newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పన్నుల్లో వాటా మా హక్కు.. బిచ్చం కాదు.. కేసీఆర్ ధ్వజం

13-03-202013-03-2020 11:25:26 IST
2020-03-13T05:55:26.646Z13-03-2020 2020-03-13T05:55:04.961Z - - 19-04-2021

పన్నుల్లో వాటా మా హక్కు.. బిచ్చం కాదు.. కేసీఆర్ ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రాల నుంచి పన్నువసూలు చేసే బాధ్యతను భారతరాజ్యాంగం కేంద్రప్రభుత్వంపై పెట్టిందని, ఆ ప్రకారం రాష్ట్రం వాటాగా ఆ పన్నులు కేంద్రం ఇవ్వాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. పన్నుల వాటాలో కేంద్రం మెహర్బాణీ ఏమీ లేదని, ఎన్డీయే ప్రభుత్వం ఏ ఒక్క ఏడాది కూడా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.10వేల కోట్లకు మించి ఇవ్వలేదన్నారు. దానికే తామేదో చేసేస్తున్నట్లు బాజా కొట్టుకుంటున్నారని, బాజాలో బీజేపీ.. కాంగ్రెస్‌ తాత అయిందని పేర్కొన్నారు. ‘కిత్‌నే ఆయా బోలో... కిసీ కా బాప్‌కా హై,  దేశాన్ని సాకే మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. మిగిలినవన్నీ అడుక్కుతినే రాష్ట్రాలే. మనం రూ.50 వేల కోట్లు ఇస్తే వాళ్లు రూ.24 వేల కోట్లు కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికయినా బీజేపీ నీచబుద్ధి మానుకోవాలి’అని సీఎం కేసీఆర్‌ సూచించారు. 

సీఎస్టీ పేరుతో యూపీయే ప్రభుత్వం రాష్ట్రాల పన్నులను మింగేస్తే జీఎస్టీ పేరుతో ఎన్డీయే సర్కార్‌ మింగేస్తోందని, ఆ జీఎస్టీకే దిక్కులేదని వ్యాఖ్యానించారు. కేంద్రం వాటా కింద ఇచ్చే పన్నులపై ఆధారపడి ఉద్యోగస్తులకు ప్రతి నెలా మొదటి తారీఖు కల్లా జీతాలిస్తామని, కానీ ఇప్పుడున్న కేంద్రం ఇవ్వడం లేదని, రూ.3,910 కోట్లకు ఇప్పటివరకు దిక్కులేదన్నారు. ఇవ్వాల్సింది ఇవ్వకపోగా మన నెత్తిమీద మన చెయ్యి పెట్టినట్లు రూ.1,410 కోట్లు అప్పు తెచ్చుకోవాలని కేంద్రం చెప్పిందని ఎద్దేవా చేశారు. 

దేశాన్ని నడిపే విషయంలో కాంగ్రెస్, బీజేపీ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయని తెలంగాణ సీఎం వ్యాఖ్యానించారు. ‘కేంద్రం ఏదో మేమిచ్చినం... మేమిచ్చినం అంటోంది. మీరెవరండీ ఇచ్చే దానికి నాకర్థం కాదు. నాకు తిక్కరేగి ఇప్పుడున్న కేంద్ర హోం మంత్రిని క్షమాపణ అడిగిన. నేను చెప్పింది తప్పయితే రాజీనామా చేస్తానని చెప్పిన. అయినా వీళ్లు ఇచ్చేది ఏంది రాజ్యాంగం మేరకు పన్నుల వాటా ఇవ్వాల్సిందే. దానికి పేరు మాత్రం సెంట్రల్‌ డివల్యూషన్‌ అని పెట్టారు. సెంట్రల్‌ డివల్యూషన్‌ లేదు... మన్ను లేదు. కొన్ని రకాల పన్నులను అన్ని రాష్ట్రాల నుంచి వసూలు చేసే బాధ్యత కేంద్రంపై రాజ్యాంగం పెట్టింది. ఆ ప్రకారం రాష్ట్రం వాటాగా ఆ పన్నులు ఇవ్వాల్సిందే. అదేమీ బిచ్చమెత్తుకునేది కాదు’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. 

బడ్జెట్‌లో పెట్టిన నిధులు ఖర్చుపై గురువారం సభలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. బడ్జెట్‌పై ప్రభుత్వ సమాధానంలో భాగంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కేంద్రం ఏదో ఇస్తున్నామని చెబుతోందని, అది బిచ్చమెత్తుకునేది కాదని, రాజ్యాంగం ప్రకారం రావాల్సిన వాటా అంటూ ‘కిసీకా బాప్‌కా హై’అని వ్యాఖ్యానించారు. తర్వాత సీఎల్పీ నేత ముల్లు భట్టి విక్రమార్క మాట్లాడుదూ.. రైతుబంధు కింద రాష్ట్రంలోని రైతాంగానికి ఇచ్చే నిధులు ‘మీ జేబుల్లోంచి ఇచ్చారా.. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నుంచి తెచ్చారా’అని ఘాటుగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ చెప్పినట్టు ‘కిసీ కా జాగీర్‌ నహీ హై... కిసీకా బాప్‌కా నహీ హై’అని అన్నారు. 

దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అధికార సభ్యులు భట్టి వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేశారు. మీరు ఎస్సారెస్పీ కట్టామని చెబుతున్నారు.. ఆ నిధులు మీ ఇంట్లోంచి తెచ్చారా అని భట్టిని ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు. అనంతరం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజాధనం ఖర్చు విషయంలో భట్టి మాట్లాడిన మాటలు అసంబద్ధమన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు ద్వారా రాష్ట్ర రైతాంగానికి సాయం చేయాలన్న సోయి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సంపద పెంచాలి... పేదలకు పంచాలి.. అనేది తమ ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. మొత్తంమీద ప్రజాధనం మీద చర్చ పార్టీల మధ్య విమర్శలకు దారితీసింది.  

కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలకు పోయినట్లేనని సీఎం కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. 50–60 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిందని, యూపీఏ ప్రభుత్వంపై విసుగెత్తి వీళ్లేదో ఉద్ధరిస్తారని ప్రజలు గెలిపిస్తే చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇది ఒక దేశమని, ఎవడబ్బ సొత్తు కాదనే విషయాన్ని బీజేపీ నేతలు గ్రహించాలన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు రాజాసింగ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సమాధానమిస్తున్న సందర్భంలో సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకుని మాట్లాడుతూ రాష్ట్ర వాటాను అందించే విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తూర్పారపట్టారు.

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   an hour ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   29 minutes ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   5 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   6 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   2 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   9 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   9 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   an hour ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   3 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle