newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

13-11-201913-11-2019 15:21:53 IST
Updated On 13-11-2019 15:21:48 ISTUpdated On 13-11-20192019-11-13T09:51:53.231Z13-11-2019 2019-11-13T09:51:33.879Z - 2019-11-13T09:51:48.620Z - 13-11-2019

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మంత్రి ప‌ద‌వి చేప‌ట్టి పున‌ర్వైభ‌వం సంపాదిస్తున్న స‌బిత ఇంద్రారెడ్డికి స్వంత పార్టీలోనే స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి కుటుంబానికి, స‌బిత ఇంద్రారెడ్డికి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంది. కాగా, స‌బిత ఇంద్రారెడ్డికి మ‌హేంద‌ర్ రెడ్డి వ‌రుస‌కు అల్లుడు కావ‌డం గ‌మ‌నార్హం. వీరిద్ద‌రి మ‌ధ్య కోల్డ్ వార్‌తో వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలింది.

గ‌త ఐదేళ్లు మంత్రిగా ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో చ‌క్రం తిప్పారు. ఆయ‌న భార్య సునీతారెడ్డి జిల్లా ప‌రిష‌త్ ఛైర్‌ప‌ర్స‌న్‌గా, ఆయ‌న త‌మ్ముడు న‌రేంద‌ర్ రెడ్డి ఎమ్మెల్సీ ఉండ‌టంతో ప‌ట్నం కుటుంబం చెప్పిందే వేదం అన్న‌ట్లుగా జిల్లా పార్టీ న‌డిచింది.

కానీ, ఎన్నిక‌ల త‌ర్వాత సీన్ మారిపోయింది. మ‌హేంద‌ర్ రెడ్డి ఓడిపోవ‌డంతో మంత్రి కాలేక‌పోయారు. అయినా, ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కింది. మ‌హేంద‌ర్‌రెడ్డి స‌తీమ‌ణి మ‌ళ్లీ జిల్లా ప‌రిష‌త్ ఛైర్‌ప‌ర్స‌న్ అయ్యారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేర‌డంతో ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి హ‌వాకు బ్రేకులు ప‌డ్డాయి.

మ‌హేంద‌ర్‌రెడ్డిపై తాండూరులో గెలిచిన పైల‌ట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్‌లోకి రావ‌డంతో తాండూరులో వ‌ర్గ విభేదాలు మొద‌ల‌య్యాయి. ప‌ద‌వుల పంప‌కంలో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య గొడ‌వ న‌డుస్తోంది.

ఇంత‌లో మంత్రివ‌ర్గ విస్త‌రణ జ‌ర‌గ‌డం, స‌బిత ఇంద్రారెడ్డికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంతో ప‌ట్నం కుటుంబానికి చెక్ ప‌డింది. ద‌గ్గ‌రి బంధువులే అయినా ప‌ట్నం కుటుంబస‌భ్యులు మంత్రి సబిత‌ను కనీసం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి అభినందించ‌లేదు.

ఇక‌, మంత్రి ప‌ర్య‌ట‌న‌ల‌కు మ‌హేంద‌ర్ రెడ్డి దంప‌తులు దూరంగా ఉంటున్నారు. ఇద్ద‌రూ జిల్లాలో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు ప్రోటోకాల్ ప్ర‌కారం ఆహ్వానాలు అందుకున్నా స‌బిత వ‌స్తే దూరంగా ఉంటున్నారు.

తాండూరులో రోహిత్ రెడ్డి వైఖ‌రి వ‌ల్ల అనేక సంవ‌త్స‌రాలుగా పార్టీ కోసం ప‌నిచేస్తున్న కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని ప‌ట్నం కుటుంబం ఆరోపిస్తోంది. ఈ మేర‌కు అధిష్టానానికి సైతం సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు.

స‌బిత వ‌ర్గంగా రోహిత్ రెడ్డి కొన‌సాగుతున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ముందు వికారాబాద్ జిల్లా పార్టీ రెండుగా చీలడంతో టీఆర్ఎస్ అధిష్ఠానం అప్ర‌మ‌త్త‌మైంది.

ఈ విష‌య‌మై మంత్రి కేటీఆర్ సీరియ‌స్ అయ్యార‌ని, జిల్లా నేత‌ల‌ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నార‌ని తెలుస్తోంది. ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి ప‌ట్ల కేటీఆర్ అసంతృప్తిగా ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప‌ట్నం కుటుంబానికి అనేక ప‌దవులు ఇచ్చినా ఇంకా వారు స‌బిత ఇంద్రారెడ్డితో విభేదాలు పెట్టుకోవ‌డం స‌రికాద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి, కేటీఆర్ జోక్యంతోనైనా అత్తా, అల్లుడి కోల్డ్ వార్‌కు ఎండ్ కార్డ్ ప‌డుతుందో లేదో చూడాలి.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   5 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   6 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   9 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   11 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   11 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   12 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle