newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నేతల ప్రాణాలు తీస్తున్న కరోనా...సీపీఎం నేత కూడా

28-08-202028-08-2020 08:19:34 IST
Updated On 28-08-2020 09:11:29 ISTUpdated On 28-08-20202020-08-28T02:49:34.452Z28-08-2020 2020-08-28T02:49:29.372Z - 2020-08-28T03:41:29.817Z - 28-08-2020

నేతల ప్రాణాలు తీస్తున్న కరోనా...సీపీఎం నేత కూడా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా కేసుల తీవ్రత భారీగా వుంది. దేశంలో ఒకేరోజు 75,760 కేసులొచ్చాయి.  ఈ నెలలో ఇప్పటివరకు 9 సార్లు 50 వేలకుపైగా, 17 సార్లు 60 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య 75 వేలను మించింది. ఈ నెలలో ఇప్పటివరకు రోజుకు సగటున 61,902 చొప్పున 16 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 56,013 మంది కోలుకున్నారు. 

1,023 మంది మరణించారు. ఇలా వరుసగా వెయ్యికిపైగా మరణాలు నమోదుకావడం ఇది రెండోరోజు. ఇటీవలి కాలంలో ఎన్నడూలేనంతగా యాక్టివ్‌ కేసులు 18,724మేర పెరిగాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, తెలంగాణ, కేరళ, హరియాణా, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఇదివరకు ఎన్నడూలేనంత గరిష్ఠ సంఖ్యలో కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. 

మరోవైపు కరోనా కారణంగా నేతలు మృత్యువాత పడుతూనే వున్నారు. తాజాగా సీపీఐ ఎంఎల్‌ కేంద్ర కమిటీ కార్యదర్శివర్గ సభ్యుడు డాక్టర్‌ పోలవరపు జశ్వంతరావు మరణించారు. ఆయన వయసు 73 ఏళ్ళు. ఆయన గురువారం హైదరాబాద్‌లో కరోనాతో మృతి చెందారు. 50 ఏళ్లకు పైగా విప్లవోద్యమ కార్యకలాపాలకే అంకితమయ్యారు.

పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న జనశక్తి, క్లాస్‌ స్ట్రగుల్‌ పత్రికలకు ఆయన సంపాదకునిగా ఉన్నారు.తొలుత  వైద్య శాస్త్రంలో పట్టా పొందిన జస్వంతరావు.. ఆర్థిక శాస్త్ర నిపుణుడిగా, మంచి వక్తగా, ఆర్థిక రాజకీయ విశ్లేషకునిగా పేరు తెచ్చుకున్నారు. కామ్రేడ్‌ తరిమెల నాగిరెడ్డి ఆశయసాధన కోసం విశేష కృషి చేశారు. ఆయనతో కలిసి వివిధ ఉద్యమాలలో పాల్గొన్నారు. ఆయన మృతి విప్లవోద్యమానికి తీరని లోటని సీపీఐ ఎంఎల్‌ రాష్ట్ర కమిటీ తరఫున ఎస్‌.ఝాన్సీ ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. పలువురు వామపక్షనేతలు జశ్వంతరావుతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

కరోనా కారణంగా ఏపీలో బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు, యూపీలో మంత్రులు చేతన్ చౌహాన్, కమల్ రాణిదేవి, మాజీ మంత్రి ఒకరు కరోనాతో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. అమిత్ షాతో సహా అనేక మంది నేతలు కరోనా కు గురై చికిత్స పొందుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle