newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పన్నులు బాదేయండి.. కానీ ఆదాయం పెంచండి.. కేసీఆర్ హుకుం

29-02-202029-02-2020 12:09:02 IST
2020-02-29T06:39:02.317Z29-02-2020 2020-02-29T06:38:59.227Z - - 19-04-2021

పన్నులు బాదేయండి.. కానీ ఆదాయం పెంచండి.. కేసీఆర్ హుకుం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్థికమాంద్యం దేశాన్ని పట్టుకుని వదిలే సూచనలు కనపడకపోవడంతో ఈ ఏడు, వచ్చే ఏడాది కూడా ప్రభుత్వాల రాబడులు పెరిగే అవకాశ కనుచూపుమేరలో కనిపించడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ అంచనాలను తగ్గించివేయటమే కాకుండా రాష్ట్రాలకు చెందాల్సిన ఆదాయ పంపిణీని కూడా కుదించివేసింది. నీటిపారుదలకు, సాగునీటికి భారీ ప్రాజెక్టులు తలపెట్టిన తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరై, ఆదాయ అన్వేషణ మార్గాలను వెతుక్కునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వచ్చే ఏడాది రాబడులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయనే అంచనాల నేపథ్యంలో వాస్తవిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్న తెలంగాణ  సీఎం కేసీఆర్‌... బడ్జెట్‌ ప్రతిపాదనలకు తగినట్లు నిధులు రాబట్టుకోవడంపై దృష్టి పెట్టారు. బడ్జెట్‌ తయారీ సన్నాహక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సలహాదారు జీఆర్‌ రెడ్డి తదితరులతో బడ్జెట్‌ రూపకల్పనపై నిర్వహిస్తున్న సమావేశాల్లో ఆయన ఈ మేరకు చర్చిస్తున్నారు. 

బడ్జెట్‌ నిర్వహణకు అడ్డంకులు కలగకుండా ఉండేందుకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఆస్తి పన్ను పెంపు అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను పెంచడం ద్వారా స్థానిక సంస్థలకు సర్దుబాటు చేయాల్సిన నిధుల్లో వెసులుబాటు వస్తుందనే చర్చ జరిగింది. గ్రామ పంచాయతీల విషయానికి వస్తే రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, నారాయణపేట, మంచిర్యాల లాంటి జిల్లాలు మినహా మిగిలిన చోట్ల ఇంటి పన్ను నామమాత్రంగానే వసూలవుతోందని, ఈ పన్నును సజావుగా రాబట్టుకోవడం ద్వారా ఏటా రూ.200 కోట్ల వరకు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. అలాగే గ్రామాలు, పట్టణాల్లో ఆస్తిపన్ను ప్రతి పాదనను సీఎం తోసిపుచ్చలేదని కూడా సమాచారం. 

ఇక విద్యుత్‌ టారిఫ్‌ పెంపు అంశాన్నీ కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాధారణ కేటగిరీలో ఉండే ప్రజలకు భారం పడకుండా విద్యుత్‌ చార్జీలను పెంచుకోవడం ద్వారా డిస్కంలకు చెల్లించాల్సిన మొత్తం నుంచి ప్రభుత్వానికి ఊరట కలుగుతుందని, విద్యుత్‌ సబ్సిడీల రూపంలో ఇస్తున్న దాంట్లో దాదాపు రూ. 2 వేల కోట్ల భారం తగ్గించుకోవచ్చనే భావనతో త్వరలోనే చార్జీల పెంపునకు సీఎం కేసీఆర్‌ పచ్చజెండా ఊపనున్నట్లు తెలుస్తోంది. మిషన్‌ భగీరథ, ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించిన విద్యుత్‌ చార్జీల పెంపును ఈ సమావేశంలో సీఎం వ్యతిరేకించినట్లు సమాచారం. కమర్షియల్, పరిశ్రమల కేటగిరీల వినియోగదారులపై చార్జీల పెంపు భారం గతంలో కంటే అధికంగా పడే అవకాశం ఉందని సమాచారం. గృహ వినియోగదారులపై కూడా చార్జీల పెంపు భారం వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.   

పోతే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలోని భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను సవరించలేదు. రెండేళ్లకోసారి సవరించాల్సిన ఈ ధరలు ఆరేళ్లయినా మార్చలేదు. దీంతో ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ. వేల కోట్లలోనే ఆదాయం కోల్పోతోంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతోపాటు భూముల విషయంలో ప్రజల అభిప్రాయం కూడా రిజిస్ట్రేషన్‌ విలువల సవరణకు అనుకూలంగానే ఉంటుందనే చర్చ ఈ సమావేశంలో జరిగింది. దీంతో ఈ ఏడాది భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను సవరించాలని తద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా నెలవారీ వచ్చే అదనపు ఆదాయంతో నెలవారీగా వచ్చే ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. 

దీంతోపాటు గతేడాది ప్రతిపాదించిన విధంగానే మరోమారు భూముల అమ్మకాలను కూడా ప్రతిపాదించాలనే దానిపైనా ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చర్చించారు. భూముల అమ్మకాల ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 10–12 వేల కోట్ల వరకు ఆదాయాన్ని రిజర్వు చేసుకోవాలని, మిగిలిన మార్గాల్లో కలిపి మొత్తం రూ. 20 వేల కోట్లను అదనంగా అందుబాటులో ఉంచుకొనే విధంగా ముందుకెళ్లాలని ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle