newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

పంచాయితీలకు కరెంట్ ఛార్జీల భారం

17-12-201917-12-2019 09:42:44 IST
Updated On 17-12-2019 16:38:12 ISTUpdated On 17-12-20192019-12-17T04:12:44.762Z17-12-2019 2019-12-17T04:12:39.120Z - 2019-12-17T11:08:12.937Z - 17-12-2019

పంచాయితీలకు కరెంట్ ఛార్జీల భారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ్రామపంచాయితీలకు నిధుల విడుదలలో కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తోంది. కానీ గ్రామపంచాయితీలపై కరెంట్ ఛార్జీలు భారంగా మారుతున్నాయి.  కేంద్రం నిధులు కరెంట్ బిల్లులు చెల్లించడానికి సరిపోవడం లేదు. దీంతో స్థానిక సంస్థలకు దిక్కుతోచడం లేదు, ఏళ్ల తరబడి చెల్లించని బిల్లుల చిట్టాను వెలికితీసిన విద్యుత్‌ సంస్థలు.. గ్రామాల వారీగా జాబితాను పంచాయతీరాజ్‌శాఖకు అందజేశాయి. ఇందులో ఒక్కో పంచాయతీకి సగటున రూ.లక్షల్లో బిల్లులు రావడం ఆందోళన కలిగిస్తున్నాయి.

ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామపంచాయితీలు, స్థానిక సంస్థలు  పాత బకాయిలు తప్పనిసరిగా చెల్లించాలని సీఎం కేసీఆర్‌ పేర్కొనడంతో పెండింగ్‌ బిల్లుల చెల్లింపు కోసం పీఆర్‌ శాఖ మల్లగుల్లాలు పడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 12,571 గ్రామ పంచాయతీలు వున్నాయి. వీటికి తోడు కొత్తగా ఏర్పడినవి మరికొన్ని. వీటికి సంబంధించి రూ.700 కోట్లకు పైగా విద్యుత్‌ బకాయిలున్నట్టు అంచనా. ఇంత భారీ మొత్తం విద్యుత్ ఛార్జీలు కట్టడం గ్రామపంచాయితీలకు భారంగానే చెబుతున్నారు,.

మొత్తం ఛార్జీల్లో  రూ.280 కోట్ల మేర సర్‌చార్జీలే ఉన్నాయి. వీటిని వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలించాలని ట్రాన్స్‌కోను పంచాయతీరాజ్‌ శాఖ అభ్యర్థించింది. వినియోగ చార్జీలను తగ్గించలేమని, బిల్లులు కట్టకపోవడంతో మోపిన అపరాధ రుసుం తగ్గించే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ భారం తగ్గినా కొంతలో కొంత వెసులుబాటు కలగనుంది. 

నిధుల కటకటతో కొట్టుమిట్టాడిన పంచాయతీలు.. పేరుకుపోయిన బిల్లులే కాదు.. నెలవారీ బిల్లులు కూడా చెల్లించకుండా వాయిదా వేస్తూ వచ్చా యి. దీంతో మొత్తం తడిసి మోపెడయ్యాయి. దీంతో బిల్లు చెల్లింపు తలకు మించిన భారం అయింది. వీధి దీపాలు, తాగునీటి అవసరాలకు స్థానిక సంస్థలు విద్యుత్‌ను వినియోగిస్తుంటాయి. వీటిని అత్యవసర సర్వీసులుగా గుర్తించినందున కరెంట్‌ సరఫరాను నిలిపివేయడం ట్రాన్స్‌కోకు కష్టంగా మారింది. 

విద్యుత్ శాఖ మనుగడ సాగించాలంటే.. ఖచ్చితంగా బిల్లులు చెల్లించాల్సిందే. గ్రామాల అభివృద్ధికి ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం రూ.339 కోట్లు విడుదల చేస్తోంది. ఈ నిధుల నుంచి కరెంట్‌ చార్జీలు చెల్లించాలని సూచిస్తూ అధికారులు ఆదేశాలు జారీచేశారు. పెండింగ్‌ కరెంట్‌ బిల్లులను స్థానిక పంచాయతీలు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో చిన్న పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle