newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

14-10-201914-10-2019 08:05:20 IST
Updated On 14-10-2019 12:20:37 ISTUpdated On 14-10-20192019-10-14T02:35:20.462Z14-10-2019 2019-10-14T02:34:16.761Z - 2019-10-14T06:50:37.682Z - 14-10-2019

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో పదో రోజుకు చేరింది ఆర్టీసీ కార్మికుల సమ్మె. కార్మికులు తమ నిరసనల్లో భాగంగా ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ జరగనుంది.

మరోవైపు ప్రభుత్వం కార్మికులకు షాకిచ్చింది. గతంలో ప్రకటించినట్టుగానే తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్ జారీచేసింది.తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తులు ఆహ్వానించింది.

ఇదిలా ఉంటే.. ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమ్మెకు మద్దతు కావాలని ఉద్యోగ జేఏసీని ఎన్నడూ కోరలేదని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. మద్దతు కావాలని అడగనప్పుడు తాము ఎలా స్పందిస్తామని ప్రశ్నించింది.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఏంటో ఉద్యోగ జేఏసీ దృష్టికి తీసుకొస్తే వాటిపై చర్చించిన తర్వాతే మద్దతుపై ప్రకటన చేయనున్నట్లు తేల్చి చెప్పింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆదివారం ఉద్యోగ జేఏసీ నేతలు టీఎన్జీవో భవన్‌లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. 

కొందరు పనిగట్టుకుని ఉద్యోగ జేఏసీని, టీఎన్జీవో, టీజీవోలను బదనాం చేస్తున్నారని, ఆర్టీసీ జేఏసీ మద్దతు కోసం ఇప్పటివరకు తమను సంప్రదించలేదన్నారు ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ కె.రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ వి.మమత.

ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ తమను ఆహ్వానించారని, భోజన సమయం కావడంతో అందులో తాము పాల్గొన్నామని రవీందర్‌రెడ్డి, మమత పేర్కొన్నారు. దీనిపై తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకూ సమంజసం అన్నారు. 

ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిని టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాం ఖండించారు. ‘సమైక్యాంధ్రప్రదేశ్‌లోనే ఆర్టీసీ విభజన ప్రక్రియ మొదలైంది. జీఓలు జారీ చేసే సమయానికి రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైంది.

దీంతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ నిలిచింది’ అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హన్మకొండలో ఆర్టీసీ జేఏసీ వరంగల్‌ రీజియన్‌ కమిటీ ఆధ్వర్యం లో ఆదివారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఈ డిమాండ్‌ కొత్తగా వచ్చిందేమి కాదన్నారు. ఎట్లాగూ ఓట్లు వేసి గెలిపించారు.. ఇక తాను చెప్పినట్లే వినాలన్నట్లుగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మాహుతితో భగ్గుమన్నారు కార్మికులు. ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, సంతాప ర్యాలీలు నిర్వహించారు. ఇవాళ అన్ని డిపోల వద్ద సంతాప సభలు ఏర్పాటు చేశారు.

కొన్ని ప్రధాన డిపోల వద్ద జరిగే కార్యక్రమాల్లో ప్రతిపక్ష నేత లు పాల్గొననున్నారు. ఇప్పటికే బీజేపీ ప్రత్యక్షంగా ఆర్టీసీ ఆందోళనల్లో పాల్గొంటుండగా మిగతా పార్టీల నేతలు కూడా హజరయ్యేలా ఆర్టీసీ జేఏసీ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం మీద ఆర్టీసీ సమ్మె తెలంగాణలో హాట్ టాపిక్ అవుతోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle