌లో మాత్రం అంత పెద్ద స్థాయిలో జరగలేదు. దీంతో పెద్ద ఎత్తున నిరసన జరపాలని ముస్లిం సంఘాలు నిర్ణయించాయి. 40 సంఘాలతో కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి. డిసెంబర్ చివరి వారంలో మిలియన్ మార్చ్ నిర్వహించాలనుకున్నా పోలీసుల అనుమతి రాలేదు. దీంతో హైకోర్టుకు వెళ్లి మరీ అనుమతి సాధించారు. కేవలం రెండు రోజుల సమయంలోనే మిలియన్ మార్చ్ నిర్వహించాలని తలపెట్టి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. హైకోర్టు కేవలం వెయ్యి మందితో మాత్రమే నిర్వహించాలని సూచించింది. పోలీసులు, ఆఖరికి నిర్వాహకుల అంచనాలకు కూడా అందకుండా జనాలు తరలివచ్చారు. స్వచ్చందంగా తరలివచ్చిన ప్రజలతో ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. పాతబస్తీ ప్రాంతంలో ముస్లింలు తమ దుకాణాలు, వ్యాపారాలు మూసేసీ స్వచ్చందంగా ట్యాంక్ బండ్‌కు తరలివచ్చారు. అయితే, ఈ ఆందోళనలో, జేఏసీలో ఎంఐఎం పార్టీ భాగస్వామిగా లేకపోవడం ఆశ్చర్యంగా మారింది. హైదరాబాద్ ముస్లింలకు కొన్ని దశాబ్దాలుగా ప్రతినిధిగా ఉంటోంది ఎంఐఎం పార్టీ. ముస్లింలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎంఐఎం పార్టీనే వారి తరపున మాట్లాడేది. కొట్లాడేది. కానీ, నిన్నటి భారీ మిలియన్ మార్చ్‌లో మాత్రం ఎంఐఎం పాత్ర లేదు. ఎంఐఎంకు సంబంధం లేకుండా వేలాది ముస్లింలు స్వచ్ఛందంగా ఏకమవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, ఈ కార్యక్రమంలో ఎంఐఎంను తీవ్రంగా వ్యతిరేకించే, ఎంఐఎంకు పాతబస్తీలో ప్రత్యర్థిగా ఉండే ఎంబీటీ నేత అమ్జదుల్లా ఖాన్ కీలకంగా వ్యవహరించారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే పాతబస్తీలో కొత్త రకమైన రాజకీయానికి తెరలేవనుందా అనే చర్చ మొదలైంది. ఇక, ఎంఐఎం ఆధ్వర్యంలోనూ మరో జేఏసీ ఏర్పడింది. ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టాలని ఎంఐఎం నిర్ణయించింది. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎంఐఎంకు ప్రతిష్టాత్మకంగా మారింది.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
6 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
9 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
13 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
13 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
13 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
11 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
a day ago

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా