newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నో మాస్క్.. నో ఇన్య్సూరెన్స్.. నయా రూల్

24-06-202024-06-2020 10:40:52 IST
Updated On 24-06-2020 16:09:08 ISTUpdated On 24-06-20202020-06-24T05:10:52.422Z24-06-2020 2020-06-24T05:10:45.029Z - 2020-06-24T10:39:08.954Z - 24-06-2020

నో మాస్క్.. నో ఇన్య్సూరెన్స్.. నయా రూల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి వేగం, రోడ్ల దుస్థితి, వాహనదారుల నిర్లక్ష్యానికి అమాయకులు కూడా బలవుతున్నారు. దీంతో కేంద్రం కొత్త మార్గదర్శకాలను అమలులోకి తేవాలని నిర్ణయించింది. ఇకనుంచి మాస్క్ పెట్టుకుంటేనే బీమా వర్తింపచేయనుంది. అలాగే వెనుక ఉండే వారికీ మాస్క్ తప్పనిసరి చేస్తోంది. దేశంలో కోవిడ్‌ 19 మహమ్మారి విశృంఖుల విన్యాసం చేస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఇప్పటికే ఇది దేశంలో 4లక్షలు దాటేసింది. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రజల్లో చైతన్యం కనిపించడంలేదు. కేసుల పెరుగుదలకు మాస్కుల వినియోగానికి స్పష్టమైన సంబంధముందని చెబుతున్నా ప్రజలు వినడంలేదు. ముఖ్యంగా యువత మాస్కుల వినియోగంపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. నోరు, ముక్కుల ద్వారా వెలువడే నీటి తుంపర్లే ఈ వైరస్‌ వ్యాప్తికి కారణమని చెబుతున్నా పట్టించుకోవడంలేదు. 

మాస్కులు ధరించని పక్షంలో అపరాధ రుసుం వసూలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది కూడా ఏమాత్రం ఫలించకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నాయి. బైకులు, కార్లలో వెళ్తున్న యువకుల్ని నిలదీసి మాస్కుల కోసం ప్రశ్నిస్తే వాహనాల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేందుకైనా వారు వెనుకాడడంలేదు. దీంతో ప్రభుత్వం కొత్త యోచన చేస్తోంది. మాస్కులకు బీమాకు లింక్‌ పెడితే వర్కవుట్ అవుతుందని భావిస్తోంది.

ఏ వాహనం ఎటువంటి ప్రమాదానికి గురైనా వాహన చోదకుడు ప్రమాద సమయంలో మాస్కు ధరించి లేని పక్షంలో దానికి బీమా వర్తించకుండా నిబంధన విధించేందుకు సిద్దమౌతోంది. ప్రస్తుతం ప్రమాదాల సమయంలో బీమా వర్తింపునకు కొన్ని నియమ నిబంధనలున్నాయి. ప్రమాద సమయంలో వాహనం నడుపుతున్న వ్యక్తికి ఖచ్చితంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండితీరాలి. ద్విచక్ర వాహనమైతే హెల్మెట్‌ ధరించి ఉండాలి. కార్‌ అయితే సీట్‌ బెల్ట్‌ పెట్టుకునుండాలి. ఇవి లేనిపక్షంలో ప్రమాదం జరిగినా బీమా వర్తించదు. అలాగే ఇప్పుడు నోటికి మాస్కు లేకుండా వాహనాన్ని నడిపినా లేక వెనుకనున్న వ్యక్తులు మాస్కు ధరించకున్నా ఇకముందు బీమా వర్తించదు. 

దీనిపై చట్టబద్ధంగా వెళ్లేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది.అందులో భాగంగా బీమాకంపెనీలతో చర్చిస్తోంది. ఈ సంస్థలు కూడా ఇందుకు తమ అనుకూలత వ్యక్తం చేస్తున్నాయి. బీమా చెల్లింపు భారం తగ్గుతుందని ఇవి భావిస్తున్నాయి. కొద్దిరోజుల్లోనే ఇది చట్టరూపంలోకి రానుందని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. మాస్కు ధారణ పట్ల ప్రముఖుల చిత్రాలు వినియోగించి ప్రచారం చేస్తున్నారు. గతంలో విడుదలైన కెమెరామెన్‌ గంగతో రాంబాబు చిత్రంలో పవన్‌కళ్యాణ్‌ ప్రస్తుత రాజకీయాల పట్ల చైతన్యపర్చే సీన్‌లోని భాగాల్ని వినియోగించి డబ్బింగ్‌ మార్చి మాస్క్‌ వినియోగం పట్ల ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లుగా ఓ వీడియోను రూపొందించారు. 

సహజంగానే ఈ వీడియో చూసేందుకు యువతతో పాటు అన్నివర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. పవన్‌ నోటివెంట మాట కావడంతో దీన్ని ఆచరించేందుకు యువత సిద్దపడుతోంది. సోషల్‌ మీడియాను ఒక బృహత్తర కార్యక్రమం కోసం కొందరు వినియోగిస్తున్న తీరుని ప్రశంసిస్తున్నారు. 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   8 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   11 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   15 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle