newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

న‌ర్స‌న్న రివ‌ర్స్ అవుతున్నారే..!

03-12-201903-12-2019 07:50:00 IST
2019-12-03T02:20:00.315Z03-12-2019 2019-12-03T02:19:51.712Z - - 24-02-2020

న‌ర్స‌న్న రివ‌ర్స్ అవుతున్నారే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్ర స‌మితి స్థాపించిన నాటి నుంచి ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెన్నంటే న‌డిచిన వారిలో చాలా మంది ఇప్పుడు ఆయ‌న వెంట లేరు. అనేక మంది ఆయ‌న‌ను విభేదిస్తూ బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. కానీ, సీనియ‌ర్ నేత నాయిని న‌ర‌సింహారెడ్డి మాత్రం ఇంత‌కాలంగా కేసీఆర్‌తోనే న‌డుస్తున్నారు.

కేసీఆర్ కూడా ఆయ‌న‌కు ఎన‌లేని గౌర‌వం, ప్రాధాన్య‌త ఇస్తూ వ‌చ్చారు. కానీ, ఇటీవ‌ల కేసీఆర్‌, నాయిని న‌ర‌సింహారెడ్డి మ‌ధ్య దూరం పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

తాజాగా ఆయ‌న మాట్లాడిన మాట‌లు.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఖ‌రిని విభేదిస్తున్నట్లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఆర్టీసీలో యూనియ‌న్లు వ‌ద్ద‌నేది కేసీఆర్ స్ప‌ష్టంగా చెబుతున్నారు. అందుకే ఆయ‌న యూనియ‌న్ల‌తో సంబంధం లేకుండా ప్ర‌తి డిపో నుంచి ఐదుగురు ఆర్టీసీ కార్మికుల‌ను నేరుగా పిలిపించుకొని మాట్లాడారు.

యూనియ‌న్ కార్యాల‌యాల‌కు తాళాలు వేయిస్తున్నారు. రెండేళ్ల పాటు కార్మిక సంఘాల ఎన్నిక‌లు కూడా పెట్టేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. సింగ‌రేణి యూనియ‌న్ల ప‌ట్ల కూడా కేసీఆర్ క‌ఠినంగా ఉండ‌బోతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఓ వైపు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇంత‌లా యూనియ‌న్ల‌ను వ్య‌తిరేకిస్తుంటే నాయిని న‌ర‌సింహారెడ్డి మాత్రం యూనియ‌న్ల‌ను స‌మ‌ర్థిస్తున్నారు. తాజాగా జ‌రిగిన కార్మిక సంఘాల స‌మావేశంలో పాల్గొన్న నాయిని.. కార్మిక సంఘాల‌కు గుర్తింపు లేకుండా చేసేందుకు జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌పై గొంతెత్తాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు.

ఇంకా, కేసీఆర్ స‌ర్కార్‌పైనా ప‌రోక్షంగా నాయిని ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. ఇప్పుడు నాయిని వ్య‌వ‌హారం టీఆర్ఎస్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

నాయిని న‌ర‌సింహారెడ్డికి కార్మిక నేత‌గా గుర్తింపు ఉంది. మూడు ద‌శాబ్దాలుగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని అనేక ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆయ‌న కార్మిక సంఘాల అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు.

ఇప్ప‌టికీ హెచ్ఎంఎస్ అనే కార్మిక సంఘం నాయిని నాయ‌క‌త్వంలోనే న‌డుస్తోంది. స‌హ‌జంగానే కార్మిక ప‌క్ష‌పాతి అయిన ఆయ‌న‌కు గ‌త క్యాబినెట్‌లో హోంశాఖ‌తో పాటు కార్మిక శాఖ బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

కానీ, ఈ క్యాబినెట్‌లో నాయినిని మంత్రివ‌ర్గంలోకి తీసుకోలేదు. అంత‌కుముందు త‌న అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికి ముషిరాబాద్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించేందుకు ఆయ‌న తీవ్ర ప్ర‌య‌త్నం చేసినా ద‌క్క‌లేదు.

దీంతో అప్ప‌టి నుంచే టీఆర్ఎస్ అధిష్ఠానంపై నాయిని అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవ‌ల గులాబీ జెండాకు తాము ఓన‌ర్లం అంటూ ఈటెల రాజేంద‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు నాయిని గొంతు క‌లిపారు. కానీ, త‌ర్వాత కేటీఆర్ ఆయ‌న‌తో స‌మావేశం కావ‌డంతో నాయిని సైలెంట్ అయ్యారు.

ఇప్పుడు మ‌రోసారి నాయిని త‌న గొంతు విప్పారు. కేసీఆర్ ఆలోచ‌నా విధానాన్ని బాహాటంగానే వ్య‌తిరేకించారు. అయితే, కార్మిక నేత‌గా స‌హ‌జంగానే యూనియ‌న్ల‌కు అనుకూలంగా నాయిని మాట్లాడారా లేదా కేసీఆర్‌ను వ్య‌తిరేకించేందుకు సిద్ధ‌మ‌య్యే మాట్లాడారా అనేది చూడాల్సి ఉంది.

వ‌య‌స్సు మీద ప‌డినా టీఆర్ఎస్ బ‌లోపేతానికి, తెలంగాణ ఉద్య‌మంలో నాయిని కీల‌కంగా వ్య‌హ‌రించారు. మ‌రి, ఆయ‌నను కేసీఆర్ ఎలా బుజ్జ‌గిస్తారో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle