newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

పదోతరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు.. నిమిషం నిబంధన ఎత్తివేత

18-03-202018-03-2020 13:18:17 IST
Updated On 18-03-2020 13:43:07 ISTUpdated On 18-03-20202020-03-18T07:48:17.264Z18-03-2020 2020-03-18T07:48:11.067Z - 2020-03-18T08:13:07.761Z - 18-03-2020

పదోతరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు.. నిమిషం నిబంధన ఎత్తివేత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎస్ఎస్సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షల్లో అత్యంత కీలకమైన ఒక నిమిషం నిబంధనను తొలగిస్తున్నట్టు ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 2,530 కేంద్రాల్లో 5.34 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారని ఆయన అన్నారు. నిమిషం నిబంధనను ఎత్తివేసినా, విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రానికి రావాల్సి వుంటుంది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వల్ల శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. విద్యార్ధినీ, విద్యార్ధులకు హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో వుంచారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటుచేశామని, తల్లిదండ్రులు భయపడాల్సింది లేదని అధికారులు తెలిపారు. మంచినీరుతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా సిద్దం చేశామని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తచర్యగా మాస్క్ లు ధరించినా అనుమతించనున్నారు. కరోనా బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలకు ఈ నెల 31 వరకూ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు యూనిఫాంలో రావొద్దు. పదో తరగతి విద్యార్థులు సాధారణ దుస్తుల్లో వస్తేనే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

పరీక్ష కేంద్రం ఎక్కడుందో ఒకరోజు ముందే వెళ్లి చూసుకోవడం మంచిది. ఉదయం 9గంటలకు తమకు కేటాయించినసీట్లో కూర్చోవాలి. అనంతరం ఓఎంఆర్‌ పత్రం కట్టిన ప్రధాన జవాబుపత్రం బుక్‌లెట్‌ ఇస్తారు. అది తమదేనని ధ్రువీకరించుకోవాలి. 9.30గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. 9.35 గంటల తర్వాత విద్యార్థులను లోపలికి అనుమతించరు. ప్రధాన జవాబుపత్రంపై ఉన్న సీరియల్‌ సంఖ్యను అదనపు జవాబుపత్రాలు, మ్యాప్‌, బిట్‌ పేపర్లపై తప్పనిసరిగా రాయాలి. నీలం లేదా నలుపు రంగు ఇంకుతో కూడిన కలాలనే వాడాలి. హాల్‌టికెట్‌తప్ప వేరే కాగితాలను వెంట తీసుకుపోకూడదు.

జవాబుపత్రాలు, బిట్‌, మ్యాప్‌, గ్రాఫ్‌ షీట్లసహా ఎక్కడా హాల్‌టికెట్‌సంఖ్య రాయరాదు. పరీక్ష సమయం ముగిసేవరకు బయటకు అనుమతించరు. అంతేకాదు తల్లిదండ్రులు తమ పిల్లల్ని పరీక్షలకు సిద్ధం చేయాలి. పిల్లలుగంట ముందు పరీక్ష కేంద్రాలవద్దకు హాజరయ్యేలా చూడాలి. కలాలు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేలు తదితరాలను తీసుకెళ్లేలా చూడాలి. పిల్లలు పరీక్ష హాలులో పక్క వారితో మాట్లాడవద్దని, చూచిరాతకు పాల్పడవద్దని హెచ్చరించాలి. ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని ‘న్యూస్ స్టింగ్’ విద్యార్ధినీ విద్యార్ధులకు ఆల్ ది బెస్ట్ చెబుతోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle