పట్టువిడవని తెలంగాణ సర్కార్.. అదుపు దిశగా వైరస్!
25-04-202025-04-2020 11:21:25 IST
Updated On 25-04-2020 11:35:43 ISTUpdated On 25-04-20202020-04-25T05:51:25.986Z25-04-2020 2020-04-25T05:51:06.869Z - 2020-04-25T06:05:43.093Z - 25-04-2020

దేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరాలలో మన హైదరాబాద్ నగరం కూడా ఒకటి. దాదాపు కోటి పదిలక్షల పాపులేషన్ గల ఈ మహా నగరంలో సామాజిక వ్యాప్తి ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టడం అంటే సాధారణ విషయం కానే కాదు. అది కూడా కరోనా లాంటి ముందెన్నడూ లేని మహమ్మారిని ఎదుర్కోవడం చాలా గొప్ప విషయం. అయితే మన తెలంగాణ సర్కార్ ఈ విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఒకపక్క కఠిన నిర్ణయాలను తీసుకుంటూనే మరోపక్క ఇందులో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ఆచితూచి వ్యవహరిస్తూ పరిష్కరిస్తుంది. ఫలితంగా వైరస్ ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది. తెలంగాణలో గత రెండు రోజులుగా ఇరవై లోపే పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అది కూడా హైదరాబాద్ తో పాటు సూర్యాపేట లాంటి రెడ్ జోన్లలోనే ఈ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 983 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా రిపోర్టులు ఉన్నా 663 మంది మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మిగతా కేసులలో కొందరు డిశ్చార్జ్ అయితే మరికొందరు మరణించారు. ఇక ఆదివారం నుండి చికిత్స తీసుకుంటున్న కేసులలో రోజుకు నలభై నుండి యాభై చొప్పున డిశార్జ్ కానున్నారు. మొత్తం మే 1కి కేవలం రెండు వందల మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉండనున్నారని అంచనా వేస్తున్నారు. తాజాగా వైద్యారోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఇకపై మరణాలు కూడా సంభవించకుండా ప్లాస్మా థెరఫీకి చికిత్సకు అనుమతులు పొందామని చెప్పారు. ఎవరైనా పరిస్థితి విషమించిన వారికి ఈ థెరపీ ద్వారా చికిత్స అందించనున్నారు. ఇక ఇప్పటికే ప్రకటించిన రెడ్ జోన్లలో లాక్ డౌన్ అమలును కఠినంగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా మే 7 వరకు కఠినంగా ఉండాలని నిర్ణయించుకుంది. రాష్ట్రంలో కేసులు సంఖ్య తగ్గుతున్నాయి కదా అని ఏ మాత్రం ఏమరుపాటు పనికిరాదని.. మరో పది రోజులు పాటు ఇదే విధంగా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆయా శాఖలను ఆదేశించింది. తొలి నుండి రాష్ట్రంలో అమలు చేస్తున్న కఠిన నిర్ణయాలే ఇప్పుడు వైరస్ తగ్గుముఖం పట్టేలా చేశాయని.. రానున్న రోజులు కూడా ఇదే విధంగా అమలు చేస్తేనే ఫలితం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజానికి ఈనెల తొలి రోజులకే వైరస్ నుండి రాష్ట్రానికి విముక్తి లభించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అయితే అనుకోకుండా ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనతో ఒక్కసారిగా ప్రభుత్వం అంచనాలు తల్లక్రిందులయ్యాయి. అయినా ప్రభుత్వం ఏ మాత్రం అదే పట్టు సడలకుండా ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. నిజానికి నిజ్జముద్దీన్ ఘటన తర్వాత ప్రభుత్వం మరింత చాకచక్యంగా వ్యహరించింది. ఢిల్లీ ఘటనలో అటు వైరస్ తో పాటు మతపరమైన సున్నితమైన అంశం కూడా మిళితమై ఉంది. ప్రతిపక్షాల నుండి కొన్ని ఒత్తిళ్లు కూడా వచ్చాయి. కానీ ప్రభుత్వం మాత్రం చాకచక్యంగా వ్యవహరిస్తూ వారందరినీ స్వచ్ఛందంగా వచ్చేలా ఎంఐఎం ద్వారా పావులు కదిపిందని చెప్తారు. మొత్తంగా ఆ సమస్యను అదుపులోకి తెచ్చుకుంది. ఇక మరోవైపు లాక్ డౌన్ అమలును ఇంతే పటిష్టంగా అమలుచేస్తూ అనుమానితుల క్వారంటైన్ కూడా 28 రోజులకు పెంచింది. ఇదే విధంగా మరో రెండు వారాలు ప్రభుత్వం పటిష్ట చర్యలను అమలు చేస్తే దాదాపుగా తెలంగాణలో కరోనా కట్టడి చేసినట్లే భావించవచ్చు.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
38 minutes ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
2 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
3 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
5 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
5 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
6 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
4 hours ago

నా రూటే సెపరేటు
8 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
21 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా