newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

పరీక్షలకు వెనుకాడం.. ఎవరికి పడితే వారికి చేయం: ఈటల రాజేందర్

29-04-202029-04-2020 10:34:53 IST
Updated On 29-04-2020 10:43:10 ISTUpdated On 29-04-20202020-04-29T05:04:53.636Z29-04-2020 2020-04-29T05:04:51.517Z - 2020-04-29T05:13:10.340Z - 29-04-2020

పరీక్షలకు వెనుకాడం.. ఎవరికి పడితే వారికి చేయం: ఈటల రాజేందర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ రోగుల సంఖ్య విషయంలో తమ ప్రభుత్వానికి దాపరికం ఏదీ లేదని, ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు వద్దని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆరు రోజులుగా తెలంగాణలో పాజిటివ్‌ కేసులు తగ్గడంతో సీఎం కేసీఆర్‌ శుభసూచకం అని చెబితే, దాన్ని జీర్ణించుకోలేని కొందరు రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని, పరీక్షలు చేయడం లేదని, సమాచారం ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారని మంత్రి ఈటల మండిపడ్డారు. ప్రజలు ఇబ్బందులు పడకూడదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకూడదు, టెస్టుల కోసం లైన్లు కట్టకూడదనే ఉద్దేశంతోనే ర్యాపిడ్‌ టెస్టులను వద్దన్నాం. అందుకే ప్రైవేటు ల్యాబు, ఆసుపత్రులకు టెస్టులు చేసేందుకు పర్మిషన్‌ ఇవ్వలేదు’ అని తెలిపారు. పైగా ఈ పరీక్షలను ఉచితంగా చేయాలని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఏ ఒక్క ప్రైవేటు ఆస్పత్రి అనుమతి కోసం రావడంలేదని ఈటల వివరించారు.

కరోనా మరణాలు, పాజిటివ్‌ కేసుల వివరాలను దాయడంలేదని, అలాంటి అవసరం కూడా లేదని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదని మంత్రి పేర్కొన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్ లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విలేకరులతో మాట్లాడారు. మే 8వ తేదీలోగా రాష్ట్రం పూర్తిగా కోలుకుంటుందని, మరణాలు లేకుండా కరోనా మహమ్మారి అంతమవుతుందని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. దేశంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతుంటే, తెలంగాణలో తగ్గుతున్నాయని తాజాగా కేంద్రం విడుదల చేసిన నివేదికలో వెల్లడించిందన్నారు.

అదేసమయంలో కరోనా పరీక్షలకు వెనుకాడేది లేదని, అలాగని ఎవరికి పడితే వారికి చేయమని మంత్రి స్పష్టం చేశారు. ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి లక్షణాలున్న వారికి మాత్రమే పరీక్షలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వివరించారు. ఐదు కేసులకంటే తక్కువ ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ చేయకూడదని ఐసీఎంఆర్‌ చెప్పిందని, ఇకపై అలాగే అనుసరిస్తామని పేర్కొన్నారు. జిల్లాల్లో కేసుల నమోదు తగ్గిందన్నారు. 14 రోజులుగా చాలా జిల్లాల్లో ఒక్క కేసూ లేదని వివరించారు. జీహెచ్‌ఎంసీలో 30 సర్కిళ్లు ఉంటే, 8 సర్కిళ్లలోనే 70% కేసులు నమోదయ్యాయన్నారు. 

ప్రస్తుతం రోజుకు 1,540 కరోనా పరీక్షలు చేసే శక్తి రాష్ట్రానికి ఉందని, మరో 3,500 నుంచి 5వేల పరీక్షలు చేసే యంత్రానికి ఆర్డర్‌ ఇచ్చి నట్టు ఈటల వెల్లడించారు. ఒకవేళ మళ్లీ కరోనా విజృంభించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో మంగళవారం ఆరు కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ‘అవన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే. దీంతో రాష్టంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1009కి చేరింది. ఇందులో ఇప్పటివరకు 25 మంది చనిపోయారు. తాజాగా 42 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా 374 మంది పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 610 పాజిటివ్‌ కేసులు ఉన్నాయని మంత్రి ఈటల తెలిపారు.

గత వారం రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతోంది. సింగిల్‌ డిజిట్‌కు పడిపోయింది. ప్రస్తుతం ఉన్న పాజిటివ్‌ కేసుల్లో 50 శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఆ తరువాత వికారాబాద్, గద్వాల, సూర్యాపేట జిల్లాల్లో ఉన్నాయి. నిజామాబాద్, వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లో కేసులున్నా కూడా వారంతా డిశార్జి అయ్యారు. ఒకట్రెండు కేసులున్న జిల్లాలను క్లస్టర్‌గా గుర్తించలేం. వాటిని సమీక్షించి 22 జిల్లాలను డేంజర్లో లేని జిల్లాలుగా నిర్ణయించామని  మంత్రి పేర్కొన్నారు. 

కరోనా కట్టడికి రాష్ట్రంలో చేపడుతున్న చర్యలపై కేంద్రం సంపూర్ణ విశ్వాసం ప్రకటించిందని ఆరోగ్య మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం గాంధీ, గచ్చిబౌలి, కింగ్‌కోఠి ఆస్పత్రులను పరిశీలించి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు బాగున్నాయని కితాబిచ్చిందని ఈటల తెలిపారు. రాష్ట్రంలో పరీక్షలు తక్కువేమీ చేయలేదన్నారు. దేశంలో 7.16 లక్షల పరీక్షలు చేస్తే, 4.1 శాతం పాజిటివ్‌ వచ్చాయని.. తెలంగాణలో 19,063 పరీక్షలకు 5.3 శాతం పాజిటివ్‌ వచ్చాయని వివరించారు. ఐసీఎంఆర్‌ తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పాజిటివ్‌ వచ్చిన వాళ్లని కూడా హోం క్వారంటైన్‌ చేయమని ఉందని.. అలా చేస్తే గాంధీ ఆస్పత్రిలో 10 మంది కూడా మిగలరని చెప్పారు

కరోనా కట్టడిలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఈటల వ్యాఖ్యానించారు. విదేశాల నుంచి వచ్చిన కొన్ని మినహా మిగిలిన కేసులన్నీ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవేనన్నారు. రూ.వేలకోట్ల ఆదాయం పోతున్నా అది పట్టించుకోకుండా ప్రజల ప్రాణాల కోసం పనిచేస్తున్నామని.. అది చూసి పొగడకపోయినా పర్వాలేదు కానీ విమర్శించడం విజ్ఞత కాదని పేర్కొన్నారు. కరోనా రోగుల సంఖ్య విషయంలో లెక్కలు తప్పు చూపిస్తే తమకు ఒరిగేదేమీ లేదని మంత్రి వివరించారు.

 

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   an hour ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   2 hours ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   2 hours ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   2 hours ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   3 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   3 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   3 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   4 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   4 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   17 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle