newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

పాతికవేల మంది క్వారంటైన్ ముగిసింది. తగ్గుముఖంలో కేసులు.. మంత్రి ఈటెల

10-04-202010-04-2020 10:12:25 IST
Updated On 10-04-2020 10:40:13 ISTUpdated On 10-04-20202020-04-10T04:42:25.087Z10-04-2020 2020-04-10T04:42:22.289Z - 2020-04-10T05:10:13.342Z - 10-04-2020

పాతికవేల మంది క్వారంటైన్ ముగిసింది. తగ్గుముఖంలో కేసులు.. మంత్రి ఈటెల
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విదేశాలనుంచి తెలంగాణలో అడుగుపెట్టినవారిలో గురువారం నాటికి 26 వేలమంది తమ క్వారంటైన్ సమయాన్ని పూర్తి చేసుకున్నారని రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ కేసుల భయం కంటే నెగటివ్ ఫలితాలు ఎక్కువగా రావడం. విదేశాలనుంచి వచ్చినవారి గణనీయంగా పాజిటివ్ బారినుంచి తప్పించుకోవడం సంతోషకరమైన వార్తే కానీ ప్రభుత్వం మాత్రం చివరివరకు అప్రమత్తతతోనే మెలగాలని కృత నిశ్చయంతో ఉందని మంత్రి తెలిపారు. కేంద్రం ప్రకటించిన తేదీ నాటికి లాక్‌డౌన్‌ ఎత్తేస్తే సమస్యలు వస్తాయి కాబట్టి ఈ విషయంతో అత్యంత జాగరూకతతో అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కరోనా వైరస్‌కు చికిత్స పొందుతున్నవారు ఏప్రిల్ 24 నాటికి డిశ్చార్జి అవుతారని, ఇకపై కొత్త కేసులు తగ్గే అవకాశం కనిపిస్తోందని మంత్రి సంతృప్తి ప్రకటించారు.

కరోనా వైరస్‌ రోజురోజుకూ నియంత్రణలోకి వస్తోంది. మున్ముందు కేసుల సంఖ్య తగ్గే అవకాశాలున్నాయి. నాలుగైదు రోజుల్లో సింగిల్‌ డిజిట్‌కు రావొచ్చని అంచనా. రాష్ట్రంలో హాట్‌స్పాట్లను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నాం. ఇప్పటికే లక్షలాది మందిని మన వైద్య బృందాలు కలిశాయి. విదేశీ ప్రయాణ చరిత్ర ఉన్నవారిని, మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిని గుర్తిస్తున్నాయిని ఈటెల తెలిపారు. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారు, వారి ద్వారా మొత్తం 50 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మిగిలినవి అంతా మర్కజ్‌కు సంబంధించినవే. దేశంలో మర్కజ్‌తో సంబంధమున్న కేసులే ఎక్కువగా ఉన్నాయి. మర్కజ్‌తో సంబంధమున్న వారందరినీ దాదాపు గుర్తించాం. ఇంకా కొన్నిచోట్ల వారితో సంబంధమున్న వారిని గుర్తించే పనిలో వైద్య, నిఘా బృందాలు నిమగ్నమయ్యాయన్నారు.

విదేశాల నుంచి వచ్చిన 25,931 మంది హోం క్వారంటైన్‌ గురువారంతో ముగిసిందని మంత్రి మంచివార్త చెప్పారు. క్వారంటైన  ముగిసిన వారంతా సాధారణ పౌరులుగా ఉండొచ్చు. ఇక మర్కజ్‌కు వెళ్లిన వారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారు 3,510 మంది ఉన్నారు. వారిలో కొందరికి పాజిటివ్‌ వచ్చి చికిత్స పొందుతున్నారు. మరికొందరి కరోనా పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికే 1,400 మందికి నెగెటివ్‌ వచ్చింది. చికిత్స పొందుతున్నవారు, ఫలితాలు రావాల్సిన వారు మినహా మిగిలిన వారందరినీ హోం క్వారంటైన్‌కు తరలిస్తున్నామని మంత్రి చెప్పారు. 

ప్రభుత్వ ఆధ్వర్యంలో క్వారంటైన్‌లో ఉండే వారు అత్యంత తక్కువ మందే. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిలో పేదలు, మధ్య తరగతి, ధనికులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అన్నీ కలిపి 7,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించాం. ప్రస్తుతం సర్కార్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న 167 క్వారంటైన్‌ సెంటర్లలో కొన్ని మినహా దాదాపు అన్నీ ఎత్తేస్తున్నాం. మర్కజ్‌ సంబంధం ఉన్నవారిని హోం క్వారంటైన్‌లో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తాం. ఈ నెల 28 నాటికి వారందరి హోం క్వారంటైన్‌ పూర్తవుతుంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు ఈ నెల 23 నాటికి చికిత్స పూర్తయి ఇంటికి వెళ్లిపోతారు అని ఆరోగ్యమంత్రి ఆశాభావం వ్యక్తపరిచారు.

కరోనా నేపథ్యంలో వెయ్యి వెంటిలేటర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించాం. డాక్టర్లకు అవసరమైన కిట్లకు కొరతలేదు. ఇంకా 5 లక్షల ఎన్‌–95 మాస్క్‌లు, మరో 5 లక్షల పీపీఈ కిట్లు, 5 లక్షల గ్లౌజులు, కోటి సాధారణ మాస్కులు కొనుగోలు చేస్తున్నాం. డాక్టర్లకు షిఫ్టుల వారీగా డ్యూటీలు వేస్తాం. ఒక బ్యాచ్‌ 15 రోజులు, మరో బ్యాచ్‌ 15 రోజులు పనిచేసేలా కసరత్తు చేస్తున్నాం. సీఎం చెప్పినట్లుగా 25 వేల మంది డాక్టర్లను పూల్‌ చేసి ఉంచాం. అవసరమైతే వారి సేవలను ఉపయోగించుకునేలా సిద్ధంగా ఉన్నాం. తాత్కాలిక పద్ధతిన పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చాం. ఇంకా భర్తీ ప్రక్రియ చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు. 

ఇప్పుడు మనం కరోనాపై యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధంలో సైనికులు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందే. వారికి భరోసా ఇవ్వడానికే నేను ముందున్నాను. నేను కనీసం మాస్క్‌ కూడా పెట్టుకోవడం లేదు. నెల రోజుల నుంచి రోజూ రాత్రి బాగా ఆలస్యంగా ఇంటికి వెళ్తున్నాను. ఉదయం 9 గంటల నుంచే సమావేశాలు, ఫోన్‌లో ఫాలోఅప్‌లు చేస్తున్నాం. ఆశ కార్యకర్తల నుంచి పై స్థాయి వరకు వైద్య ఆరోగ్య శాఖలో 80 వేల మంది కరోనాపై యుద్ధం చేస్తున్నారు అని ఆరోగ్యమంత్రి తన శాఖ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పరస్పర సహకారంతో లాక్‌డౌన్‌ విజయవంతంగా నడుస్తోందని, అలాగైతేనే కరోనాపై విజయం సాధిస్తామన్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, అధిక జనాభా ఉన్న మన దేశంలో వైరస్‌ విజృంభిస్తే శవాల గుట్టలే చూడాల్సి వస్తుంది. ఇప్పటివరకైతే మూడో దశలోకి కరోనా చేరుకోలేదు. జనసమూహంలోకి వెళ్లలేదు కాబట్టి మనం ఇబ్బందుల్లో లేనట్లే అని మంత్రి ఆశాభావం ప్రకటించారు. ఇప్పుడిప్పుడే వైరస్‌ బాధితులను గుర్తించడం, వారికి చికిత్స చేయడం, మరికొందరిని క్వారంటైన్‌లో ఉంచడం వల్ల పరిస్థితి నియంత్రణలోకి వస్తోంది. పరిస్థితి పూర్తి నియంత్రణలోకి రాకుండా లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ సాధారణ స్థితి మొదలై వైరస్‌ విజృంభిస్తుంది. వివిధ రాష్ట్రాల మధ్య రాకపోకలు పెరుగుతాయి. జనం గుమిగూడుతారు. అయితే కేంద్రం ఏం చెబుతుందో పరిశీలిస్తాం. వారు కొనసాగిస్తే మంచిదే. లేకుంటే ఏం చేయాలన్న దానిపై సీఎం నిర్ణయం తీసుకుంటారు అని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

 

 

 

 

 

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   2 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   7 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   10 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   10 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   10 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   12 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   13 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   13 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   13 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle