newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నేనిప్పుడు తమిళిసై కాదు తెలుగుసైని... నవ్వించిన గవర్నర్

06-03-202006-03-2020 10:45:23 IST
2020-03-06T05:15:23.426Z06-03-2020 2020-03-06T05:15:20.727Z - - 16-04-2021

నేనిప్పుడు తమిళిసై కాదు తెలుగుసైని... నవ్వించిన గవర్నర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా వచ్చాక తాను తమిళసైగా కాకుండా తెలుగుసై లాగా మారిపోయాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై జోక్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు వంటింటినుంచి బయటకొచ్చి వివిధ రంగాల్లో బాగా కష్టపడుతున్నారని, అలా చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమానికి తాను తమిళిసై లాగా రాలేదని, తెలుగుసైలా వచ్చానని చెప్పి అందర్నీ నవ్వించారు. 

మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించరాదని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు జరిపించుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతల్లో తలమునకలై ఉండాల్సి రావడంతో మహి ళలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యోగా, వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. 

రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఏపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాతో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ వివిధ రంగాల్లో రాణించిన 21 మంది మహిళలను ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ఘనంగా సత్కరించి పురస్కారాలు అందజేశారు. 

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు తెలంగాణ మహిళా మంత్రులు సబితా ఇంద్రరెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత హాజరయ్యారు. అలాగే ఏపీ నుంచి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాతోపాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు హాజరయ్యారు. ముందుగా గవర్నర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.

పురస్కార విజేతలు వీరే 

పీవీ సింధు (క్రీడలు), డాక్టర్‌ జ్యోతి గౌడ్‌ (పరిశోధనలు), సంగారెడ్డి జిల్లా హుమ్నపూర్‌ వాసి బేగారి లక్ష్మమ్మ (వ్యవసాయంపై సినిమా రూపకల్పన), సిద్దిపేట జిల్లావాసి గొట్టే కనకవ్వ (జానపద గాయని), డాక్టర్‌ ఎస్‌వీ కామేశ్వరి(వైద్యురాలు), జగిత్యాల జిల్లా లంబాడిపల్లి వాసి మిల్కూరి గంగవ్వ (యూట్యూబ్‌స్టార్‌), జగిత్యాల జిల్లావాసి గుడేటి సరిత (క్రీడలు), ఆదిలాబాద్‌ జిల్లావాసి ఆత్రం సుశీల బాయి (సామాజిక చైతన్యం), రంగారెడ్డి జిల్లా వాసి తారాబాయి (స్వయం ఉపాధి), యోగిని అరుణా దేవి (యోగా గురు), రంగారెడ్డి జిల్లా వాసి మల్లారి (సాంప్రదాయ జాపపద కళాకారిణి), కొత్తగూడెం జిల్లావాసి రాజేశ్వరి (వైద్య సేవలు), నిఖత్‌ జరీన్‌ (క్రీడలు), దేవరకొండ వనజ(స్వచ్ఛంద సేవ), బూర రాజేశ్వరి(అక్షరాస్యత), తరుణి సంస్థ (మహిళల్లో ఆత్మస్థైర్యం పెంపొందించడం), సురేఖారెడ్డి (సమాజ సేవ), మహమ్మద్‌ సుమ (స్వచ్ఛంద సేవ), వనమాల రమ్యశ్రీ (క్రీడలు), సూరి జ్యోతి (స్వచ్ఛంద సేవలు) గవర్నర్‌ నుంచి పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు. 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle