పచ్చని చెట్లకు ప్రమాదం... తెలంగాణలోనే ఎక్కువట
10-02-202010-02-2020 08:57:38 IST
2020-02-10T03:27:38.348Z10-02-2020 2020-02-10T03:27:23.185Z - - 16-04-2021

తెలంగాణకు హరితహారం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటుతున్నారు. అటవీ విస్తీర్ణం పెంచడానికి ఎన్నో చర్యలు చేపట్టింది. కానీ కొన్ని ప్రాంతాల్లోమాత్రం చెట్లను యథేచ్ఛగా నరికి వేస్తున్నారు. రోడ్ల విస్తరణకు చెట్లను నరికిపారేస్తున్నారు. పెద్దపెద్ద చెట్లను ఇతర ప్రాంతాలకు తరలించకుండా.. వాటిని రంపంతో కోసేస్తున్నారు. ఫలితంగా చెట్లు మోడులవుతున్నాయి, నగరజీవులకు నిలువ నీడలేకుండా పోతోంది.
దేశంలోనే చెట్ల నరికివేతలో తెలంగాణ ముందుందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. చెట్లను నరకాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 2016 నుంచి 2019 వరకూ తెలంగాణలో ఎన్ని చెట్లు నరికేశారో తెలుసా? ఏకంగా 12 లక్షల చెట్లను నరికి పారేశారు. దేశవ్యాప్తంగా ఈ రికార్డు వేరే రాష్ట్రానికి లేదు. కేంద్ర పర్యావరణ శాఖ చెబుతున్న అధికారిక లెక్కలివి. ఇవేవీ ఆషామాషీ కాదు. కేంద్రపర్యావరణం, అడవులు, క్లైమేట్ ఛేంజ్ శాఖ ఈ గణాంకాలను ఇటీవల విడుదల చేసింది.

తెలంగాణ అధికారులు ఏకంగా 12 లక్షల 12 వేల 753 చెట్లను నరికి వేసేందుకు అనుమతులు మంజూరు చేశారు. 2018-19లోనే ఏకంగా 5 లక్షల 22 వేలకు పైగా చెట్లకు చరమగీతం పాడారు. అవన్నీ మోడులుగా మారి కట్టెలయిపోయాయి. అటవీ సంరక్షణ చట్టం 1980 నియమ నిబంధనలకు ఇవి విరుద్ధం. ఇవి నమోదైన రికార్డులు మాత్రమే. ఇక చాటుమాటుగా అధికారుల కంట పడకుండా నరికేస్తున్న చెట్లు ఎన్నెన్నో.
లోక్ సభలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రీయో ఈ వివరాలు వెల్లడించారు. టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ అడిగిన ప్రశ్నకు షాకిచ్చే సమాధానం లభించింది. గత మూడేళ్ళుగా దేశవ్యాప్తంగా 77 లక్షలకు పైగా చెట్లను నరికేశారు. అందులో 7 లక్షల 87 వేల చెట్లను ఇతర ప్రాంతాలకు తరలించి వాటిని వివిధ పద్ధతుల్లో సంరక్షించారు. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో ఈ చెట్ల నరికివేత ఎక్కువగా ఉంది.
పర్యావరణ వాదులు సైతం ఈ లెక్కలకు విస్తుపోతున్నారు. హరితహారం పేరుకే గాపీ చెట్లకు మాత్రం మరణశాసనం లిఖిస్తున్నా నేతలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. చెట్లను నరికే వారికి భారీగా జరిమానాలు విధించాలి.
ఒక పెద్ద వృక్షాన్ని నేలకూలిస్తే సమీపంలో మొక్కలు నాటాలి. కానీ అది జరగడం లేదు. జాతీయ రహదారుల విస్తరణను అటవీ ప్రాంతంలో చేపట్టడం వల్ల చెట్ల నరికివేత ఎక్కువగా జరుగుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.
రియల్ ఎస్టేట్ భూమ్ వల్ల కూడా పర్యావరణం నాశనం అవుతోంది. చెట్ల నరికివేతను అడ్డుకోకపోతే పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. చెట్లపై నివాసం ఉండే పిచ్చుకలు, ఇతర పక్షుల జీవనం నాశనం అవుతుంది. సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పిచ్చుకల మనుగడ ప్రశ్నార్థఖం అవుతోంది.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
13 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
9 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
11 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
14 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
16 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
18 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
19 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
20 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
21 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
a day ago
ఇంకా