newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

పరిధి దాటిన మీడియా.. సుప్రీం ఆదేశాలు బుట్టదాఖలు

02-12-201902-12-2019 12:57:14 IST
2019-12-02T07:27:14.730Z02-12-2019 2019-12-02T07:26:49.049Z - - 21-02-2020

పరిధి దాటిన మీడియా.. సుప్రీం ఆదేశాలు బుట్టదాఖలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆడపిల్లల గౌరవాన్ని కాపాడటంలో వారి వృత్తి జీవితాన్ని గౌరవించడంలో, వారి ఉనికిని అంగీకరించడంలో మన సమాజం తన బాధ్యతలను ఎప్పుడో మర్చిపోయింది. కానీ 26 ఏళ్ల పశువైద్యురాలి దారుణ అత్యాచార, హత్యా ఘటనలో ప్రత్యేకించి ప్రాంతీయ మీడియా ప్రదర్శించిన దూకుడు వైఖరి అత్యాచార బాధితుల పట్ల సుప్రీంకోర్టు ప్రమాణాలను కూడా ధిక్కరించి తనలో సున్నితత్వం ఏమాత్రం లేదని ప్రపంచం ముందు ప్రదర్శించుకుంది.

శంషాబాద్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ హత్యోదంతం దేశవ్యాప్తంగా పౌర సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ బాధితురాలి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేయడమే కాకుండా ఘటనపట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

ప్రారంభంలో ఈ కేసు పూర్వాపరాలతో వ్యవహరించడంలో పోలీసులు వైఖరి తీవ్రంగా విమర్శలు చెలరేగినప్పటికీ సైబరాబాద్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు. ఇది నిజంగా అభినందించదగిన చర్యే. కానీ ప్రధాన జాతీయ స్రవంతి మీడియా కానీ, సోషల్ మీడియా కానీ ఈ మొత్తం ఘటనను చిత్రించిన తీరు అంతకుమించిన షాక్ కలిగిస్తోంది.

మీడియా ఈ ఘోర దుర్ఘటన గురించి నిరంతరం వార్తలను కవర్ చేస్తూ ప్రసారం చేయడంలో గణనీయమైన కృషి చేసింది. ఒకరకంగా చెప్పాలంటే మీడియా నుంచి వచ్చిన వత్తిడి వల్లే ప్రభుత్వం కానీ, పోలీసులు కాని అంత త్వరగా ఫలితాలు సాధించగలిగారు. 

అదే సమయంలో అత్యాచార బాధితుల పట్ల పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలను మీడియా మర్చిపోయంది. ఎక్కడైనా సరే అత్యాచారం, సంబంధిత హత్యా ఘటనలు జరిగినప్పుడు బాధితురాలి గుర్తింపును కానీ వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ బహిరంగ పర్చరాదనే నైతిక నియమావళిని మీడియా పూర్తిగా మర్చిపోయింది. 

2012లో నిర్భయ ఉదంతం తీసుకుంటే నెలల తరబడి విచారణ జరిగేంతవరకు ఆమె పేరును ఎక్కడా బయటపెట్టకుండా మీడియా జాగ్రత్తలు తీసుకుంది. బ్రిటన్‌కి చెందిన మీడియా ఒకటి ఆమె పేరును బయటపెట్టేంతవరకు ఆమె వివరాలు ఎవరికీ తెలియవు. జాతీయ మీడియా, ప్రాంతీయ మీడియా, సోషల్ మీడియా కూడా కట్టగట్టుకుని ఆమె అసలు పేరును వెల్లడి కాకుండా స్వీయ నియంత్రణను పూర్తిగా పాటించాయి.

గత సంవత్సరం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం, ప్రజాభిప్రాయాన్ని ప్రేరేపించేలా మీడియా అత్యాచార ఘటనలను, వాటిలో చిక్కుకుని బలైన వారి పేర్లను బయటపెట్టరాదని, మనోభావాలను ప్రభావితం చేయరాదని, ఈ సమస్యపై మీడియా అత్యంత సున్నితత్వాన్ని ప్రదర్శించాలని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది.

జస్టిస్ మదన్ బి. లోకుర్, జస్టిస్ దీపక్ కుప్తాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ అత్యాచార ఘటనలో బాధితులను, చనిపోయివారి పేరు, ఉనికిని ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించరాదని, అన్యాపదేశంగా కూడా వారి వివరాలను బయటపెట్టరాదని పేర్కొంది.

బాధితురాలి హక్కుల పరిరక్షణకోసం, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం కోసం ఇలాంటి ఘటనల గురించి ప్రచారం మొదలెట్టినప్పుడు వారి ఉనికి, గుర్తింపు వివరాలను ఎన్నడూ బయటపెట్టకూడదని అపెక్స్ కోర్టు తేల్చి చెప్పింది.

కానీ శంషాబాద్ అత్యాచార, హత్యా ఘటనలో మీడియా కవర్ చేసిన తీరును చూడండి. సంఘటన వెలుగులోకి వచ్చిన క్షణం నుంచి మన మీడియా ఆమె ఫోటోను, పేరును బయటపెట్టేసింది. ఆమె కుటుంబ వివరాలను, ఆమె చేస్తున్న ఉద్యోగ వివరాలను ఏమాత్రం పట్టింపు లేకుండా బయట పెట్టేసింది. 

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ ఉదంతాన్ని మరింత సంచలనాత్మకంగా మల్చడానికి ప్రింట్ మీడియా కానీ, ఎలెక్ట్రానికి మీడియా కానీ సోషల్ మీడియా కానీ గంగవెర్రులెత్తినట్లు పరుగెడుతూ బాధితురాలి పేరు, వివరాలను బయటపెట్టి ఆమె కుటుంబాన్ని తీవ్ర వేదనకు గురిచేశాయి.

మీడియాలోని కొన్ని వర్గాలు ప్రత్యేకించి జాతీయ మీడియాలో కొన్ని సెక్షన్లు మాత్రమే తొలి నుంచి బాధితురాలి పేరును కానీ, ఆమె కుటుంబాన్ని కానీ వెల్లడించకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాయి. కొన్ని జాతీయ వెబ్ సైట్లు అయితే బాధితురాలి పేరును మరుగున పెడుతూ కల్పిత పేరును ప్రచురించాయి. 

ఒకరకంగా చెప్పాలంటే బాధితురాలి బట్టలను మీడియా మరోసారి విప్పేసింది. పైగా వారి కుటుంబ గౌరవాన్ని కూడి బజారులోకి లాగేసింది. పైగా తాము తప్పు చేస్తున్నామనే సంకోచం ఏమాత్రం లేకుండా మీడియా కానీ జర్నలిస్టులు కానీ ఆమె పేరును నేటివరకూ బయట పెడుతూనే ఉన్నారు.

అంతకు మించిన ఘోరం ఏమిటంటే, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలుకుని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వరకు రాజకీయనేతలందరూ అదేదో తమ జన్మహక్కు అనే విధంగా శంషాబాద్ అత్యాచార బాధితురాలి పేరును తమ సంతాప సందేశాల్లో ట్విట్టర్ సాక్షిగా వెల్లడించేశారు. 

నిజంగా సమాజం మొత్తంగా పునరాలోచించుకోవలసిన సమయం ఇది. ఘోరమైన ఘటనలు జరిగినప్పుడు స్వీయ నియంత్రణ పాటించడంలో రాజకీయ నేతలు కానీ మీడియా కాని అత్యంత జాగ్రత్తతో, సున్నితత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అత్యాచారానికి గురై బలైన బాధితురాలి బట్టల్ని కోర్టు తీర్పును ధిక్కరించి మరీ వలిచేసే హక్కు మీడియాకు కానీ మరెవరికి కానీ ఎవరు ఇచ్చారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

బాధితురాలి పేరు మార్పు.. అందరూ పాటించాల్సిందే..

నగర శివార్లలో అత్యాచారం, హత్యకు గురైన వెటర్నరీ వైద్యురాలి పేరును మార్చినట్టు పోలీసులు తెలిపారు. ఇకపై బాధితురాలిని ‘జస్టిస్‌ ఫర్‌ దిశ’ పేరుతో పిలవాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సూచించారు. ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులను సజ్జనార్‌ ఒప్పించారు. సోషల్‌ మీడియా, ప్రసార మాధ్యమాల్లో బాధితురాలి పేరు వాడొద్దని కోరారు. జస్టిస్‌ ఫర్‌ దిశకు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా నిర్భయ, అభయ కేసుల్లో సైతం బాధితురాలి అసలు పేర్లను మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికారులు బాధితురాలి పేరును మార్చారు.

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   5 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   6 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   8 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   8 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   9 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   10 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   13 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   13 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   14 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle