newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

పద్నాలుగేళ్ల తరువాత..!!

19-09-201919-09-2019 16:39:02 IST
Updated On 19-09-2019 18:11:46 ISTUpdated On 19-09-20192019-09-19T11:09:02.755Z19-09-2019 2019-09-19T11:05:12.716Z - 2019-09-19T12:41:46.564Z - 19-09-2019

పద్నాలుగేళ్ల   తరువాత..!!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకరంటేఒకరికి పడదు.. ఒకరిపేరు చెబితే మరొకరు ఒంటికాలుపై లేస్తారు.. అలాంటి వ్యక్తులు భేటీ అయ్యారు.. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.. 14ఏళ్ల తరువాత వీరు భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వారెవరో కాదు.. తెలంగాణ శాసనసభ్యులు 'తన్నీరు హరీష్‌రావు, జగ్గారెడ్డి'. వీరిద్దిరూ ఎప్పుడూ ఉప్పునిప్పులానే ఉంటారు.

హరీష్‌రావు కేసీఆర్‌ కేబినెట్‌లో ఆర్థిక మంత్రి హోదాలో ఉన్నాడు. జగ్గారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆర్థికమంత్రి హోదాలో ఉన్న హరీష్‌ వద్దకు జగ్గారెడ్డి వెళ్లి భేటీ అయ్యారు. అర్థగంటపాటు వీరిమధ్య బేటీ సాగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలపై హరీష్‌రావు దృష్టికి జగ్గారెడ్డి తీసుకెళ్లినట్లు తెలిసింది. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని కోరినట్లు సమాచారం. 

జగ్గారెడ్డి వినతికి హరీష్‌రావు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హరీష్‌రావుతో జగ్గారెడ్డి భేటీ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేపింది. సుమారు 14 ఏళ్ల తర్వాత హరీశ్‌ రావుతో జగ్గారెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2018 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెల్లడయ్యాక.. కేసీఆర్‌ గురించి జగ్గారెడ్డి సానుకూలంగా మాట్లాడారు. కానీ హరీశ్‌ రావు విషయంలో మాత్రం ఆయన వైఖరిని మార్చుకోలేదు.

సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్‌ రావు సంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌కు తెలియకుండా హరీశ్‌ జలదోపిడీకి పాల్పడ్డాడని ఆరోపించారు. కేసీఆర్‌ వల్లే తాను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచానని 2019 ఫిబ్రవరిలో చెప్పిన జగ్గారెడ్డి.. హరీశ్‌ రావు కంటే కేటీఆర్‌ ఫెయిర్‌ క్యాండిడేట్‌ అన్నారు. 2008లో కేవీపీ ద్వారా కాంగ్రెస్‌లో చేరేందుకు హరీశ్‌ ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు.

బీజేపీలో తనను అణగదొక్కడానికి ప్రయత్నాలు జరిగితే.. కేసీఆర్‌ పిలిచి తనకు టికెట్‌ ఇచ్చారన్నారు. అంతేకాదు కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వస్తే.. చంద్రబాబు, జగన్‌తోపాటు కేసీఆర్‌ కూడా కూటమిలో చేరుతారన్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలను బట్టి ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడానికి సుముఖంగా ఉన్నారని.. కానీ హరీశ్‌ రావు అడ్డుకోవడంతోనే కుదరలేదని ప్రచారం జరిగింది. హరీశ్‌ అంటే గిట్టని జగ్గారెడ్డి.. ఇప్పుడు ఆయన్ను కలిసి మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle