newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పాతబస్తీకి ఈ దరిద్రం ఏమిటి అధ్యక్షా.. అక్బరుద్ధీన్ ఒవైసీ ఆవేదన

17-09-202017-09-2020 17:16:32 IST
2020-09-17T11:46:32.581Z17-09-2020 2020-09-17T11:46:30.825Z - - 15-04-2021

పాతబస్తీకి ఈ దరిద్రం ఏమిటి అధ్యక్షా.. అక్బరుద్ధీన్ ఒవైసీ ఆవేదన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేవలం 20 ఏళ్లలో హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఎంతగానో పురోగమించి భారతదేశ న్యూయార్క్ నగరంగా గుర్తింపు పొందింది కానీ 400 సంవత్సరాల చరిత్ర ఉన్న పాత నగరానికి ఈ దుస్థితి ఏమిటి అని మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతూ అద్భుతంగా పురోగమిస్తోందని, అదేసమయంలో పాతబస్తీపై కూడా ప్రభుత్వం దృష్టి సారిం చాల్సి ఉందని, పాత నగరానికి ఐటీ సెంటర్‌ రావాలని ఆయన డిమాండ్‌ చేశారు. హైదరాబాద్, ఇతర మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనపై బుధవారం సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. పాతబస్తీ అభివృద్ధికి రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని కోరారు.

పలు దఫాలుగా చెప్పినట్టుగా సీఎం హామీల అమలు కోసం తామంతా ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సురేశ్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రం స్పీకర్‌గా ఉండగా, చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టు ప్రారంభమైందని, కానీ ఇప్పటికీ పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాతనగరంలోని అద్భుత నిర్మాణా లు దెబ్బతింటున్నాయని, వాటిని పరిరక్షించే చర్యలు మాత్రం లేవన్నారు. ముర్గీ చౌక్‌ సమీపంలో అతిపురాతన భవనం కూలేందుకు సిద్ధంగా ఉన్నా హెరిటేజ్‌ పేరుతో దాన్ని తొలగించటం లేదని, దాన్ని కూల్చి అక్కడ మార్కెట్‌ భవనం నిర్మించాలని డిమాండ్‌ చేశారు. 

పాతనగరంలో పార్కింగ్‌ టవర్లను పూర్తి చేయాలని కోరారు. నవ యవ్వనంలో అసెంబ్లీలో అడుగుపెట్టిన నువ్వు జుట్టు నెరిసి వృద్ధుడివి అవుతున్నావు తప్ప పాతబస్తీ అభివృద్ధి చెందటం లేదని ప్రజలు తనను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు మెట్రో వచ్చిందంటే అది తన వల్లేనని, దీన్ని చాలెంజ్‌ చేసి చెప్తానని పేర్కొన్నారు. నా మాటల్లో తప్పుందని తేలితే రాజీనామాకు కూడా సిద్ధమన్నారు. పీజేఆర్‌ మోనో రైల్‌ కోసం, తాను మెట్రో కోసం పోటీ పడగా నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనను ఢిల్లీకి పంపి మెట్రో రైలు ప్రాజెక్టు పరిశీలించి రమ్మన్నారని, ఆ తర్వాతనే నగరానికి మెట్రో వచ్చిందని, కానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాతబస్తీకి మాత్రం మెట్రో యోగం లేదా అని ప్రశ్నించారు. 

కృష్ణా ఫేజ్‌–2 పాతనగరం కోసం ఏర్పాటైందని, కానీ కొత్త నగరంలో అమలవుతున్నట్టు పాతనగరానికి రోజువిడిచి రోజు నీళ్లు రావటం లేదన్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగినట్టుగానే, నీటి విషయంలో పాతబస్తీకి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. నాలుగు వేల ఎకరాల వైశాల్యంలో ఉన్న హుస్సేన్‌సాగర్‌ను ఇప్పుడు వేయి ఎకరాలకే పరిమితం చేశారని, లుంబినీపార్కు, నెక్లెస్‌రోడ్డు, ఫుడ్‌కోర్టులకు ఎవరు అనుమతిచ్చారని అక్బరుద్దీన్‌ ప్రశ్నించారు.

అన్ని రంగాల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ పొందే అర్హత ఉందని సీఎం కేసీఆర్ చాలాసార్లు చెప్పారు. కానీ మేం ముస్లింలకు బడ్జెట్‌లో 12 శాతం కేటాయించాలని డిమాండ్ చేయడంలేదు. బడ్జెటరీ కేటాయింపుల్లో కే్వలం 2 నుంచి 3 శాతమైన ముస్లింలకు కేటాయించమని కోరుతున్నామని అక్బరుద్ధీన్ ఒవైసీ చెప్పారు. 

తెలంగాణ ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికార భాష స్థాయిని కల్పించడం సంతోషకరమైన విషయమే కానీ భాషగా ఉర్దూకు న్యాయం చేకూరటం లేదని ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతవరకు ఉర్దూ అనువాదకులను మాత్రమే నియమించారు. కానీ సైన్ బోర్డులలో, బస్సులలో ఉర్దూ రాత కనిపించడం లేదు. ఉర్దూ భాష ఏ అధికార పత్రికలోనూ కనిపించడం లేదు అని ఒవైసీ విమర్శించారు.

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle