పట్నం గోసతో రేవంత్ నయా ప్రచారం..
24-02-202024-02-2020 10:11:00 IST
Updated On 24-02-2020 10:52:23 ISTUpdated On 24-02-20202020-02-24T04:41:00.295Z24-02-2020 2020-02-24T04:40:50.585Z - 2020-02-24T05:22:23.787Z - 24-02-2020

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరాభవాల నుండి కోలుకోలేకపోతుంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన టీఆర్ఎస్ పార్టీ విజయ పరంపర నిన్నటి మున్సిపల్ ఎన్నికల వరకు కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రత్యర్థి పార్టీలకు కోలుకోవడానికి కొంత సమయం పట్టడం ఖాయం. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఉండే గ్రూపు తగాదాలు కూడా ఆ పార్టీ పూర్వవైభవానికి అడ్డంకిగా మారిందన్నది రాజకీయలు తెలిసినవారి భావన. అయితే, కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పటికీ ముగ్గురు, నలుగురు నేతలు ఇంకా ఇంకా పోరాడుతూనే ఉన్నారు. మొన్న మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆ నలుగురు నేతలు తమ తమ అభ్యర్థుల గెలుపుకి తీవ్రంగా కృషి చేసి కొంతవరకు సక్సెస్ అయ్యారు కూడా. వారిలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఒకరు. ఇక రేవంత్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కాగా, రాష్ట్రంలో దాదాపు ఎన్నికలన్నీ పూర్తయ్యాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు మాత్రమే మిగిలిఉన్నాయి. ఇందుకు టీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు కూడా మొదలుపెట్టింది. ప్రతి ఎన్నికలకు ముందు ఏదో ఒక కార్యక్రమంతో అధికారులను, నేతలను ప్రజల మధ్యకు పంపే సీఎం కేసీఆర్ ఈ ఎన్నికలకు పట్టణ ప్రగతి అంటూ మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం ఆదివారం నుండి ప్రభుత్వం మొదలుపెట్టగా నగరంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు బస్తీ బాట పట్టారు. అయితే, ఇందుకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన రేవంత్ పట్నం గోస పేరుతో కాంగ్రెస్ పార్టీ త్వరలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ప్రజలను కేసీఆర్ మోసం చేసిన తీరును ఎండగట్టడమే ఈ పట్నం గోస ఉద్దేశ్యమని కూడా ప్రకటించారు. ప్రతి ఎన్నికలకు ముందు ఓ కార్యక్రమంతో కేసీఆర్ ప్రజలను పిచ్చోళ్ళని చేసి ఓట్లు ఎలా గుంజుకుంటున్నాడో చెప్పేందుకే తాను బస్తీలలో పాదయాత్రకి దిగనున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఆరేళ్ళుగా డబుల్ బెడ్రూమ్ అని ఆశచూపి గెలుస్తున్నారే తప్ప ఇల్లు మాత్రం నగరంలో ఒక్కటీ కట్టలేదన్నారు. అంతేకాదు, సీఎం కేసీఆర్ దృష్టిలో ఎర్రవల్లి, చింతమడక ప్రజలు మాత్రమే ప్రజలుగా కనిపిస్తున్నారా? ఆయన రాష్ట్రానికి సీఎంఆ లేక ఆ ఊళ్ళకి సర్పంచ్ లేక ఎంపీటీసీనా అని ప్రశ్నించారు. మొత్తంగా రేవంత్ తన మార్క్ తో ప్రజలలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఒకపక్క పీసీసీ పదవి ఎక్కడ తన్నుకు పోతారోనని గుర్రుగా ఉన్న సీనియర్లు రేవంత్ గోసకి ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
2 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
3 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
5 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
6 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
6 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
7 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
5 hours ago

నా రూటే సెపరేటు
9 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా